చర్చ:బాబ్రీ మసీదు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search


పేజీ పేరు[మార్చు]

"బాబ్రీ మసీదు" అనే పేరున్న పేజీలో మసీదు గురించి రాసిన దాని కంటే ఆ వివాదం గురించి రాసినదే ఎక్కువ ఉంది. ఇక ముందు కూడా మసీదు గురించిన సమాచారం వచ్చే అవకాశం పెద్దగా ఉన్నట్టు నాకు అనిపించడం లేదు (వస్తే మంచిదే). కూల్చివేతకు ఎలాగూ వేరే పేజీ ఉంది కాబట్టి ఆ సమాచారం ఇక్కడ పెద్దగా రాదు. వివాదం గురించి, కూల్చివేత తరువాత జరిగిన కోర్టు కేసులు, వివిధ వివాద పరిష్కార ప్రయత్నాలు, రామాలయ నిర్మాణం వగైరా గురించే ఎక్కువ ఇక్కడ వచ్చే అవకాశం ఉంది. అంచేత ఈ వ్యాసం పేరును "బాబ్రీ మసీదు - రామ జన్మభూమి వివాదం" అనో, "బాబ్రీ మసీదు వివాదం" అనో "రామ జన్మభూమి వివాదం" అనో మారిస్తే బాగుంటుంది. __చదువరి (చర్చరచనలు) 01:07, 18 డిసెంబరు 2020 (UTC)[ప్రత్యుత్తరం]

చదువరి గారూ, ఆంగ్ల వికీలో మసీదు గురించిన సమాచారం ఉంది. దాన్ని అనువదించి చేరుస్తాను. ప్రస్తుతానికి పేరు మార్పు అవసరం లేదని భావిస్తున్నాను. రవిచంద్ర (చర్చ) 06:02, 18 డిసెంబరు 2020 (UTC)[ప్రత్యుత్తరం]
రవిచంద్ర గారూ, సరేనండి. ధన్యవాదాలు. __చదువరి (చర్చరచనలు) 06:09, 18 డిసెంబరు 2020 (UTC)[ప్రత్యుత్తరం]