చిక్కుడు వంశీకృష్ణ

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చిక్కుడు వంశీకృష్ణ

పదవీ కాలం
3 డిసెంబర్ 2023 - ప్రస్తుతం
ముందు గువ్వల బాలరాజు
నియోజకవర్గం అచ్చంపేట

పదవీ కాలం
2004 - 2009
ముందు పి.రాములు
తరువాత పి.రాములు
నియోజకవర్గం అచ్చంపేట

వ్యక్తిగత వివరాలు

జననం 1965
ఎల్మపల్లి గ్రామం, అమ్రాబాద్ మండలం, నాగర్‌కర్నూల్ జిల్లా, తెలంగాణ రాష్ట్రం, భారతదేశం
జాతీయత  భారతీయుడు
రాజకీయ పార్టీ కాంగ్రెస్
తల్లిదండ్రులు బాలయ్య
జీవిత భాగస్వామి అనురాధ
సంతానం యశ్వంత్ & ఏక్తాముఖి

చిక్కుడు వంశీకృష్ణ తెలంగాణ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన 2023లో జరిగే శాసనసభ ఎన్నికల్లో అచ్చంపేట శాసనసభ నియోజకవర్గం నుండి కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.[1][2]

జననం, విద్యాభాస్యం[మార్చు]

చిక్కుడు వంశీకృష్ణ 1965లో తెలంగాణ రాష్ట్రం, నాగర్‌కర్నూల్ జిల్లా, అమ్రాబాద్ మండలం, ఎల్మపల్లి గ్రామంలో జన్మించాడు. ఆయన 1997లో ఎన్.టి.ఆర్ హెల్త్ యూనివర్సిటీ నుండి ఎంఎస్‌ సర్జన్‌ పూర్తి చేశాడు.[3]

ఎన్నికల్లో పోటీ[మార్చు]

చిక్కుడు వంశీకృష్ణ కాంగ్రెస్ పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి పార్టీలో వివిధ హోదాల్లో పని చేసి 2004లో జరిగిన ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికల్లో అచ్చంపేట నియోజకవర్గం నుండి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి టీడీపీ అభ్యర్థి పి.రాములుపై గెలిచి తొలిసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీకి ఎన్నికయ్యాడు. ఆయన ఆ తరువాత 2009లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయాడు.

తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తరువాత జరిగిన తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో 2014, 2018 ఎన్నికల్లో జరిగిన కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయాడు.[2] ఆయన 2023లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి[4] తన సమీప బీఆర్ఎస్ అభ్యర్థి గువ్వల బాలరాజుపై 49326 ఓట్ల భారీ మెజారిటీతో గెలిచి రెండోసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీకి ఎన్నికై[5], డిసెంబర్ 9న ఎమ్మెల్యేగా ప్రమాణస్వీకారం చేశాడు.[6]

సంవత్సరం గెలుపొందిన సభ్యుడు పార్టీ ప్రత్యర్థి ప్రత్యర్థి పార్టీ
1999 పి.రాములు తెలుగుదేశం పార్టీ చిక్కుడు వంశీకృష్ణ కాంగ్రెస్ పార్టీ
2004 చిక్కుడు వంశీకృష్ణ కాంగ్రెస్ పార్టీ పి.రాములు తెలుగుదేశం పార్టీ
2009 పి.రాములు తెలుగుదేశం పార్టీ చిక్కుడు వంశీకృష్ణ కాంగ్రెస్ పార్టీ
2014 గువ్వల బాలరాజు టీఆర్ఎస్ చిక్కుడు వంశీకృష్ణ కాంగ్రెస్ పార్టీ
2018 గువ్వల బాలరాజు టీఆర్ఎస్ చిక్కుడు వంశీకృష్ణ కాంగ్రెస్ పార్టీ
2023[5] చిక్కుడు వంశీకృష్ణ కాంగ్రెస్ పార్టీ గువ్వల బాలరాజు బీఆర్​ఎస్​

మూలాలు[మార్చు]

  1. TV9 Telugu (15 October 2023). "తెలంగాణ కాంగ్రెస్ అభ్యర్థుల తొలి జాబితా విడుదల.. పోటీలో నిలిచేది వీరే." TV9 Telugu. Archived from the original on 10 November 2023. Retrieved 10 November 2023.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)
  2. 2.0 2.1 Eenadu (10 November 2023). "రాజకీయాల్లో కొలువుదీరారు". Archived from the original on 10 November 2023. Retrieved 10 November 2023.
  3. Namaste Telangana (4 December 2023). "అసెంబ్లీకి ఎన్నికైన 15 మంది డాక్టర్లు.. ఇంజనీర్లు కూడా..!". Archived from the original on 20 December 2023. Retrieved 20 December 2023.
  4. News18 తెలుగు (4 December 2023). "అసెంబ్లీలో అధ్యక్షా అననున్న డాక్టర్లు.. ఎమ్మెల్యేలుగా 16 మంది వైద్యులు..!". Archived from the original on 4 December 2023. Retrieved 4 December 2023.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)
  5. 5.0 5.1 Eenadu (8 December 2023). "తెలంగాణ ఎన్నికల్లో విజేతలు వీరే". Archived from the original on 8 December 2023. Retrieved 8 December 2023.
  6. Namaste Telangana (9 December 2023). "ప్ర‌మాణ స్వీకారం చేసిన 101 మంది ఎమ్మెల్యేలు". Archived from the original on 20 December 2023. Retrieved 20 December 2023.