చిలకమర్తి లక్ష్మీనరసింహం స్వీయచరిత్ర

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
స్వీయచరిత్రము
రచయిత(లు)చిలకమర్తి లక్ష్మీనరసింహం
ప్రచురణ కర్తఆంధ్రరాష్ట్ర అభ్యుదయ రచయితల సంఘం

చిలకమర్తి లక్ష్మీనరసింహం (1867 - 1946) ప్రముఖ కవి, రచయిత, నాటక కర్త, పాత్రికేయుడు, సంఘ సంస్కరణవాది, విద్యావేత్త. 19వ శతాబ్దం చివర, 20వ శతాబ్దం ఆరంభ కాలంలో తెలుగు సాహిత్యం అభివృద్ధికి, తెలుగు నాట ఆధునిక భావాల వికాసానికి పట్టుకొమ్మలైన మహామహులలో చిలకమర్తి ఒకడు. ఇరవైరెండేళ్ళ వయస్సప్పుడు ఆయన రచించిన గయోపాఖ్యానం అనే నాటకం ప్రతులు లక్షకి పైబడి అమ్ముడుపోవటమనేది తెలుగు సాహిత్య చరిత్రలో కనీ, వినీ, ఎరగని విషయం. ఆయన స్వీయచరిత్ర ఈ గ్రంథం. ఈ పుస్తకంలోని విషయాలను ఇటీవల కాలంలో కూడా ఉన్నత పాఠశాల విద్యార్థులకు పాఠ్యాంశంగా పెట్టారు. తెలుగులో కందుకూరి వీరేశలింగం తర్వాత స్వీయ చరిత్రను రాసినవారు ఈయనే అని చెప్పవచ్చు.[1]

నేపథ్యం[మార్చు]

1928 లో రచయిత షష్టిపూర్తి సందర్భంగా మునగాల రాజావారైన నాయని వెంకటరంగారావు బహదూర్ ఆయనను స్వీయచరిత్ర రాయవలసిందిగా అభ్యర్థించాడు. ఇలాగే ఆయన మిత్రుల నుంచి కూడా ఇలాంటి అభ్యర్థనలు వచ్చినవి. తనలాంటి సామాన్యుడి చరిత్ర ఉపయుక్తమవుతుందో లేదో అని తటపటాయిస్తూ మొదటగా దీన్ని గురించి ఆలోచించలేదు. తర్వాత ఆయన బాల్యమిత్రులైన రాయసం వెంకట శివుడు, విస్సా అప్పారావు బలవంతం చేయసాగారు. కానీ అప్పటికే చిలకమర్తి ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నారు. పిఠాపురం రాజావారు ఈయనకు నెలకుముప్పది రూపాయలు జీతంగా ఇస్తున్నా, ఆయన మీద ఆధారపడి పలువురు ఉండటంతో అది సరిపోవడం లేదు. కనీసం నెలకు అరవై రూపాయలు లేనిచో తన జీవనం గడవడం కష్టంగా ఉందని వారికి విన్నవించాడు. అలాంటి పరిస్థితుల్లో ఉన్న చిలకమర్తి తన మనసు స్థిమితంగా ఉండక రాయడం కష్టం అవుతుందని చెప్పడంతో మిత్రులు ఆయనకు సహాయం చేస్తామనీ స్వీయచరిత్ర ప్రారంభించమని చెప్పారు. అప్పటికే ఆయన అంధుడు. అందుచేత 18-3-1942 నాడు తన గుమాస్తా చేత రాయించడం ప్రారంభించాడు.

మూలాలు[మార్చు]

  1. "ఆత్మకథ, వ్యాసాలు, పీఠికలు, అభిప్రాయాలు, రేడియో ప్రసంగాలు" (PDF). శోధ్ గంగ.{{cite web}}: CS1 maint: url-status (link)

బయటి లింకులు[మార్చు]