చుండ్రు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
Dandruff
వర్గీకరణ & బయటి వనరులు
A large flake of dandruff combed from a beard
m:en:ICD-9 {{{m:en:ICD9}}}
DiseasesDB 11911

చుండ్రు (Dandruff) ఒకరకమైన చర్మవ్యాధి.ఆంగ్లంలో Pityriasis simplex capillitii అంటారు.చుండ్రు లక్షణాలు

చుండ్రు లక్షణాలు[మార్చు]

  • హెయిర్ ఫాల్
  • డ్రై, డల్ హెయిర్
  • మలబద్దకం, అపక్రమ బౌల్ సిండ్రోమ్ [1]
  • పొలుసుల చర్మం
  • ఛాతీపై దద్దుర్లు
  • తల దురదగా ఉండటం
  • నెత్తిమీద ఎరుపు రంగు రావడం
  • చెవి తామర
  • నెత్తిమీద తెల్లటి రేకులు
  • పొడి రేకులు కలిగిన జిడ్డుగల చర్మం
  • కనుబొమ్మ , కనురెప్ప, గడ్డంలో దద్దుర్లు
  • దురదగ అనిపించడం[2]

కారణాలు[మార్చు]

  • పొడిబారిన చర్మము
  • మాలసేజ్యా ఫంగల్ ఇన్ఫెక్షన్
  • షాంపూ తగినంత వాడకపోవడం[3]
  • సెబమ్ యొక్క అధిక ఉత్పత్తి
  • సూక్ష్మజీవులు
  • సోబోర్హెమిక్ డెర్మటైటిస్

నివారణ చర్యలు[మార్చు]

  1. ఇతరుల దువ్వెనలను, బ్రెష్‌లను, తువ్వాళ్ళను వాడకూడదు. తమ వస్తువులను ఇతరులకు ఇవ్వకూడదు.
  2. వారానికి ఒకసారి పరిశుద్ధమైన కొబ్బరినూనెను కానీ, ఆలివ్ నూనెను కానీ వెచ్చ చేసి, తలకు పట్టించి, సున్నితంగా మర్దన చేయాలి. ఆ తర్వాత కుంకుడుకాయలు, శీకాయపొడిని ఉపయోగించి, తలస్నానం చేయాలి.
  3. తలస్నానం చేసే నీళ్ళు పరిశుభ్రంగా ఉండాలి. పొగలు కక్కే వేడినీటిని కానీ, మరీ చన్నీటిని కానీ తల స్నానానికి ఉపయోగించకూడదు. గోరువెచ్చని నీటిని మాత్రమే తలస్నానానికి ఉపయోగించాలి.
  4. వెంట్రుకలకు రాయటానికి పరిశుభ్రమైన కొబ్బరి నూనె వాడాలి. రసాయనాలు కలిసిన హెయిర్‌ ఆయిల్స్‌ను వాడకూడదు.
  5. ఇతరుల దుప్పట్లను, తలగడలను వాడకూడదు.
  6. చుండ్రుతో బాధపడేవారు పొగరేగే ప్రాంతాలలో తప్పనిసరిగా ఉండవలసి వచ్చినప్పుడు తలకు ఆచ్ఛాదనగా టోపీ పెట్టుకోవడం కానీ, బట్టను కట్టుకోవడం కానీ చేయాలి.
  7. చుండ్రుతో బాధపడేవారు తలగడ గలీబులను వేడినీటిలో నానబెట్టి, శుభ్రంగా ఉతికి ఎండలో ఆర వేయాలి.
  8. తీక్షణమైన ఎండ కూడా వెంట్రుకల ఆరోగ్యాన్ని దెబ్బ తీస్తుంది.
  9. తలంటు స్నానానికి షాంపూలు, సబ్బులు ఉపయోగించకుండా, కుంకుడు కాయల రసం లేదా పొడి, సీకాయ పొడినే వాడాలి.
  10. పోషకాహార లోపం ఏర్పడకుండా సంతులిత ఆహారాన్ని తీసుకోవాలి.
  11. నిద్రలేమి ఏర్పడకుండా చూసుకోవాలి.
  12. తల దువ్వుకునే దువ్వెనలో పళ్ళ మధ్య మట్టి పేరుకోకుండా శుభ్రపరుస్తూ, దువ్వెనలను వారానికి ఒకసారి వేడి నీటితో శుభ్రపరచడం మంచిది.
  13. వెంట్రుకల కుదుళ్ళలోకి ఇంకేటట్లుగా కొబ్బరి నూనె తలకు రాసినప్పుడు వేళ్ళతో సున్నితంగా మసాజ్‌ చేయాలి.
  14. వేసవిలో చెమట వల్ల, వానాకాలంలో తల తడవడం వల్ల వెండ్రుకలు అపరిశుభ్రమవుతాయి. వారానికి రెండుసార్లు గోరువెచ్చని నీటితో తలస్నానం చేస్తే వెంట్రుకల ఆరోగ్యం బాగుంటుంది.
  15. పుదీనా రసం మాడుకి పట్టించి అరగంట తర్వాత తలని శుభ్రపరిస్తే చుండ్రు సమస్య ఉండదు.
  16. మందార ఆకులు :జుట్టుకు కండిషనర్ మందార ఆకులు, పువ్వు రేకులను పేస్ట్ చేసి జుట్టుకు ఒక సహజ కండీషనర్ వలె ఉపయోగిస్తారు. జుట్టు ముదురు రంగులో మారటానికి, చుండ్రు తగ్గించడానికి సహాయపడుతుంది.
  17. మెంతి: మెంతి ఆకును దంచి పేస్ట్ లా చేసి తలకు రాస్తే చుండ్రు, వెండ్రుకలు రాలడం తగ్గుతాయి. వెండ్రుకలు నిగనిగలాడతాయి.
  18. వేపాకు:తలలో చుండ్రు ఏర్పడితే తాజా వేపాకులను మెత్తగా నూరి, ఆ ముద్దను తలకు పట్టించి, ఓ పావుగంటయిన తర్వాత తలస్నానం చేయాలి. ఆ విధంగా తలస్నానం చేస్తే వెంట్రుకల చుండ్రు తొలగిపోయి తల శుభ్రంగా ఉంటుంది.
  19. గసగసాలు:గసగసాలు కొద్దిగా తీసుకొని, సన్నని మంట పై వేయించి, కొద్దిగా గోరువెచ్చటి నీటి లో 4 నుండి 5 గంటలు నానబెట్టి ఆ మిశ్రమాన్ని,తలకు పట్టించి, 1 గంట ఆగి తల స్నానం చేయాలి
  20. వస కొమ్ము పొడి :కొద్దిగా వస కొమ్ము పొడిని తీసుకొని, దానికి నీటిని కలిపి జుత్తు కుదుళ్ళకు పట్టించాలి. దీని వల్ల కొద్దిగ మంటగా ఉండవచ్చు.10 నుండి 15 నిమిషాల తరువాత తలస్నానం చేయాలి
  21. వెనిగర్ :మార్కెట్లో దొరికే నాణ్యమైన వెనిగర్ బాటిల్ను తెచ్చుకుని ఆరు చెంచాల నీళ్లకు రెండు చెంచాల వెనిగర్ చొప్పున కలుపుకోవాలి. ఇలా కలిపిన మిశ్రమాన్ని తలకు పట్టించి అరగంట తర్వాత స్నానం చేయాలి.ఇలా వారానికి ఒకసారి చేసినట్లయితే కేవలం నాలుగు నెలల్లో మీ చుండ్రు సమస్య నివారణ అవుతుంది
  22. పెరుగు, ఉసిరికాయ పొడి:చుండ్రు సమస్యతో సతమతమయ్యేవారు పెరుగులో కొంచెం ఉసిరికాయ పొడినికలిపి తలకి పట్టించి అరగంట తర్వాత స్నానం చేస్తే మంచి ఫలితాలు వస్తాయి.
  23. రెండు టేబుల్ స్పూన్ల మెంతులు తీసుకొని నీటి లో వేసి రాత్రి మొత్తం నానపెట్టి, ఉదయం ఆ మిశ్రమాన్ని పేస్ట్ లాగా చేసి తలకి పట్టించి అరగంట తర్వాత స్నానం చేయాలి.
  24. అలోవెరా జెల్ ని తలకి పట్టించి గంట తర్వాత స్నానం చేయాలి. ఇలా రోజు చేస్తే చుండ్రు తొలగిపోయి తల శుభ్రంగా ఉంటుంది.

చిట్కాలు[మార్చు]

1.చుండ్రు మృత చర్మం వలన తయరవుతుంది. కావున గుండు చెయంచుకునెప్పుడు ఆ మృత చర్మంను తోలగించమని కోరుకొవాలి. ఆ తరువాత ప్రతి రోజు కొబ్బరి నూనె రాసుకుంటె మృత చర్మం తయరవదు, చుండ్రు రాదు.

2.మెంతులు చుండ్రుని తొలగించటంలో సహాయపడతాయి. రెండు టేబుల్ స్పూన్ మెంతుల్ని రాత్రింతా నీటిలో నానపెట్టాలి. ఉదయం వాటిని గ్రైండ్ చేసి 2 టేబుల్ స్పూన్ ఆపిల్ సీడర్ వెనిగర్‌ను కలుపుకోండి. ఈ మిశ్రమాన్ని స్కాల్ప్ పై రాసి ఆరిన తరువాత తలస్నానం చేయండి. ఆపిల్ సీడర్ వెనిగర్ లేకపోతే నిమ్మరసాన్ని కలుపుకోవచ్చు. మరో రెమెడీ – మెంతుల గింజలను బాగా రుబ్బి పెరుగుతో కలిపి స్కాల్ప్ పై రాసి గంట తరువాత కడగండి.

3.బేకింగ్ సోడాలో యాంటీ ఫంగల్ లక్షణాలు ఉంటాయి. డాండ్రఫ్ తొలగించటంలో ఇది ప్రభావితంగా పనిచేస్తుంది. 2 టేబుల్ స్పూన్ బేకింగ్ సోడా, 2 టేబుల్ స్పూన్ నీటిని మిక్స్ చేసి తలకు పట్టించి మసాజ్ చేసి రెండు లేదా మూడు నిమిషాల తరువాత తలస్నానం చేయండి. బేకింగ్ సోడా వల్ల తలపై ఉన్న చుండ్రు మొత్తం రాలిపోతుంది. ఇలా తరచూ చేస్తే మంచి ఫలితాలను పొందుతారు.[4]

4.మీ తలలో చుండ్రు వల్ల బాగా దురద వస్తే దానికి కలబంద ఒక మంచి పరిష్కారం. కలబంద జెల్ ను స్కాల్ప్ పై రాసుకోవాలి. కొంత సేపు తర్వాత వాష్ చేసుకోవాలి.

5. చుండ్రు సమస్యని పోగొట్టుకోవాలంటే ముందుగా జుట్టుని ఎప్పటికప్పుడు శుభ్రంగా ఉంచుకోవడం చాలా ముఖ్యం. అందుకే వారానికి రెండు లేదా మూడు సార్లు తలస్నానం చేస్తుండాలి. లేకపోతే జుట్టులో తేమ చేరి అది చుండ్రుకి కారణం అవుతుంది. కాబట్టి తలస్నానం చేస్తుండాలి.

మూలాలు[మార్చు]

  1. https://telugu.boldsky.com/beauty/hair-care/2014/top-5-symptoms-dandruff-008728.html
  2. https://skinkraft.com/blogs/articles/dandruff-causes-treatments
  3. https://www.myupchar.com/te/disease/dandruff
  4. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2019-09-22. Retrieved 2019-11-21.

సహజమైన పద్దతులు

చుండ్రు సమస్య

చుండ్రు నివారణ ఎలా?

చిట్కాలు

"https://te.wikipedia.org/w/index.php?title=చుండ్రు&oldid=3912769" నుండి వెలికితీశారు