చెన్నూరు ఎత్తిపోతల పథకం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చెన్నూరు ఎత్తిపోతల పథకం
ప్రదేశంచెన్నూరు నియోజకవర్గ పరిధి, తెలంగాణ
ఆవశ్యకతవ్యవసాయానికి నీరు
స్థితినిర్మాణంలో వున్నది
నిర్మాణం ప్రారంభం2023, జూన్ 9
నిర్మాణ వ్యయం1,658 కోట్లు
యజమానితెలంగాణ ప్రభుత్వం
నిర్వాహకులుతెలంగాణ నీటిపారుదల శాఖ
ఆనకట్ట - స్రావణ మార్గాలు
Spillway typeChute spillway
Website
నీటిపారుదల శాఖ వెబ్సైటు

చెన్నూరు ఎత్తిపోతల పథకం అనేది తెలంగాణ రాష్ట్రంలోని చెన్నూరు నియోజకవర్గ పరిధిలో నిర్మిస్తున్న ఎత్తిపోతల పథకం. చెన్నూర్ నియోజకవర్గంలోని 98వేల ఎకరాలకు సాగునీరు అందించేందుకు 1,658 కోట్ల రూపాయలతో తెలంగాణ ప్రభుత్వం ఎత్తిపోతల పథకాన్ని నిర్మిస్తోంది.[1]

మంజూరు[మార్చు]

చెన్నూరు ఎత్తిపోతల పథకానికి 1658 కోట్ల రూపాయలను మంజూరు చేస్తూ 2022, ఏప్రిల్ 23న ప్రభుత్వం జీవో (జీవో ఆర్.టీ నెంబర్. 133) జారీ చేసింది. కాళేశ్వరం ప్రాజెక్టు నుండి 10 టీఎంసీల నీటిని కేటాయిస్తూ, మూడు లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుల నిర్మాణం కోసం నిధులు మంజూరు చేసింది.[2][3]

శంకుస్థాపన[మార్చు]

చెన్నూరు ఎత్తిపోతల పథక నిర్మాణ పనులకు 2023, జూన్ 9న తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు శంకుస్థాపన చేశాడు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర రోడ్లు భవనాల శాఖామంత్రి వేముల ప్ర‌శాంత్ రెడ్డి, దేవాదాయ శాఖామంత్రి అల్లోల ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి, బీసి సంక్షేమ శాఖామంత్రి గంగుల క‌మ‌లాక‌ర్, పెద్దపల్లి ఎంపీ బోర్లకుంట వెంకటేశ్ నేత, చెన్నూర్ ఎమ్మెల్యే బాల్క సుమ‌న్, మంచిర్యాల ఎమ్మెల్యే నడిపల్లి దివాకర్ రావు, బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్న‌య్య‌, ఆదిలాబాదు ఎమ్మెల్యే జోగు రామ‌న్న‌, ఖానాపూర్ ఎమ్మెల్యే ఆజ్మీరా రేఖా నాయ‌క్‌తోపాటు జిల్లా ఇతర ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.[4][5]

మూలాలు[మార్చు]

  1. "రూ.1658 కోట్లతో చెన్నూరు ఎత్తిపోతల". EENADU. 2022-04-24. Archived from the original on 2022-04-25. Retrieved 2023-06-14.
  2. "Breaking: చెన్నూరు ఎత్తిపోతల పథకానికి 1658 కోట్లు.. జీవో జారీ చేసిన ప్రభుత్వం". Prabha News. 2022-04-23. Archived from the original on 2022-04-23. Retrieved 2023-06-14.
  3. telugu, NT News (2022-04-23). "చెన్నూరు ఎత్తిపోతల పథకానికి నిధులు మంజూరు". www.ntnews.com. Archived from the original on 2022-04-23. Retrieved 2023-06-14.
  4. "Mancherial: సమీకృత కలెక్టరేట్‌ కార్యాలయాన్ని ప్రారంభించిన కేసీఆర్‌". EENADU. 2023-06-09. Archived from the original on 2023-06-10. Retrieved 2023-06-10.
  5. Velugu, V6 (2023-06-09). "మంచిర్యాల జిల్లా క‌లెక్టరేట్‌ను ప్రారంభించిన సీఎం కేసీఆర్". V6 Velugu. Archived from the original on 2023-06-10. Retrieved 2023-06-10.{{cite web}}: CS1 maint: numeric names: authors list (link)