ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టు

వికీపీడియా నుండి

కృష్ణా నదిపై ప్రాజెక్టులు
ప్రకాశం బారేజి
నాగార్జునసాగర్
శ్రీశైలం
తెలుగుగంగ
ఎ.మాధవరెడ్డి ప్రాజెక్టు
శ్రీశైలం కుడి బ్రాంచి కాలువ
పులిచింతల
ప్రియదర్శిని జూరాల
పోతిరెడ్డిపాడు
ట్రిబ్యునళ్ళు
బచావత్ ట్రిబ్యునల్
జూరాల ప్రాజెక్ట్

మహబూబ్ నగర్ జిల్లా లోని ప్రముఖ ప్రాజెక్టులలో జూరాలా ప్రాజెక్టు ఒకటి. కృష్ణా నది ఆంధ్రప్రదేశ్ లో ప్రవేశించిన తరువాత ఈ నదిపై ఉన్న మొదటి ప్రాజెక్టు ఇదే.ఈ ప్రాజెక్టు నిర్మాణాన్ని 1981 లో ప్రారంబించారు. 1996 లో మొదటి దశ కింద నీటిని విడుదల చేశారు. నిర్మాణం పూర్తి కావడానికి సుమారు 15 సం.లు పట్టింది. ప్రాజెక్టు నిర్మాణానికి అంచనా వ్యయం రూ.76.40 కోట్లు కాగా వాస్తవంగా సుమారు రూ.550 కోట్లు ఖర్చయింది. ఈ ప్రాజెక్టు కింద మొత్తం లక్ష ఎకరాల ఆయకట్టు బూమి ఉంది. ఆత్మకూరు నుంచి గద్వాల వెళ్ళు రోడ్డు మార్గములో ఆత్మకూరు పట్టణానికి 15 కిలోమీటర్ల దూరంలో ఈ ప్రాజెక్టు ఉంది.[1] ఆత్మకూరు-గద్వాల రహదారి ఈ ప్రాజెక్టు పైనుంచి వెళుతుంది. ఇది పర్యాటక స్థలంగా కూడా విలసిల్లుతోంది. ఇక్కడ 240 మెగావాట్ల జలవిద్యుత్ ఉత్పాదన కేంద్రం నిర్మించి ఇటీవలే విద్యుత్ ఉత్పత్తి ప్రారంభించారు.

[మార్చు] ప్రాజెక్టు సాగునీటి సామర్థ్యం

ఈ ప్రాజెక్టు సుమారు లక్ష ఎకరాలకు సాగునీరు అందిస్తుంది. ఆత్మకూరు, గద్వాల, వనపర్తి నియోజకవర్గాల రైతులకు ఇది ప్రయోజనకరంగా ఉంది. ప్రాజెక్టు కుడి కాల్వకు సోమనాద్రి కాలువగా, ఎడమ కాల్వకు ఎన్టీఆర్ కాల్వగా పిలుస్తారు.

[మార్చు] మూలాలు

  1. ఈనాడు దినపత్రిక, మహబూబ్‌నగర్ జిల్లా ఎడిషన్, పేజీ 9, తేది జూన్ 11, 2008
పేజీకి సంభందించిన లింకులు