జయంతి నటరాజన్
మూస:UnreferencedBLP మూస:Citations missing
| Jayanthi Natarajan | |
| జయంతి నటరాజన్ |
|
| నియోజకవర్గము | Tamil Nadu |
|---|---|
|
|
|
| జననం | జూన్ 7 1954 (వయసు 57) Chennai, India |
| రాజకీయ పార్టీ | Indian National Congress |
| భార్య/భర్త | V.K. Natarajan |
| సంతానము | one son |
| నివాసము | New Delhi |
| మతం | Hindu |
| 26 January, 2007
|
|
జయంతి నటరాజన్ (1954 జూన్ 7న జన్మించారు) ఒక భారతీయ న్యాయవాది, రాజకీయనేత. ఈమె భారత జాతీయ కాంగ్రెస్ సభ్యురాలు, పార్లమెంట్ సభ్యురాలిగా తమిళనాడు రాష్ట్రం తరపున రాజ్యసభకు మూడుసార్లు ఎంపికయ్యారు. ఈమె కేంద్ర మంత్రిమండలిలో మంత్రిగా కూడా పనిచేశారు.
విషయ సూచిక |
[మార్చు] ప్రారంభ సంవత్సరాలు
జయంతి నటరాజన్ తమిళనాడులో ఒక ముదలియార్ కుటుంబంలో పుట్టారు. ఈమె తాతగారు ఎమ్. భక్తవత్సలం ప్రముఖ కాంగ్రెస్ రాజకీయనేత మరియు 1963 నుంచి 1967 మధ్య కాలంలో తమిళనాడు ముఖ్యమంత్రిగా పనిచేశారు. జయంతి న్యాయశాస్త్రం చదివి మద్రాసులో న్యాయవాదిగా ప్రాక్టీస్ చేశారు. తన వాణిజ్యపరమైన ప్రాక్టీసుతో పాటుగా ఈమె అఖిల భారత మహిళా వేదిక, న్యాయ సహాయ మండలి వంటి పలు సాంఘిక సంస్థలలో సభ్యురాలిగా లాభాపేక్ష లేని పనులలో పాలు పంచుకున్నారు. [2]
[మార్చు] రాజకీయ జీవితం
[మార్చు] కాంగ్రెస్ సంవత్సరాలు
1980లలో ఈమెను రాజీవ్‌గాంధీ గుర్తించినప్పుడు ఆమె రాజకీయ జీవితం ప్రారంభమైంది. ఈమె మొట్టమొదటిసారిగా రాజ్యసభకు 1986లో ఎంపికయ్యారు తర్వాత 1992లో మరోసారి ఎంపికయ్యారు.
[మార్చు] తమిళ మానిల కాంగ్రెస్
90లలో జయంతి నటరాజన్ తమిళనాడుకు చెందిన ఇతర నేతలు నరసింహారావు వైఖరితో విసిగిపోయి పార్టీనుంచి వైదొలగాలని నిర్ణయించుకున్నారు. వీరు G K మూపనార్ ఆధ్వర్యంలో తమిళ మానిల కాంగ్రెస్‌ను స్థాపించారు. జయంతి నటరాజన్ రాజ్యసభనుంచి రాజీనామా చేసి 1997లో TMC సభ్యురాలిగా తిరిగి ఎంపికయ్యారు.
TMC తమిళనాడులో ద్రవిడ మున్నేట్ర కజగంతో పొత్తు కుదుర్చుకుని కేంద్రంలో యునైటెడ్ ఫ్రంట్ ప్రభుత్వంలో భాగమైంది. జయంతి నటరాజన్ 1997లో బొగ్గు, పౌర విమానయానం, పార్లమెంటరీ వ్యవహారాల సహాయ మంత్రిగా నియమితులయ్యారు.
ఈమె కుమారుడు న్యాయవాదిగా ప్రాక్టీస్ చేస్తున్నారు.
[మార్చు] కాంగ్రెస్‌లోకి పునరాగమనం
మూపనార్ మృతితో TMC నేతలు కాంగ్రెస్‌లో విలీనం కావాలని నిర్ణయించుకున్నారు. జయంతి నటరాజన్‌ని సోనియా గాంధీ గుర్తించి ఆమెను పార్టీ అధికారిక వ్యాఖ్యాతగా నియమించారు.