జ్వాల
జ్వాల లేదా జ్యోతి (Flame) దీపం లేదా అగ్ని నుండి వెలువడే మంట. ఇది సాధారణంగా దృశ్య కాంతిని వెదజల్లే భాగంగా పేర్కొంటారు. భౌతికంగా జ్వాల నుండే వేడిమి పుడుతుంది.
జ్వాల యొక్క రంగు మరియు ఉష్ణోగ్రత లు దానికి కారణమైన ఇంధనం మీద ఆధారపడు వుంటుంది. కొవ్వొత్తిని వెలిగించినప్పుడు వత్తిలోని ఇంధనం మండి ఆవిరి అవుతుంది. ఈ స్థితిలో అది ఆమ్లజనితో చర్య వలన ఉష్ణం జనించి, మరికొంత ఇంధనం మండుతుంది. ఈ విధంగా ఇంధనం ఉండేటంత వరకు కొవ్వొత్తి మండుతూనే ఉంటుంది. జ్వాలలో జనించిన శక్తి కొన్ని ఎలక్టాన్ లను ఉత్తేజ పరచి కాంతిని విడుదల చేస్తుంది.
ఆమ్లజని కాకుండా ఇతర మూలకాలు కూడా జ్వాలను కలిగించగలవు. హైడ్రోజన్ ను క్లోరీన్ లో మండించినప్పుడు వాయు రూపంలోని హైడ్రోజన్ క్లోరైడ్ (HCl) ఉత్పత్తి అవుతుంది.[1] రాకెట్ ఇంజన్ లో హైడ్రజిన్ మరియు నైట్రోజన్ టెట్రాక్సైడ్ ఇంధనంగా వాడుతారు.
జ్వాలలో చాలా రకాల క్లిష్టమైన చర్యలు జరుగుతాయి. ఉదాహరణకు సహజ వాయువు మండినప్పుడు సుమారు 53 జాతులు మరియు 325 రకాల ప్రాధమిక చర్యలు జరుగుతాయని గుర్తించారు.[2]
జ్వాలా వర్ణం[మార్చు]
మూలాలు[మార్చు]
- ↑ Reaction of Chlorine with Hydrogen
- ↑ Gregory P. Smith; David M. Golden, Michael Frenklach, Nigel W. Moriarty, Boris Eiteneer, Mikhail Goldenberg, C. Thomas Bowman, Ronald K. Hanson, Soonho Song, William C. Gardiner, Jr., Vitali V. Lissianski, and Zhiwei Qin, GRI-Mech 3.0, http://www.me.berkeley.edu/gri_mech/