తురుమెళ్ళ శంకర నారాయణ

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

తురుమెళ్ళ శంకర నారాయణ హాస్యబ్రహ్మ, హాస్యావదాన సామ్రాట్‌ బిరుదాంకితులు, హాస్యావధాని.[1] ఆయనకు 2015లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం "హ్యాస్యావధానం" విభాగంలో ఉగాది పురస్కారాన్నిచ్చి సత్కరించింది.[2] ఈయన "హాస్యబ్రహ్మ శంకరనారాయణ" గా సుపరిచితులు.

జీవిత విశేషాలు[మార్చు]

వీరు తన హాస్యావధానంతో, వివిధ పుస్తకాలతోపాతు, పాత్రికేయరంగంలో గూడా లబ్ధ ప్రతిష్ఠులు. ప్రస్తుతం వీరు తెలుగువెలుగు మాసపత్రికతోపాటు, ఈనాడు దినపత్రికకు గూడా తన సేవలందించుచున్నారు. హాస్యావధానానికి ప్రజలలో విశిష్ట గుర్తింపు తెచ్చిన శంకరనారాయణ, సాహితీరంగంలో, "ఫన్ పరాగ్" వంటి రచనలతో తనకంటూ ఒక ప్రత్యేకస్థానం సంపాదించుకున్నారు. మన్మధనామ సంవత్సరం ఉగాది సందర్భంగా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభ్త్వం వీరిని ఉగాది పురస్కారానికి ఎంపిక చేసారు. వీరికి ఈ పురస్కారాన్ని, గుంటూరు జిల్లా, తుళ్ళూరు మండలంలోని అనంతవరం గ్రామంలో 2015, మార్చి-21వ తేదీ ఉగాది రోజున అందజేసారు.[3]

ఆయన దేశ,విదేశాలలో అనేక హాస్యావధాన ప్రదర్శనలనిచ్చారు.[4]

రచనలు[మార్చు]

  • ఇంగ్లీషుకు తల్లి తెలుగు (భాషా సాహిత్య హాస్య విమర్శలు):[5] ఈ పుస్తకంలో అలాంటి భాషా విన్యాసాలూ, సాహితీ చమత్కారాలూ అనేకం. ఓ వ్యాసంలో, స్వచ్ఛమైన ఆంగ్ల పదాలతో అచ్చమైన తెలుగు హాస్యాన్ని సృష్టించారు. తెలుగు ‘బడుద్ధాయి’ లోంచే ‘బ్యాడ్‌’ అన్న మాట పుట్టిందని బల్లగుద్ది వాదించారు. మరో వ్యాసంలో, అపార్థాల వెనుక ఉన్న అపారమైన చరిత్రను సోదాహరణంగా వివరించారు. ‘గుళ్లొ తప్ప ఎక్కడ గోవిందా అన్నా సొమ్ము పోయిందా? అనే అడుగుతారు’ అని వాపోయారు. అలా అలా, నవ్వుతూ నవ్వుతూనే పాఠకుడు తెలుగు భాషతో లవ్వులో పడిపోతాడు.[6]

మూలాలు[మార్చు]

  1. ‘Fun doctor’ sets off peals of laughter
  2. "AP Ugadi Puraskaralu 2015". Archived from the original on 2016-04-16. Retrieved 2017-05-03. {{cite web}}: More than one of |archivedate= and |archive-date= specified (help); More than one of |archiveurl= and |archive-url= specified (help)
  3. ఈనాడు ప్రకాశం; 2015, మార్చి-20; 15వపేజీ.
  4. Narayana Narayana!, The Hindu
  5. "ఈనాడు పుస్తక పరిచయాలు". Archived from the original on 2017-05-07. Retrieved 2017-05-03.
  6. హాస్యబ్రహ్మ శంకరనారాయణ సేవలు ప్రశంసనీయం[permanent dead link]

ఇరత లింకులు[మార్చు]