తెలంగాణ అటవీశాఖ

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
తెలంగాణ అటవీశాఖ
సంస్థ వివరాలు
స్థాపన 2014
అధికార పరిధి తెలంగాణ ప్రభుత్వం
ప్రధానకార్యాలయం హైదరాబాద్, తెలంగాణ
సంబంధిత మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి
కార్యనిర్వాహకులు పి.కె. శర్మ
వెబ్‌సైటు
అధికారిక వెబ్ సైట్

తెలంగాణ అటవీశాఖ తెలంగాణ రాష్ట్రంలోని అడవులను అభివృద్ధి చేయడంకోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంచే ఏర్పాటు చేయబడిన శాఖ. ఈ శాఖ 2014, జూన్ 2 న ఆంధ్రప్రదేశ్ అటవీశాఖ నుండి విడిపోయింది. దీనికి అటవీ ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ ప్రాతినిధ్యం వహిస్తారు. తెలంగాణ రాష్ట్రంలో ఉన్న అడవుల రక్షణ, నిర్వహణే ఈ శాఖ యొక్క ప్రాథమిక విధి.

ఏటూరునాగారం వన్యప్రాణుల అభయారణ్యం

తెలంగాణ రాష్ట్రంలో ఇరవై శాతం మాత్రమే అడవులు ఉన్నాయని, వచ్చే ఐదేళ్లలో 33 శాతానికి విస్తరించాలన్న లక్ష్యంతో తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తుంది.[1]

వృక్షజాలం, జంతుజాలం[మార్చు]

భారత ఉపఖండంలోని మధ్య ప్రాంతంలో ఉన్న తెలంగాణలో అనేక వృక్ష, జంతుజాలాలు ఉన్నాయి. రాష్ట్రంలో కనిపించే వృక్షసంపద ఎక్కువగా టేకు మిశ్రమంతో పొడి ఆకురాల్చే రకం, టెర్మినలియా, టెరోకార్పస్, అనోజిసస్ మొదలైన జాతులకు చెందినవి. అడవులలో పులి, పాంథర్, తోడేలు, అడవి కుక్క, హైనా, ఎలుగుబంటి, గౌర్, బ్లాక్ బక్, చింకారా, చౌసింగ, నీల్‌గై, చీటల్, సాంబార్, బార్కింగ్ డీర్[2] మెదలైన జంతువులతోపాటు అనేక పక్షులు, సరీసృపాలు ఉన్నాయి.

లక్ష్యాలు[మార్చు]

అడవులు, అరణ్య ప్రాంతాలలో జీవవైవిధ్యం, పర్యావరణ వ్యవస్థలను సంరక్షించడం, రాష్ట్ర నీటి భద్రత, ఆహార భద్రతను నిర్ధారించడం తెలంగాణ అటవీ శాఖ ముఖ్య లక్ష్యాలు. వన్యప్రాణులు, వన్యప్రాణుల ఆవాసాలు రాష్ట్రంలోని ప్రస్తుత, భవిష్యత్తు తరాల ప్రజల సామాజిక, ఆర్థిక, పర్యావరణ, సాంస్కృతిక, వినోద, ఆధ్యాత్మిక అవసరాలను తీర్చడానికి సంరక్షించబడాలి, స్థిరంగా నిర్వహించబడాలి.

హరితహారం[మార్చు]

తెలంగాణను సస్యశ్యామలం చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం 2015 జూలై 3న చిలుకూరి బాలాజీ ఆలయ ప్రాంగణంలో తెలంగాణకు హరితహారం[3] అనే పథకాన్ని ప్రారంభించింది.[4] తెలంగాణలో మొత్తంలో (తెలంగాణ భూభాగంలో 33%) మొక్కలను నాటి, పచ్చదనం కనిపించాలనే లక్ష్యంతో తెలంగాణ ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని రూపొందించింది. ఈ పథకంలో భాగంగా 2015-16 నుండి 2020-21 సెప్టెంబరు నెల నాటికి 176.52 కోట్ల మొక్కలు నాటబడ్డాయి. తెలంగాణ రాష్ట్రంలో 2015-16 నుండి 2020-21 సెప్టెంబరు నెల నాటికి 176.52 కోట్ల మొక్కలను నాటబడ్డాయి. దేశంలోనే మొక్కల పెంపకంలో తెలంగాణ రాష్ట్రం ప్రథమ స్థానంలో నిలిచిందని అటవీ, పర్యావరణ శాఖ సహాయ మంత్రి బాబుల్ సుప్రియో పార్లమెంటులో ప్రకటించాడు.[5]

2023, జూన్ నాటికి 10,822 కోట్ల రూపాయలు ఖర్చుచేసి 273.33 కోట్ల మొక్కలు నాటింది.[6] 13,657 ఎకరాల విస్తీర్ణంలో 19,472 పల్లె ప్రకృతి వనాల ఏర్పాటు జరిగింది. 6,298 ఎకరాల విస్తీర్ణంలో 2,011 బృహత్‌ ప్రకృతి వనాలు ఏర్పాటయ్యాయి. 1,00,691 కిలోమీటర్ల మేర రాష్ట్రం అంతటా రహదారి వనాలు విస్తరించుకొని ఉన్నాయి.[7]

నిర్వహణ[మార్చు]

ఫారెస్ట్ డిపార్ట్‌మెంట్‌కు ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్‌లు ఇన్‌ఛార్జ్‌గా ఉంటారు. అన్ని ముఖ్యమైన ఆర్డర్‌లు, అనుమతులు, డిక్లరేషన్‌లు, అధికారాలను వ్యక్తిగతంగా సమీక్షించాలి, ఆమోదించాలి, సంతకం చేయాలి.

కార్యక్రమాలు[మార్చు]

  • చెట్ల పెంపకంపై చట్టం: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతీ గ్రామంలో చెట్ల పెంపకాన్ని ప్రోత్సహించడం కోసం ఒక చట్టం చేసింది. ప్రతీ గ్రామంలో నర్సరీ ఏర్పాటు చేసి, మొక్కలు నాటాలని, వాటిని రక్షించాలని, గ్రామంలో పచ్చదనం, పరిశుభ్రత పెంచాలని, ఇది గ్రామ సర్పంచ్, పంచాయతీ కార్యదర్శి బాధ్యత అని చట్టంలో పేర్కొన్నారు.
  • అటవీ భూములు సర్వే: అడవుల రక్షణ, ఆదివాసీ, గిరిజన రైతు బిడ్డలకు భరోసా, ప్రభుత్వభూమి లెక్కల్లో పారదర్శకత, కబ్జాదారుల కట్టడి మొదలైనవి లక్ష్యాలుగా అడవి లెక్కలు తేల్చాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించి, రెవెన్యూ సర్వేయర్లు, అటవీ అధికారులతో కూడిన స్పెషల్ టాస్క్‌ఫోర్స్ బృందాలతో 2019 జనవరి మొదటివారంలో అటవీ భూముల సర్వే మొదలు పెట్టింది.
  • వన్యప్రాణుల సంరక్షణ బోర్డు: రాష్ట్రంలోని వన్యప్రాణుల రక్షణకోసం 2019, డిసెంబరు 18న ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు చైర్మన్ గా రాష్ట్ర వన్యప్రాణుల సంరక్షణ బోర్డు ఏర్పాటుచేయబడింది. ఈ బోర్డులో వైస్ చైర్మన్ గా అటవీశాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, సభ్యులుగా ఎమ్మెల్యేలు కోనేరు కోనప్ప, మర్రి జనార్ధన్ రెడ్డి, వనమా వెంకటేశ్వర్ రావు, వైల్డ్ లైఫ్ ఎన్జీవో నుంచి అనిల్ కుమార్, జెవీడీ మూర్తి, అవినాశ్ విశ్వనాథన్, పర్యావరణవేత్తలు డాక్టర్ కార్తికేయన్, వి. కిషన్, డాక్టర్ నవీన్ కుమార్, డాక్టర్ వాసుదేవరావు, ఎస్.రాఘవేందర్, బీవీ సుబ్బారావు, కార్తీక్ చింతలపాటి రాజు, రాజీవ్ మ్యాథ్యూస్, కోవా లక్ష్మి, బానోతు రవికుమార్ ఉన్నారు. వీరితో పాటు మరో 13 మంది బోర్డులో సభ్యులుగా ఉంటారు.
  • పల్లె ప్రకృతి వనాలు: రాష్ట్రంలోని ప్రతి గ్రామానికి ఓ ప్రకృతి వనం ఏర్పాటు చేయాలన్న లక్ష్యంతో 19,470 గ్రామల్లో పల్లె ప్రకృతి వనాలను గ్రామీణాభివృద్ధిశాఖ ఆధ్వర్యంలో ఏర్పాటుచేస్తున్నారు.
  • అర్బన్‌ ఫారెస్ట్‌ పార్కులు: రాష్ట్రవ్యాప్తంగా నగరాలకు సమీపంలో దాదాపు 75,740 ఎకరాల్లో 109 అర్బన్‌ ఫారెస్ట్‌ పార్కుల ఏర్పాటు జరిగింది. 164 హరితవనాల్లో వంద శాతం పచ్చదనం సాధించేందుకు 1.71 లక్షల ఎకరాల్లో 1.06 కోట్ల మొక్కలను రాష్ట్ర ప్రభుత్వం నాటించింది.[7]

అటవీ చట్టం[మార్చు]

రాష్ట్రంలో అడవులు కాపాడే విషయంలో కఠినంగా వ్యవహరిస్తున్న ప్రభుత్వం అడవుల రక్షణకోసం కొత్త అటవీ చట్టం -2019ని రూపొందించింది. ఇందుకకోసం 2019, జనవరి 26న ప్రగతి భవన్ లో పోలీస్, అటవీశాఖ అధికారులతో ముఖ్యమంత్రి కేసీఆర్ అడవుల సంరక్షణ, మొక్కల పెంపకం కోసం తీసుకోవాల్సిన చర్యలపై ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించి కొత్త చట్టానికి ఆమోదం తెలిపాడు.

రక్షిత ప్రాంతాలు[మార్చు]

తెలంగాణ రాష్ట్రంలో 11 అభయారణ్యములు, 3 జాతీయ పార్కులు ఉన్నాయి.

వన్యప్రాణుల అభయారణ్యాలు[మార్చు]

క్రమసంఖ్య వన్యప్రాణుల అభయారణ్యం పేరు
1 ఏటూరునాగారం వన్యప్రాణుల అభయారణ్యం
2 కవ్వాల్ వన్యప్రాణుల అభయారణ్యం (జన్నారం)[8]
3 కిన్నెరసాని వన్యప్రాణుల అభయారణ్యం (ఖమ్మం)
4 మంజీర వన్యప్రాణుల అభయారణ్యం
5 నాగార్జున సాగర్ శ్రీశైలం పులుల అభయారణ్యం
6 పాపికొండ వన్యప్రాణుల అభయారణ్యం
7 పోచారం అభయారణ్యం
8 శివ్వారం వన్యప్రాణుల అభయారణ్యం
9 పాకాల వన్యప్రాణుల అభయారణ్యం
10 ప్రాణహిత వన్యప్రాణుల అభయారణ్యం[9][10]

జాతీయ వనాలు[మార్చు]

కాసు బ్రహ్మానంద రెడ్డి జాతీయ వనంలోని నెమళ్లు
జాతీయ వనం
మహవీర్ హరిన వనస్థలి జాతీయ వనం
మృగవని జాతీయ వనం
కాసు బ్రహ్మానంద రెడ్డి జాతీయ వనం

జంతు ప్రదర్శనశాలలు[మార్చు]

జంతు ప్రదర్శనశాల పేరు
నెహ్రూ జంతుప్రదర్శనశాల

తెలంగాణ అటవీ ప్రధాన సంరక్షణాధికారులు[మార్చు]

ప్రిన్సిపల్‌ చీఫ్‌ కన్జర్వేటర్‌ ఆఫ్‌ ఫారెస్ట్‌ (పీసీసీఎఫ్‌)[మార్చు]

  • ప్రశాంత్‌కుమార్‌ ఝా
  • ఆర్‌.శోభ
  • రాకేష్‌ మోహన్‌ డోబ్రియల్‌

బహుమతులు[మార్చు]

  1. 2022లో హైదరాబాదులోని నాంపల్లిలో ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ లో నిర్వహించిన అఖిల భారత పారిశ్రామిక ప్రదర్శన (ఆల్ ఇండియా ఇండస్ట్రియల్ ఎగ్జిబిషన్) నుమాయిష్ లో తెలంగాణ అటవీ శాఖ తరపున ఏర్పాటు చేసిన స్టాల్ కు ప్రథమ బహుమతి వచ్చింది. ఈ ప్రదర్శనలో తెలంగాణ ప్రభుత్వానికి చెందిన పలు శాఖలు ప్రత్యేక స్టాళ్ళను ఏర్పాటుచేశాయి. తెలంగాణకు హరితహారం పథకం ద్వారా అటవీశాఖ అమలు చేస్తున్న పర్యావరణ హిత కార్యక్రమాలను ప్రతిబింబించేలా, పచ్చదనం పెంపు, జంతు సంరక్షణ చర్యల నమూనాలను ప్రదర్శించారు. అడవి నేపథ్యంలో ప్రవేశద్వారాన్ని, మినీ జూను ఏర్పాటుచేశారు. 2022, ఏప్రిల్ 8న జరిగిన ముగింపు కార్యక్రమంలో రాష్ట్రం హోంమంత్రి మహమూద్‌ అలీ, ఎగ్జిబిషన్‌ సొసైటీ ప్రతినిధుల చేతుల మీదుగా అటవీశాఖ అధికారులు బహుమతి అందుకున్నారు.[11][12]

మూలాలు[మార్చు]

  1. సాక్షి, తెలంగాణ కథ. "ఐదేళ్లలో 33 శాతానికి అడవుల విస్తరణ". Retrieved 7 January 2017.
  2. "Latest Telugu News | Breaking News Telugu | Telugu News Today | News in Telugu". EENADU. Retrieved 2022-01-13.
  3. "Kavitha urges people to make Haritha Haram a success". TSI. Archived from the original on 2021-03-04. Retrieved 2021-11-17.
  4. "Telangana set to become Green". Archived from the original on 2021-11-17. Retrieved 2021-11-17.
  5. "పచ్చదనం పెంచే అతి పెద్ద ప్రయత్నం 'తెలంగాణకు హరితహారం'". Namasthe Telangana (in అమెరికన్ ఇంగ్లీష్). 2021-06-01. Archived from the original on 2021-06-02. Retrieved 2021-11-17.
  6. telugu, NT News (2023-06-19). "CM KCR | తుమ్మలూరులో తొమ్మిదో విడత హరితహారం ప్రారంభించిన ముఖ్యమంత్రి కేసీఆర్‌". www.ntnews.com. Archived from the original on 2023-06-19. Retrieved 2023-06-19.
  7. 7.0 7.1 telugu, NT News (2023-06-19). "Haritha Haram | తెలంగాణ పుడమిపై కేసీఆర్‌ ఆకుపచ్చని సంతకం". www.ntnews.com. Archived from the original on 2023-06-19. Retrieved 2023-06-19.
  8. నవ తెలంగాణ, ఆదిలాబాదు (17 November 2019). "పర్యాటకుల మదిదోస్తున్న కవ్వాల్‌". NavaTelangana. Archived from the original on 26 April 2020. Retrieved 26 April 2020.
  9. ఈనాడు, తెలంగాణ (12 November 2017). "ప్రకృతి ఒడిలో వన్యప్రాణులు". Archived from the original on 22 April 2020. Retrieved 22 April 2020.
  10. సాక్షి, ఎడ్యుకేషన్ (30 August 2016). "వన్యప్రాణి సంరక్షణా కేంద్రాలు". Sakshi. Archived from the original on 22 April 2020. Retrieved 22 April 2020.
  11. "నుమాయిష్ లో అటవీశాఖ స్టాల్ కు ప్రథమ బహుమతి". m.andhrajyothy.com (in ఇంగ్లీష్). 2022-04-08. Archived from the original on 2022-04-08. Retrieved 2022-04-09.
  12. telugu, NT News (2022-04-09). "తెలంగాణ అటవీశాఖకు ప్రథమ బహుమతి". Namasthe Telangana. Archived from the original on 2022-04-09. Retrieved 2022-04-09.