దేవగిరి ఎక్స్‌ప్రెస్

వికీపీడియా నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు

దేవగిరి ఎక్స్‌ప్రెస్ (Devagiri Express) భారత రైల్వేల ఎక్స్‌ప్రెస్ రైలుబండి. ఇది సికింద్రాబాద్ మరియు ముంబై పట్టణాల మధ్య దక్షిణ మధ్య రైల్వే ద్వారా నడిపించబడుతుంది. ఈ రైలు 938 కిలోమీటర్ల దూరాన్ని 16 గంటలు ప్రయాణిస్తుంది.

దేవగిరి అనేది ఔరంగాబాద్ దగ్గరలో వున్న దౌలతాబాద్ పట్టణానికి మరోపేరు. ఇది మహమ్మద్ బీన్ తుగ్లక్ పరిపాలనలో రాజధానిగా ఉన్నది.

ఇది ద్వాదశ జ్యోతిర్లింగాలులో ఒకటైన త్రయంబకేశ్వర్ మరియు గోదావరి నది జన్మస్థానమైన నాసిక్ లను దర్శించుకోడానికి సౌకర్యంగా ఉంటుంది.

ఈ రైలుబండి సంఖ్య 17057 DN ముంబై నుండి సికింద్రాబాద్ మధ్య నడిస్తే; రైలుబండి సంఖ్య 17058 UP సికింద్రాబాద్ నుండి ముంబై నగరాల మధ్య నడుస్తుంది.

చరిత్ర[మార్చు]

ఈ రైలు మొదట ముంబై మరియు ఔరంగాబాద్ నగరాల మధ్య ప్రతిరోజు నడిచేది. తర్వాత కాలంలో దీనిని నాందేడ్ కు, నిజామాబాద్ మరియు సికింద్రాబాద్ లకు పొడిగించారు.

ప్రయాణ మార్గం[మార్చు]

దేవగిరి ఎక్స్‌ప్రెస్ మార్గసూచి (ప్రధాన స్టేషనులతో)
 1. ముంబై సెంట్రల్
 2. ముంబై దాదర్ సెంట్రల్
 3. థానె
 4. కళ్యాణ్ కూడలి
 5. కాసర
 6. ఇకత్పురి
 7. దేవ్లాలి
 8. నాసిక్ రహదారి
 9. లసల్గాం
 10. మన్మాడ్ కూడలి
 11. రోటేగాం
 12. లాసూర్
 13. ఔరంగాబాద్
 14. జల్నా
 15. పార్తూర్
 16. సేలు
 17. మన్వత్ రహదారి
 18. పర్భాని కూడలి
 19. పుర్ణ కూడలి
 20. నాందేడ్
 21. ముద్కెడ్
 22. ఉమ్రి
 23. ధర్మాబాద్
 24. బాసర
 25. నిజామాబాద్
 26. కామారెడ్డి
 27. అక్కన్నపేట
 28. మీర్జాపల్లి
 29. బొల్లారం
 30. సికింద్రాబాద్ కూడలి

బయటి లింకులు[మార్చు]