దొరలు దొంగలు (1976 సినిమా)
Appearance
దొరలు దొంగలు (1976 తెలుగు సినిమా) | |
దొరలు దొంగలు సినిమా పోస్టర్ | |
---|---|
దర్శకత్వం | కె.ఎస్.ఆర్. దాస్ |
తారాగణం | జి. రామకృష్ణ, రంగనాథ్, శ్రీధర్, చంద్రమోహన్, వాణిశ్రీ |
గీతరచన | మల్లెమాల |
నిర్మాణ సంస్థ | సుందరం మూవీస్ |
భాష | తెలుగు |
చిత్రకథ
[మార్చు]ఎమ్.ఎస్.రెడ్డి నిర్మించిన ఏకైక జానపద చిత్రం ఇదే కావచ్చు. గీతరచయిత మల్లెమాలగా చక్కటి పాటలు ఆయన ఈ చిత్రంలో అందించారు. జి. రామకృష్ణ, రంగనాథ్, శ్రీధర్, చంద్రమోహన్, వాణిశ్రీ (ద్విపాత్రాభినయం) వంటి తారలతో, బాగా ఖర్చు పెట్టి నిర్మించారు. రాబిన్ హుడ్ వంటి కథానాయకుడు, రాజుగారి పేరుతో అరాచకాలు చేసే సైన్యాధికారి, యువరాణిని ప్రేమించే ఒకరాజు, యువరాణి పోలికలతో వుండే ఒక చాకలి, ఆమెను యువరాణి బదులుగా కూర్చొపెట్టటం వంటి మలుపులతో అచ్చమయిన జానపద చిత్రం లా సాగుతుంది. ఆక్షన్ చిత్రాల దర్శకుడు కె.ఎస్.ఆర్.దాస్ దీనికి దర్శకుడు.
నటీనటులు
[మార్చు]పాటలు
[మార్చు]- చెప్పలనుకున్నాను చెప్పలేక పోతున్నాను
- మందార మకరందమూ
- ఓలమ్మోఓరయ్యో ..ఇయ్యాల మనకంతా పండగా ,ఏటికి నీరొచ్చింది దండిగా-పి.సుశీల
- దొరలెవరో దొంగలేవరో తేల్చికుంటాను, తెలియకపోతే ప్రాణాలిచ్చీ తెలుసుకుంటాను - రచన: మల్లెమాల - గానం: బాలసుబ్రహ్మణ్యం
- ఏనాడు అనుకోనిది ఈనాడు నాదైనది-ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, పి.సుశీల