శ్రీపతి పండితారాధ్యుల బాలసుబ్రహ్మణ్యం
| ఎస్.పీ.బాలసుబ్రహ్మణ్యం | |
పద్మశ్రీ, డాక్టర్.ఎస్.పీ.బాలసుబ్రహ్మణ్యం |
|
| జన్మ నామం | శ్రీపతి పండితారాధ్యుల బాలసుబ్రహ్మణ్యం |
|---|---|
| జననం | జూన్ 4,1946 కోనేటమ్మపేట,నెల్లూరు జిల్లా,ఆంధ్రప్రదేశ్ |
| నివాసం | చెన్నై, తమిళనాడు |
| ఇతర పేర్లు | బాలు |
| వృత్తి | నేపధ్య గాయకుడు సంగీత దర్శకుడు నిర్మాత మరియు నటుడు |
| మతం | శైవ బ్రాహ్మణ హిందూ |
| సంతానం | చరణ్ & పల్లవి |
| తండ్రి | శ్రీపతి పండితారాధ్యుల సాంబమూర్తి |
| వెబ్‌సైటు | http://www.spbindia.com |
పద్మశ్రీ, డాక్టర్.ఎస్.పీ.బాలసుబ్రహ్మణ్యం(శ్రీపతి పండితారాధ్యుల బాలసుబ్రహ్మణ్యం) ప్రముఖ తెలుగు నేపధ్య గాయకుడు, సంగీత దర్శకుడు మరియు నటుడు. తెలుగువారు అభిమానముగా బాలు అని పిలిచే ఈయన 1946 జూన్ 4 న అప్పటి నెల్లూరు జిల్లాలోని కోనేటమ్మపేట గ్రామములో (ప్రస్తుతము ఈ గ్రామము తమిళనాడు రాష్ట్రములో ఉన్నది) ఒక సాంప్రదాయ శైవ బ్రాహ్మణ కుటుంబములో జన్మించాడు.
విషయ సూచిక |
[మార్చు] బాల్యము
ముగ్గురు కుమారులు, ఐదుగురు కుమార్తెలు కల పెద్ద కుటుంబములో బాలసుబ్రహ్మణ్యం రెండవ కుమారుడుగా జన్మించాడు. ఈయన తండ్రి సాంబమూర్తి పేరొందిన హరికథా పండితుడు. బాల్యమునుండే బాలుకు పాటలు పాడటము ఒక హాబీగా ఉండేది. తండ్రి కోరిక మేరకు ఇంజనీరు కావాలనే ఆశయముతో మద్రాసు లో AMIE కోర్సులో చేరాడు. ఆ కాలములోనే వివిధ పాటల పోటీలలో పాల్గొని బహుమతులు గెలుచుకొన్నాడు.
[మార్చు] సినీరంగ ప్రవేశము
బాలసుబ్రహ్మణ్యం 1966 లో నటుడు మరియు నిర్మాత అయిన పద్మనాభం నిర్మించిన శ్రీ శ్రీ శ్రీ మర్యాద రామన్న చిత్రంతో సినీగాయకునిగా రంగప్రవేశము చేశాడు.[1] ఈ చిత్రానికిఎస్.పి.కోదండపాణి సంగీత దర్శకత్వము వహించాడు. తనకు సినీ గాయకుడిగా జీవితాన్ని ప్రసాదించిన కోదండపాణిపై భక్తితో,అభిమానంతో తాను నిర్మించిన ఆడియో ల్యాబ్ కు "కోదండపాణి ఆడియో ల్యాబ్స్" అని ఆయన పేరే పెట్టుకున్నాడు బాలు.
[మార్చు] విజయ ప్రస్థానం
పాటలోనే మాటలని, గళంలో అభినయ ముద్రలని నింపి తెలుగుదనం ఒలికించగల విలక్షణత ఆయన ప్రత్యేకత. గళం విప్పినా... స్వరం కూర్చినా... ఆ పాటలోని కవి భావాన్ని సూటిగా ప్రేక్షకులవద్దకు తీసుకువెళ్ళగలిగే సత్తా ఆయన గళానికి వుంది. తరాలు మారినా ఎందరో నటులకు వారి హావభావలకు, నటనా శైలులకు అనుగుణంగా ఆయన పాటలు పాడి ప్రాణం పోశారు. అందుకే అమరగాయకుడు ఘంటసాల తరువాత తెలుగు సినీ పాటకు సిసలయిన వారసుడిగా నిలిచారు. పదాల మాదుర్యాన్ని గమనించి ఆయన చేసే ఉచ్చారణ ఆయన పాటను పండిత పామరులకి చేరువ చేసింది. శంకరాభరణం,సాగరసంగమం లాంటి తెలుగు చిత్రాలే కాకుండా ఏక్ దుజే కేలియే లాంటి హిందీ చిత్రాలకు ఆయన పాడిన పాటలు దేశమంతా ఉర్రూతలూగించాయి. 40 ఏళ్ళ సినీప్రస్తానంలో 40 వేల పాటలు 11 భాషలలో పాడి, 40 సినిమాలకి సంగీత దర్శకత్వం వహించి ప్రపంచములోనే ఒక అరుదయిన రికార్డు సృష్టించాడు. తెలుగు,తమిళమే కాకుండా కన్నడంలో కూడా ఆయన పాడిన పాటలకి జాతీయ పురస్కారాలు లభించాయి. గాయకుడిగానే కాకుండా గాత్రదాన కళాకారుడిగా, నటుడిగా, సంగీత దర్శకుడిగా ఆయా విభాగాలలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ నంది పురస్కారాన్ని 29 సార్లు అందుకున్న భాహుముఖ ప్రజ్ఞాశాలి ఈ గాన గంధర్వుడు.[2]
[మార్చు] పురస్కారాలు
| అందుకున్న సంవత్సరము |
పురస్కారం | చిత్రము | పాట | భాష | భాహుకరించింది |
|---|---|---|---|---|---|
| 2001 | పద్మశ్రీ[3] | భారత ప్రభుత్వం తరపున అప్పటి రాష్ట్రపతి కే.ఆర్.నారాయణన్ |
|||
| 1999 | డాక్టరేట్ పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం(ఆంధ్రప్రదేశ్)[3] |
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరపున అప్పటి గవర్నర్ రంగరాజన్ |
[మార్చు] బయటి లింకులు
- ఎస్.పి.బాలు వెబ్ సైటు
- ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం ప్రొఫైలు
- బాలసుభ్రమణ్యం గురించి సతీష్ యనమండ్ర బ్లాగ్ లో వ్యాసం
[మార్చు] మూలాలు
- ↑ tamilstar వెబ్సైటు నుండి ఎస్.పీ.బాలసుబ్రహ్మణ్యంగురించి వివరాలు జూన్ 04,2008న సేకరించబడినది.
- ↑ ఈనాడు దిన పత్రికలో ఎస్.పీ.బాలసుబ్రహ్మణ్యంపై వ్యాసం. జూన్ 04,2008న సేకరించబడినది.
- ↑ 3.0 3.1 స్వంత వెబ్సైటు నుండి ఎస్.పీ.బాలసుబ్రహ్మణ్యం పురస్కారాలగురించి వివరాలు జూన్ 04,2008న సేకరించబడినది.
- 1946 జననాలు
- సుప్రసిద్ధ ఆంధ్రులు
- తెలుగు సినిమా నేపథ్యగాయకులు
- తెలుగు సినిమా సంగీత దర్శకులు
- నంది ఉత్తమ సంగీతదర్శకులు
- తెలుగువారిలో సంగీతకారులు
- తెలుగు సినిమా నటులు
- పద్మశ్రీ పురస్కార గ్రహీతలు
- బాలీవుడ్ నేపథ్య గాయకులు
- ఫిలింఫేర్ అవార్డుల విజేతలు
- భారత నటులు
- భారతీయ చలన చిత్ర గాయకులు
- భారత హిందువులు
- భారతీయ గాయకులు
- భారత సంగీతకారులు
- కన్నడ నేపథ్య గాయకులు
- కోలీవుడ్ నేపథ్య గాయకులు
- చెన్నై ప్రజలు
- తమిళ నేపథ్య గాయకులు
- మలయాళం నేపథ్య గాయకులు
- భారతీయ నేపథ్య గాయకులు
- తమిళ సినిమా
- పద్మ భూషణ్ పురస్కార గ్రహీతలు
- తెలుగు ప్రజలు
- తెలుగు సినిమా
- జాతీయ సినిమా అవార్డు విజేతలు
- నెల్లూరు జిల్లా ప్రముఖులు