కమల్ హాసన్
| కమల్ హాసన్ | |
| జన్మ నామం | కమల్ హాసన్ |
|---|---|
| జననం | నవంబరు 07 1954 (వయసు 58) పరమక్కుడి, తమిళనాడు,భారతదేశం |
| నివాసం | చెన్నై, తమిళనాడు |
| ఇతర పేర్లు | కమల్ |
| వృత్తి | సినిమా నటుడు దర్శకుడు నిర్మాత గాయకుడు నృత్య దర్శకుడు కథారచయిత & మాటల రచయిత |
| మతం | బ్రాహ్మణ హిందూ |
| భార్య/భర్త | వాణీ గణపతి(మాజీ భార్య) సారిక(మాజీ భార్య)[1] |
| సంతానం | శ్రుతి కె.హసన్,అక్షర(సారిక కూతుళ్ళు) |
| తండ్రి | శ్రీనివాసన్ |
| తల్లి | రాజ్య లక్ష్మి |
| వెబ్‌సైటు | http://www.universalherokamal.com |
కమల్ హాసన్ (తమిళం : கமல்ஹாசன்) ( నవంబర్ 7, 1954 లో తమిళనాడు రాష్ట్రం రామనాథ పురం జిల్లాలోని పరమక్కుడి లో,పుట్టెను.) కమల్ హాసన్ జాతీయ నటుడు. బహుముఖ ప్రజ్ఞగల ఈ నటుడు ప్రధానంగా దక్షిణ భారత చిత్రాలలో, అందునా ఎక్కువగా తమిళ చిత్రాలలో నటించినప్పటికీ భారత దేశ మంతటా సుపరిచితుడు.
విషయ సూచిక |
బాల్య జీవితం [మార్చు]
కమల్, శ్రీనివాసన్, రాజ్య లక్ష్మి దంపతులకు నాలుగో సంతానం మరియు ఆఖరి వాడు. కొడుకులందరికి చివరి పదం "హాసన్" అని వచ్చేలా పేరు పెట్టారు ఈ దంపతులు. ఇది హాసన్ అనబడే ఒక మిత్రుడితో తమకి ఉన్న అనుబంధానికి గుర్తు. కమల్ 6 యేళ్ళ పసి వయసులోనే చిత్ర రంగంలోకి ప్రవేశించారు. ఆయన మొదటి చిత్రం "కలత్తూర్ కన్నమ్మ". బాల్యంలోనే ఆయన శాస్త్రీయ కళలను అభ్యసించారు. నూనుగు మీసాల వయసులో సినిమాలలో నృత్య దర్శకుడిగా పని చేసారు. అదే సమయంలో ప్రసిద్ధ తమిళ సినీ దర్శకుడు కె.బాలచందర్ తో ఆయనకు ఏర్పడిన అనుబంధం తరువాత సుదీర్ఘ గురు-శిష్య సంబంధంగా మారింది. కమల్ నేపధ్య గాయకుడిగా కూడా శిక్షణ పొందాడు. ఇటీవలి కొన్ని చిత్రాలలో పాటల రచయితగా కూడా పని చేసారు. భరత నాట్యం ప్రదర్శించటంలో ఆయనకి ఆయనే సాటి. తమిళ చిత్ర రంగంలో తిరుగులేని నటుడిగా ఎదిగాడు.
60 వ దశకం [మార్చు]
కమల్ తన సినీ జీవితాన్ని కలత్తూర్ కన్నమ్మ" అనే చిత్రంలో బాల నటుడిగా ఆరంభించాడు. ఇది ఆయనకి ఉత్తమ బాల నటుడిగా అవార్డ్ తెచ్చిపెట్టిన మొదటి చిత్రం. ఆ తర్వాత కూడా ఎం.జి.రామచంద్రన్,శివాజీ గణేషన్,నాగేష్,జెమినీ గణేష్ వంటి వారు నిర్మించిన చిత్రాలలో బాల నటుడుగా నటించాడు.
70 వ దశకం [మార్చు]
70 వ దశాబ్ధంలో కమల్ పూర్తి స్థాయిలో సినిమాల్లో నటించారు. తమిళ చిత్రాలలోనే కాక ఆ నాటి ప్రసిద్ధ మళయాళ దర్శకులు నిర్మించిన మళయాళ చిత్రాలలో కూడా నటించారు. పూర్తి స్థాయి కధా నాయకుడిగా "అవర్‌గళ్", "అవళ్ ఓరు తొడరర్‌కదై", "సొల్ల తాన్ నినైక్కిరేన్", "మాణవన్", "కుమార విజయం" లాంటి చిత్రాలలో నటించినప్పటికీ శ్రీదేవి తో ఆయన నటించిన 16 వయదినిలె (తెలుగులో పదహారేళ్ళ వయసు) చిత్రం 23 ఏళ్ళ వయసులో యువ కధానాయకుడిగా మంచి పేరు తెచ్చింది. కమల్ హాసన్, శ్రీదేవి తెర మీద ప్రసిద్ధ జంటగా మారి సుమారు 23 చిత్రాలు కలిసి నటించారు.16 వయదినిలె చిత్రం తర్వాత దర్శకుడు కె.బాలచందర్ నిర్మించిన మరో చరిత్ర అనే తెలుగు చిత్రంలో నటించారు.
1970 లో విభిన్న పాత్రలను పోషించారు.
- వెంట్రిలోక్విస్ట్ గా అవర్ గళ్ చిత్రంలో (తెలుగు లో ఇది కధ కాదు)
- అమాయకమైన పళ్ళెటూరి వాడిగా 16 వయతినిలె చిత్రంలో (తెలుగు లో చంద్రమొహన్ కధానాయకుడుగా పదహారేళ్ళ వయసు)
- డిస్కో జాకి గా ఇళమై ఊన్జలాడుగిరదు చిత్రంలో
- వరుస హత్యల స్త్రీ హంతకుడి గా ఉన్మాది పాత్రలో సిగప్పు రోజక్కళ్ చిత్రంలో (తెలుగు లో ఎర్రగులాబీలు)
- ఎత్తు పళ్ళ పళ్ళెటూరి వాడిగాకళ్యాణరామన్ చిత్రంలో (తెలుగు లో కల్యాణరాముడు)
- అలాద్దిన్ గా అలావుద్దీనమ్ అర్పుధ విలక్కుమ్ చిత్రంలో
80వ దశకం [మార్చు]
దర్శకుడిగా ఆయన చేపట్టిన మొదటి చిత్రం "శంకర్ లాల్" చిత్రీకరణ జరుగుతుండగా టి.ఎన్.బాలు దుర్మరణం జరిగింది. 1979 లో కమల్ పలు క్లాసిక్, మాస్ చిత్రాలలో నటించి మంచి స్టార్ డమ్ పొందాడు. దీనికి ఎమ్.జీ.అర్/శివాజి వంటి చిత్ర రంగం నుండి తప్పుకోవడం కూడా తోడైంది. (ఎమ్.జీ.ఆర్ చిత్ర రంగం నుండి విరమించుకోగా, 1977 తర్వాత 1990 వరకు శివాజి చిత్రాలకు దూరంగా ఉన్నారు). చిత్ర రంగంలో ఉన్న పోటీని ఎప్పటికప్పుడు ఎదుర్కోవడానికి కమల్ తన చిత్రాలలో విభిన్న కధలతో, పాత్రలతో ముందుకు వచ్చారు.
ఈ దశకంలో నటించిన వివిధ పాత్రలు:
- అంధ వయొలిన్ విద్వాంసునిగా రాజ పార్వయి చిత్రంలో 27 ఏళ్ళ వయసులో నటించాడు. (ఇదే కమల్ స్క్రీన్ ప్లే వహించిన తొలి చిత్రం)
- శాస్త్రీయ నృత్య కళాకారునిగా సాగర సంగమం చిత్రంలో
- ప్రేమలో పడే మానసిక వికలాంగి గా స్వాతి ముత్యం చిత్రంలో
- అజ్ఞాత పోలీసు గా కాకి చట్టై చిత్రంలో
- అండర్ వరల్డ్ డాన్ గా నాయగన్ (నాయకుడు) చిత్రంలో 33 ఏళ్ళ వయసులో మణి రత్నం దర్శకత్వంలో
- ఒక నిరుద్యోగ యువకుడు ఒక వారం పాటు భోగ భాగ్యాలు అనుభవించే పాత్రలో మూకీ చిత్రం అయిన పుష్పక్లో (తెలుగులో పుష్పక విమానం)
- నిజాయితీ గల పోలీస్ ఆఫీసర్ గా, సర్కస్ లో మరుగుజ్జు బఫూన్ గా, సరదాగా ఉండే మెకానిక్ పాత్రలలో అపూర్వ సగోదరర్‌గళ్(విచిత్ర సోదరులు) చిత్రంలో 35 ఏళ్ళ వయసులో (ఈ చిత్రానికి స్క్రీన్ ప్లే కూడా కమల్ చేశారు)
- చెడ్డవాడు అయిన మేయర్ గా ఇంద్రుడు చంద్రుడు, తెలుగు చిత్రంలో
- 1989 లో విడుదల అయిన అపూర్వ సగోదరగళ్ చిత్రం బాక్సాఫీస్ వద్ద సుమారు10 కోట్ల రూపాయలను వసూలు చేసిన మొదటి కమల్ చిత్రం.
90వ దశకం [మార్చు]
1997 లో మరొక యాదృశ్చికమైన సంఘటన కారణంగా కమల్ తిరిగి దర్శకత్వం చేపట్టాల్సి వచ్చింది. చాచి 420 (తెలుగు లో భామనే సత్యభామనే) చిత్ర దర్శకుడు శంతను షెనొయ్ పనితనం నచ్చక పోవడంతొ కమల్ మళ్ళి దర్శకుడిగా మారారు. అటుపై ఐరోప చిత్ర విధానాలను అనుసరిస్తూ, కమల్ నిజ జీవితానికి దగ్గరైన సహజ హాస్యం పండిస్తూ అనేక చిత్రలను తీస్తూ వచ్చారు. ఈ చిత్రాల కారణంగా కొంతమంది అభిమనులని నిరాశపరిచినా, నటుడిగా ఎంతొ ఎత్తుకి ఎదిగారు.
ఈ కాలంలొ ఆయన నటించిన పాత్రలు:
- తమిళ హాస్య చిత్రం "సతీలీలావతి" లో డాక్టరు గా (తెలుగులో అదే పేరు)
- నలుగురు కవలలు గా హాస్య చిత్రం "మైకేల్ మదన కామరాజన్" (తెలుగు: "మైకేల్ మదన కమ రాజు")
- స్వార్ధపరుదైన ముసలి మేయర్ పాత్రలొ "ఇందిరన్ చందిరన్" (తెలుగు: "ఇంద్రుడు చంద్రుడు")
- ప్రేమలో పడ్డ ఉన్మాదిగా "గుణ"
- గ్రామంలో స్థిర పడే ఆధునిక యువకుడిగా "దేవర్ మగన్" (తెలుగు: క్షత్రియ పుత్రుడు) - 38 ఏళ్ళ వయసులో రచించి నిర్మించిన చిత్రం.
- గ్రామం నుంచి వలస వచ్చి పట్టణంలొ కుటుంబాన్ని కోల్పొయే వ్యక్తిగా "మహానది"
- ఒక విప్లవాత్మకమైన ఉపాధ్యయుడిగా "నమ్మవర్" (తెలుగు: "ప్రొఫెసర్ విశ్వం")
- ఉగ్రవాదాన్ని అణిచివేసే ప్రత్యేక పొలీసు అధికారిగా "ద్రోహి" (తమిల్: కురుది పూనల్)
- ముదుసలి స్వతంత్రసమరయోధుడిగా, అతని లంచగొండి కొడుకుగా ద్విపాత్రాభినయనం "ఇండియన్" (తెలుగు: "భారతీయుడు")
- 42 ఏళ్ళ వయసులో ముసలి దాదిగా (naany)(ఇంగ్లీషు చిత్రం మిసెస్ డౌట్ ఫైర్ ఆధారంగా) "అవ్వై షణ్ముఖి" (తెలుగు: భామనే సత్యభమనే)
ఐతే ఎనభైలొ మాదిరిగా తొంభైలలొ అతని చిత్రాలు అంతగా విజయవంతం కాలేదు. 1996 లో విడుదలైన "ఇండియన్", "అవ్వై షణ్ముఖి" మాత్రం 200 మిలియన్లు వసూలు చేసి కమల్ ను అగ్రపథంలో నిలిపాయి.
2000లలో [మార్చు]
నూతన శతాబ్దంలో కమల్ హసన్ బహుముఖ ప్రతిభ తెర మీద మాత్రమే కాకుండా తెర వెనుక అనేక విభాగాల్లో కూడా కనిపించనారంభించింది. ఈ కాలంలో నటన మాత్రమే కాకుండా ఆయన దర్శకత్వం, రచన, కధా సంవిధానం, సంగీతం మొదలైన విభాగాల్లో తనదైన శైలిని ప్రదర్శించాడు. నటనలో విభిన్న పాత్రలెన్నింటినో తనకు మాత్రమే సాధ్యమైన రీతిలో పోషించాడు. వాటిలో కొన్ని:
- కవల సోదరులుగా: ఆళవందాన్ (అభయ్)
- ప్రేమలో పడే ఘోటక బ్రహ్మచారిగా: పమ్మల్ కె. సంబందం (బ్రహ్మచారి)
- రసికుడైన విమాన చోదకునిగా: పంచతంత్రం
- వికలాంగుడైన మానవతావాదిగా: అన్బే శివం (సత్యమే శివం)
- ప్రేయసి హత్యలో అన్యాయంగా ఇరికించబడి జైలు పాలైన మొరటు పల్లె వాసిగా: విరుమాండి (పోతురాజు)
- సర్కస్ లో పోరాటాలు చేసే బధిరుడిగా: ముంబై ఎక్స్ ప్రెస్
- ముదురు వయసులో వైద్య విద్యనభ్యసించే ఆకు రౌడీ పాత్రలో: వసూల్ రాజా ఎమ్. బి. బి. ఎస్. (హిందీ చిత్రం మున్నాభాయ్ ఎమ్. బి. బి. ఎస్. ఆధారంగా)
- ప్రతిభావంతుడైన పోలీస్ అధికారి రాఘవన్ పాత్రలో: వేట్టైయాడు - విళయాడు (రాఘవన్)
- ప్రతిదానికీ భయపడే అమాయకుడైన పిరికివాడిగా: తెనాలి (ఆంగ్ల చిత్రం వాట్ అబౌట్ బాబ్ ఆధారంగా)
2000లో విడుదలైన తెనాలి కమల్ హసన్ చిత్రాల్లో రూ. 30 కోట్లకు పైగా సాధించిన తొలి చిత్రం. 2005లో వచ్చిన వసుల్ రాజా ఎమ్. బి. బి. ఎస్ సుమారు రూ. 40 కోట్లు సాధించగా, 2006 లొ వచ్చిన వేట్టైయాడు - విళయాడు రూ. 45 కోట్లు సాధించి తమిళ బాక్సాఫీసుపై కమల్ హసన్ ప్రభావం తగ్గలేదని నిరూపించాయి.
పురస్కారాలు [మార్చు]
కేంద్ర ప్రభుత్వం ఏటా బహూకరించే ప్రతిష్ఠాత్మకమైన ఉత్తమ నటుడి పురస్కారాన్ని కమల్ హసన్ మూడు పర్యాయాలు గెలుచుకున్నాడు. ఆ చిత్రాలు వరుసగా: మూండ్రంపిరై, నాయకన్ (నాయకుడు} మరియు ఇండియన్ (భారతీయుడు). ఈయన ఉత్తమ బాల్యనటుడిగా కూడ కేంద్ర ప్రభుత్వ పురస్కారాన్ని కలతూర్ కన్నమ్మ చిత్రానికిగానూ గెలుచుకున్నాడు. ఇవే కాకుండా సాగర సంగమం, స్వాతి ముత్యం చిత్రాలకు వరుసగా 1983, 1985 లలో ఆసియా చిత్రోత్సవాల్లో ఉత్తమ నటుడి బహుమతి పొందాడు. మరో ప్రతిష్ఠాత్మక ఫిల్మ్ ఫేర్ బహుమతిని ఆయన రికార్డు స్థాయిలో 18 సార్లు సొంతం చేసుకున్నాడు. ఆయన నటించిన ఆరు చిత్రాలు భారత దేశం తరపున అధికారికంగా ఆస్కార్ బహుమతికై పంపబడ్డాయి. భారత ఉపఖండంలో మరే నటుడు/నటికీ ఈ గౌరవం దక్కలేదు. 1990లో కేంద్ర ప్రభుత్వం కమల్ హసన్ ను పద్మశ్రీ బిరుదంతో గౌరవించింది. 2005లో మద్రాసు లోని సత్యభామ విశ్వవిద్యాలయం ఆయనకు గౌరవ డాక్టరేటు ప్రదానం చేసింది.
మూడు దశాబ్దాలకు పైబడిన నట జీవితంలో కమల్ హసన్ మొత్తం 171 అవార్డులను సొంతం చేసుకున్నాడు. తమిళ సినిమాకు చేసిన సేవలకుగాను తమిళనాడు ప్రభుత్వం ఆయన్ను కలైమామణి (కళాకారుల్లో మాణిక్యం) బిరుదంతో సత్కరించింది.
నిర్మాతగా కమల్ హసన్ ప్రస్థానం [మార్చు]
కమల్ హసన్ 1981 నుండి రాజ్ కమల్ పతాకంపై సినీ నిర్మాణం ప్రారంభించాడు. నిర్మాతగా ఆయన మొదటి చిత్రం రాజ పార్వై. ఆ తరువాత రాజ్ కమల్ సంస్థ నుండి అపూర్వ సహోదరగళ్, దేవర్ మగన్, కురుదిప్పునల్, విరుమాండి, ముంబై ఎక్స్ ప్రెస్ లాంటి మంచి చిత్రాలు రూపొందాయి.
కమల్ హసన్ ప్రతిష్ఠాత్మకంగా తలపెట్టిన మరుద నాయగం దశాబ్దంనర పైగా నిర్మాణంలోనే ఉంది. 19వ శతాబ్దపు మదురై నగర వాసియైన స్వతంత్ర పోరాట యోధుడు యూసఫ్ ఖాన్ సాహెబ్ (మొహమ్మద్ యూసఫ్ ఖాన్) గురించిన ఈ చిత్ర నిర్మాణమ్ రెండవ ఎలిజబెత్ రాణి చేతులమీదుగా మొదలయింది.
2005లో కమల్ హసన్ రాజ్ కమల్ ఆడియో పేరుతో ఆడియో వ్యాపారంలోకి ప్రవేశించాడు. ఆ మరుసటేడాది ఆయన సంస్థ మద్రాసులో మల్టీప్లెక్స్ సినిమా ధియేటర్ల నిర్మాణం కూడా చేపట్టింది.
వ్యక్తిగత జీవితం [మార్చు]
కమల్ హాసన్ వాణి గణపతి అనే ఆమెను వివాహమాడాదు.తర్వాత సారిక తో తన జీవితాన్ని పంచుకున్నాడు. వీరికి శృతి, అక్షర అను ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.ఇప్పుడు సారిక నుండి విడిపోయాడు. మరో ప్రముఖ తెలుగు నటియైన గౌతమి తో సహజీవనం సాగిస్తున్నాడు.
సమాజ సేవా కార్యక్రమాలు [మార్చు]
తన అభిమాన సంఘాలను సమాజానికి సేవ చేసే సేవా సంస్థలు గా మార్చిన మొదటి నటుడు కమల్ హాసన్.తన అభిమానుల ద్వారా పలు సేవా కార్యక్రమాలలో పాల్గొన్నారు.ఆయన పుట్టిన రోజున ఆయన అభిమానులంతా రాష్ట్ర వ్యాప్తంగా అనేక రకాల సేవా కార్యక్రమాలు నిర్వహిస్తారు.
వివిధ భాషలలో ఆరంగేట్రం [మార్చు]
- 1960 - తమిళ చిత్ర రంగ ప్రవేశం
- 1962 - మళయాళ చిత్ర రంగ ప్రవేశం
- 1977 - బెంగాలీ చిత్ర రంగ ప్రవేశం
- 1977 - కన్నడ చిత్ర రంగ ప్రవేశం
- 1977 - తెలుగు చిత్ర రంగ ప్రవేశం
- 1977 - హిందీ చిత్ర రంగ ప్రవేశం
కమల్ హసన్ చిత్ర మాలిక: నటుడి గా [మార్చు]
2000లో [మార్చు]
| సంవత్సరం | పేరు | పాత్ర | సహ-నటులు | భాష | వివరములు |
|---|---|---|---|---|---|
| 2007 | దశావతారం | ఆశిన్ , మల్లిక షెరావత్ | తమిళం | ఏక కాలంలో తమిళ, తెలుగు, హిందీ,ఇంగ్లీష్ బాషలలో రూపొందించబడి జూన్ 13,2008న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయబడింది. | |
| 2006 | వెట్టీయాడు విలైయాడు | రాఘవన్ | జ్యొతిక, కమిలిని ముఖర్జీ | తమిళం | తెలుగు లోకి రాఘవన్ గా అనువదించబడింది |
| 2005 | రమ షమ బమ | శ్యామ్ | ఊర్వశి, శృతి | కన్నడ | |
| 2005 | ముంబాయి ఎక్స్ ప్రెస్ | అవినాష్ | మనీషా కొయిరాల | హిందీ/తమిళం | ఏక కాలంలో తమిళ, తెలుగు, హిందీ భాషల్లో రూపొందింది |
| 2004 | వసూల్ రాజా MBBS | రాజ సుబ్రమనియం | స్నేహ, మాళవిక | తమిళం | |
| 2004 | విరుమాండి | విరుమాండి | అభిరామి | తమిళం | తెలుగు లోకి పోతురాజు గా అనువదించబడింది |
| 2003 | అన్బే శివం | నల్ల శివం | కిరణ్ రాథొడ్, ఆర్. మాధవన్ | తమిళం | తెలుగు లోకి సత్యమే శివం గా అనువదించబడింది |
| 2002 | పంచతంతిరం | రామ చంద్ర మూర్తి | సిమ్రాన్, రమ్యా క్రిష్నన్, దేవయాని | తమిళం | తెలుగులోకి పంచ తంత్రం గా అనువదించబడింది |
| 2001 | పమ్మళ్ కె. సంబందం | పమ్మాల్ సంబందం | సిమ్రాన్, స్నేహ | తమిళం | తెలుగు లోకి బ్రహ్మచారి గా అనువదించబడింది |
| 2001 | పార్తాలై పరవశం | కమల్ హాసన్ | ఆర్. మాధవన్, సిమ్రాన్, స్నేహ | తమిళం | కొద్ది నిడివి ప్రత్యేక పాత్ర తెలుగు లోకి పరవశం గా అనువదించబడింది |
| 2001 | అలవంధన్ | విజయ్/నందు | మనీషా కొయిరాల, రవీనా టాండన్ | హిందీ/తమిళం | అభయ్ గా హిందీ మరియు తెలుగు లోకి అనువదించబడింది |
| 2000 | తెనాలి | తెనాలి సొమన్ | జ్యోతిక, దేవయాని, మీనా | తమిళం | అదే పేరుతో తెలుగులోకి అనువదించబడింది |
| 2000 | హే రామ్ | సాకేత్ రామ్ | రాణీ ముఖర్జీ, వసుంధరా దాస్ | హిందీ/తమిళం | అదే పేరుతో తెలుగులోకి అనువదించబడింది |
1990s [మార్చు]
- 1998 - కాధలా కాధలా పాటలు
- 1998 - చాచి 420 (హిందీ) (ఎ) (బి) (సి)
- 1997 - అవ్వయ్ షన్ముగి - ఇది హిందీలో చాచీ 420 గా తిరిగి చిత్రించ బడింది. పాటలు
- 1996 - బామనే సత్యబామనే (తెలుగు)
- 1996 - భారతీయుడు (రెండు పాత్రలు) -ఇది హిందీలో హిందూస్థానీగా తిరిగి చిత్రించ బడింది. పాటలు
- 1996 - హిందూస్థానీ (హిందీ) (రెండు పాత్రలు) పాటలు
- 1996 - భారతీయుడు (తెలుగు) (రెండు పాత్రలు) పాటలు
- 1995 - కురుదిపునల్ (గీతరహితం) (ఎ)
- 1995 - ద్రోహి (తెలుగు) (గీతరహితం) (ఎ)
- 1995 - శుభ సంకల్పం (తెలుగు)
- 1995 - సతీ లీలావతి (ఎ)
- 1994 - నమ్మవర్
- 1994 - మగలీర్ మట్టుమ్ (అథిధి) (ఎ)
- 1994 - ఆడవాళ్లకు మాత్రం (తెలుగు) (అథిధి) (ఎ)
- 1994 - మహానది (బి)
- పాటలు
- 1993 - కళైంజన్ పాటలు
- 1993 - మహరాసన్ (ఎ)
- 1992 - దేవర్ మగన్ (ఎ) (బి) - ఇది హిందీలో విరాసత్హిందీ నటుడు అనిల్ కపూర్ నాయకుడుగా చిత్రించ బడింది. పాటలు
- 1992 - క్షత్రియపుత్రుడు (తెలుగు) (ఎ)
- 1992 - సింగారవేలన్ పాటలు
- 1991 - గుణ పాటలు
- 1990 - మైఖేల్ మదన కామరాజన్ (నాలుగు పాత్రలు) ఏ) పాటలు
- 1990 - మైఖేల్ మదన కామరాజు (తెలుగు) (నాలుగు పాత్రలు) (ఎ)
- 1990 - ఇందిరన్ చందిరన్ (రెండు పాత్రలు) పాటలు
1980s [మార్చు]
- 1989 - ఇంద్రుడు చంద్రుడు (తెలుగు)(రెండు పాత్రలు) - ఇది తమిళంలో ఇంద్రన్ చంద్రన్ గా పునర్నిర్మించబడి హిందీలో మేయర్ సాబ్ గా డబ్బింగ్ చేసి విడుదల చేశారు. పాటలు
- 1989 - వెట్రి విళా పాటలు
- 1989 - చాణిక్యన్ (మళయాళం)
- 1989 - అపూర్వ సగోదరర్‌గళ్ (మూడు పాత్రలు) (ఎ) -ఇది డబ్బింగ్ చేసి తెలుగు మరియు హిందీలలో విడుదల చేసారు. పాటలు
- 1989 - అప్పు రాజా (హిందీ) (త్రిపాత్రాభినయం) (ఎ)
- 1989 - అపూర్వ సహోదరులు (తెలుగు) (త్రిపాత్రాభినయం) (ఎ)
- 1988 - ఉన్నాల్ ముడియుం తంబి పాటలు
- 1988 - సూర సంహారం పాటలు
- 1988 - డైసీ (మళయాళం)
- 1988 - సత్య (a) పాటలు
- 1988 - పేసుమ్ పడమ్ (సంభాషణ రహితం)
- 1987 - పుష్పక్ (హిందీ) (సంభాషణ రహితం)
- 1987 - పుష్పకవిమానం (తెలుగు) (సంభాషణ రహితం)
- 1987 - పుష్పక విమాన (కన్నడ) (సంభాషణ రహితం)
- 1987 - కడమై కణ్ణియమ్ కట్టుబాటు (అథిధి) (ఎ)
- 1987 - నాయకుడు (తెలుగు)
- 1987 - వేలు నాయకన్ (హిందీ)
- 1987 - నాయగన్ - ఇది తెలుగులోనూ హిందీలోనూ పునర్నిర్మించబడింది.దయావన్గా కాఫీ చేయబడింది. పాటలు
- 1987 - పేర్ చొల్లుమ్ పిళ్ళై
- 1987 - అందరికంటే ఘనుడు (తెలుగు)
- 1987 - వ్రతం (మళయాళం)
- 1987 - కాదల్ పరిసు పాటలు
- 1986 - డిసెంబర్ పూక్కళ్ (అథిధి)
- 1986 - డాన్స్‌మాష్టర్ (తెలుగు) (ద్విపాత్రాభినయం) పాటలు
- 1986 - పున్నగై మన్నన్ (ద్విపాత్రాభినయం) పాటలు
- 1986 - ఒక రాధ ఇద్దరు క్రిష్ణులు (తెలుగు)
- 1986 - విక్రమ్ (a) పాటలు
- 1986 - నానుమ్ ఒరు తొళిలాళి
- 1986 - సిప్పికుళ్ ముత్తు పాటలు
- 1986 - స్వాతిముత్యం (తెలుగు) - ఇది అనిల్ కపూర్ నాయకుడుగా హిందీలోఈశ్వర్ గా పునర్నిర్మించ బడింది. పాటలు
- 1986 - మనకణక్కు (అథిధి)
- 1985 - దేఖా ప్యార్ తుమ్హారా(హిందీ).
- 1985 - జపానిల్ కల్యాణ రామన్ (ద్విపాత్రాభినయం) పాటలు
- 1985 - మంగమ్మా శపధం
- 1985 - గిరఫ్తార్ (హిందీ)
- 1985 - సాగర్ (హిందీ) పాటలు
- 1985 - ఉయర్న్ద ఉళ్ళమ్ పాటలు
- 1985 - అంద ఒరు నిమిడమ్ పాటలు
- 1985 - కాక్కి చట్టై పాటలు
- 1985 - ఒరు కైదియిన్ డైరీ (ద్విపాత్రాభినం) - ఇది అమితాబచ్చన్ నాయకుడిగా హిందీలో ఆఖరీ రాస్తా గా పునర్నిర్మించబడింది. పాటలు
- 1984 - కరిష్మా (హిందీ)
- 1984 - ఎనక్కుళ్ ఒరువన్ (ద్విపాత్రాభినం) పాటలు
- 1984 - రాజ్ తిలక్ (హిందీ)
- 1984 - యాద్ గార్ (హిందీ)
- 1984 - ఏక్ నయీ పహేలీ (హిందీ)
- 1984 - ఎహ్ దేష్ (హిందీ)
- 1983 - తూంగాదె తంబి తూంగాదే (ద్విపాత్రాభినయం) పాటలు
- 1983 - బెనకియల్లి అరళింద హువు (కన్నడ)
- 1983 - పొయ్‌క్కాల్ కుదిరై (అథిధి)
- 1983 - సద్మ (హిందీ) పాటలు
- 1983 - సలంగై ఒలి పాటలు
- 1983 - సాగరసంగమం (తెలుగు) పాటలు
- 1983 - స్నేహ బంధం (మళయాళం)
- 1983 - చట్టం పాటలు
- 1983 - ఉరువంగళ్ మారలామ్ (అథిధి పాత్ర)
- 1983 - జరాసీ జిందగీ
- 1982 - వసంత కోకిల
- 1982 - పాడగన్ (ఇది 90 లలో నిర్మించబడిన హిందీ చిత్రం తనమ్ మేరీ కసమ్ యొక్క తమిళ డబ్బింగ్ చిత్రం)
- 1982 - అగ్ని సాక్షి (తమిళం - అథిధి పాత్ర)
- 1982 - ప్యార్ తరనా (ఇది 80 లో నిర్మించబడిన తమిళ చిత్రం నినైత్తాలే ఇనిక్కుమ్ యొక్క డబ్బింగ్ హిందీ చిత్రం)
- 1982 - పగడ్సై పన్నిరెండు
- 1982 - ఎహ్ తో కమాల్ హోగయా (హిందీలో మొదటి ద్విపాత్రాభినయం)(హిందీ)ఇది పునర్నిర్మించబడిన "చట్టమ్ ఎన్ కైయ్యిల్ "యొక్క హిందీ చిత్రం.
- 1982 - రాణీ తేనీ (అథిధి పాత్ర)
- 1982 - ఎళమ్ రాత్తిరి (మళయాళం)
- 1982 - సకల కళా వల్లవన్ పాటలు
- 1982 - సనమ్ తేరీ కసమ్ (హిందీ) [1]
- 1982 - సిమ్లా స్పెషల్ పాటలు
- 1982 - మూన్రామ్ పిరై - ఇది హిందీలో సద్మా గా పునర్నిర్మించబడింది.html పాటలు
- 1982 - అంది వెయిలిలే (మళయాళం)
- 1982 - అందగాడు (తెలుగు)
- 1982 - వాళ్వే మాయమ్ (మళయాళం)
- 1982 - వాళ్వే మాయమ్ పాటలు
- 1981 - దో దిల్ దివానే
- 1981 - ఎల్లామ్ ఇన్బమయమ్
- 1981 - టిక్!టిక్ !టిక్ ! పాటలు
- 1981 - అమావాస్య చంద్రుడు (తెలుగు) (ఎ)
- 1981 - శంకరలాల్
- 1981 - సవాల్
- 1981 - కడల్ మీన్‌గళ్ html
- 1981 - ఏక్ దుజే కేలియే (హిందీ) పాటలు
- 1981 - రాజ పార్వై (a) పాటలు
- 1981 - ప్రేమ పిచ్చి (తెలుగు)
- 1981 - మీండుమ్ కోకిలా పాటలు
- 1981 - ఆకలి రాజ్యం (తెలుగు) పాటలు
- 1981 - తిల్లు ముల్లు (అథిధి)
- 1980 - నట్చత్త్రిరమ్ (అథిధి)
- 1980 - మరియ మై డార్లింగ్ (తమిళం) ఇది అదే పేరుతో కన్నడంలో పునర్నిమించబడింది.
- 1980 - వరుమైయిన్ నిరమ్ సివప్పు(కన్నడమ్)
- వరుమైయిన్ నిరమ్ సివప్పు పాటలు
- 1980 - గురు పాటలు
- 1980 - ఉల్లాస పరవైగళ్పాటలు
1970s [మార్చు]
- 1979 - అళియాద కోలన్గల్ (అతిధి)
- 1979 - నీల మలర్గల్ (అతిధి)
- 1979 - మంగల వాథియమ్
- 1979 - కల్యాణరామన్ (తమిళం)
- 1979 - కళ్యాణరమన్ పాటలు
- 1979 - ఇది కథ కాదు (తెలుగు)
- 1979 - అల్లా ఉధ్ధీన్ అధ్బుత దీపం (తెలుగు)
- 1979 - అలా ఉధ్ధీనుమ్ అర్పుద విలక్కుమ్
- 1979 - అందమైన అనుభవం (తెలుగు)
- 1979 - నినైత్తాలే ఇనిక్కుమ్ పాటలు
- 1979 - థాయిల్లమల్ నాన్ ఇల్ల్ య్ పాటలు
- 1979 - అలవుదీనుమ్ అల్బుత వెలక్కుమ్ (మలయాళం)
- 1979 - నీయా!
- 1979 - సిగపుక్కల్ మూక్కుథి
- 1979 - సొమ్మొకరిది సోకొకరిది (తెలుగు లొ మొదటి ద్వి-పాత్రాభినయం)(తెలుగు) తమిళం లో "ఇరు నిలవుగల్ " గా విడుదల చేశారు.
- 1978 - తప్పు తాళంగళ్ (అతిధి)
- 1978 - తప్పిట తల (తెలుగు) (అతిధి)
- 1978 - మదనోత్సవమ్ (మలయాళం)
- 1978 - ఏట్టా (మలయాళం)
- 1978 - అవళ్ అప్పడిదాన్
- 1978 - మనిదరిల్ ఇత్తని నిరంగళా!
- 1978 - సిగప్పు రోజాగళ్ పాటలు
- 1978 - వయానధన్ తంబన్ (మలయాళం)
- 1978 - వయస్సు పిలిచింది (తెలుగు)
- 1978 - చట్టమ్ ఎన్ కైయ్యిల్ (తమిళంలో మొదటి ద్విపాత్రాభినయం)పాటలు
- 1978 - ఇళమై ఊంజలాడు గిరదు పాటలు
- 1978 - మరో చరిత్ర (తెలుగు) పాటలు
- 1978 - నిళల్ నిజమాగిరదు పాటలు
- 1977 - ఆద్యపాదమ్ (మలయాళమ్) (అతిధి)
- 1977 - సత్యవాన్ సావిత్రి (మలయాళం)
- 1977 - కోకిల (కన్నడంలో మొదటి చిత్రం)
- 1977 - నామ్ పిరంద మణ్
- 1977 - ఆనందం పరమానందం (మలయాళం) (అతిధి)
- 1977 - ఆడు పులి ఆట్టమ్
- 1977 - ఆడు పులి ఆట్టమ్ పాటలు
- 1977 - ఓర్ మగళ్ మరిక్కుమో (మలయాళం) (అతిధి)
- 1977 - నిరకుడమ్ (మలయాళం)
- 1977 - ఆష్త మాంగల్యమ్ (మలయాళం) (అతిధి)
- 1977 - కబిత (బెంగాలి)
- 1977 - ఉన్నై సుట్రుమ్ ఉలగమ్
- 1977 - శ్రీ దేవి (మలయాళం)
- 1977 - మదుర సొప్పనమ్ (మలయాళం)
- 1977 - అవర్గళ్ (అథిధి) పాటలు
- 1977 - ఆశీర్వాదమ్ (మలయాళం)
- 1977 - శివతాండవమ్ (మలయాళం)
- 1977 - ఉయర్న్దవర్‌గళ్
- 1976 - లలిత (అతిధి)
- 1976 - మోగమ్ ముప్పదు వ్రుషమ్
- 1976 - మూన్రు ముడిచ్చు
- 1976 - Nee Ente Lahari (మలయాళం)
- 1976 - పొన్ని (మలయాళం)
- 1976 - ఇదయ మలర్
- 1976 - కుమార విజయమ్
- 1976 - కుట్టువమ్ సిత్షయుమ్ (మలయాళం)
- 1976 - ఉణర్చిగళ్ (మలయాళం)
- 1976 - ఒరు ఊదాప్పూ కణ్ సిమిట్టు గిరదు
- 1976 - సత్యమ్
- 1976 - అరుతు (మలయాళం) (అతిధి)
- 1976 - స్విమ్మింగ్ పూల్ (మలయాళం)
- 1976 - మన్మద లీలై పాటలు
- 1976 - సమస్సియ (మలయాళం)
- 1976 - అప్పూపన్ (మలయాళం)
- 1976 - అగ్ని పుష్పమ్ (మలయాళం)
- 1975 - అంతరంగమ్
- 1975 - రాసలీల (మలయాళం)
- 1975 - మట్టొరు సీతా (మలయాళం)
- 1975 - తిరువోణమ్ (మలయాళం)
- 1975 - అపూర్వ రాగంగళ్ పాటలు
- 1975 - మాలై సూడవా
- 1975 - నాన్ నిన్నె ప్రేమిక్కున్ను (మలయాళం)
- 1975 - పట్టికాట్టు రాజా
- 1975 - తంగత్తిలే వైరమ్
- 1975 - మేల్‌నాట్టు మరుమగళ్ (ఈ చిత్ర నిర్మాణ సమయంలో వాణి గణపతిని కలుసుకొని ప్రేమలో పడి తరవాత ఆమెను వివాహం చేసుకున్నాడు )
- 1975 - తేన్ సిందుదే వానమ్
- 1975 - ఆయిరత్తిల్ ఒరుత్తి
- 1975 - పట్టామ్ బూచ్చి
- 1975 - సినిమా పైత్యమ్
- 1974 - పణత్తుక్కాగ
- 1974 - ఆయినా (హిందీ) (ఇది తెరమీద అనుకున్నంత విజయం సాధించలేదు)
- 1974 - అంతులేని కధ (తెలుగు) (ఇది తెరమీద అనుకున్నంత విజయం సాధించలేదు)
- 1974 - అవళ్ ఒరు తొడర్ కదై (మలయాళం) (ఇది తెరమీద అనుకున్నంత విజయం సాధించలేదు)
- 1974 - అవళ్ ఒరు తొడర్ కదై (ఇది తెరమీద అనుకున్నంత విజయం సాధించలేదు) పాటలు
- 1974 - విష్ణు విజయమ్ (మలయాళం)
- 1974 - అన్బు తంగై
- 1974 - కన్యాకుమారి (మలయాళం)
- 1974 - నాన్ అవనిల్లై
- 1974 - గుమస్తావిన్ మగళ్
- 1974 - పరువ కాలమ్
- 1974 - చొల్లత్తాన్ నినైక్కిరేన్
- 1973 - అరంగేట్రమ్
- 1972 - కురత్తి మగన్
- 1970 - మాణవన్
1960s [మార్చు]
- 1963 - అనంధ జోధి
- 1963 - వానంపడి పాటలు
- 1962 - కన్నుమ్ కరులుమ్ (మలయాళం)
- 1962 - పాధ కానిక్కై పాటలు
- 1962 - పార్దాల్ పాసి థీరుమ్ (మొట్ట మొదటి ద్వి-పాత్రాభినయం)(అతిధి పాత్రలో) పాటలు
- 1960 - కలథుర్ కన్నమ్మ ("ఉత్తమ బాల నటుడి" గా జాతీయ బహుమతి వచ్చింది.)
నిర్మాత గా [మార్చు]
- పై చిత్రాల లో (ఎ) గా గుర్తుంచ బడినవాటికి కమల్ హాసన్ నిర్మాత.
రచయిత గా [మార్చు]
- 1999 - బీవీ నెం.1 (హిందీ) పాటలు
- 1997 - విరాసత్ (హిందీ) పాటలు
- అంతే కాకుండా పై చిత్రాల లో (బి) గా చూపించ బడినవి కమల్ హాసన్ చే రచించబడినవి.
దర్శకుడి గా [మార్చు]
- పైన(సి) గా రాసిన చిత్రాలు కమల్ హాసన్ చే దర్శకత్వం ఛేయబడినవి.
- 2000 - హే రామ్
- 2004 - విరుమాండి
- 2013- విశ్వరూపం
ఇతర విభాగాల్లో [మార్చు]
- 2006 - పుదు పేట్టై (నేపధ్య గాయకుడు)
- 2004 - ముంబై ఎక్స్ ప్రెస్ (నేపధ్య గాయకుడు)
- 2004 - వసూల్ రాజా ఎమ్. బి. బి. ఎస్. (నేపధ్య గాయకుడు)
- 2003 - అన్బే శివం (నేపధ్య గాయకుడు)
- 2003 - నల దమయంతి(నిర్మాత, నేపధ్య గాయకుడు)
- 2000 - హే రామ్ (నృత్య దర్శకుడు, పాటల రచయిత, నేపధ్య గాయకుడు)
- 1998 - చాచీ 420 (నేపధ్య గాయకుడు)
- 1996 - ఉల్లాసం (నేపధ్య గాయకుడు)
- 1996 - అవ్వై షణ్ముగి (నేపధ్య గాయకుడు)
- 1995 - సతి లీలావతి (నేపధ్య గాయకుడు)
- 1992 - దేవర్ మగన్ (నేపధ్య గాయకుడు)
- 1987 - నాయగన్ (నేపధ్య గాయకుడు)
- 1985 - ఒక రాధ - ఇద్దరు కృష్ణులు (నేపధ్య గాయకుడు)
- 1982- ఓ మానే మానే (నేపధ్య గాయకుడు)
- 1981- శంకర్ లాల్ (నేపధ్య గాయకుడు)
- 1975 - అంధరాగం (నేపధ్య గాయకుడు)
- 1974 - ఆయినా (నృత్య సహాయకుడు)
వెలుపలి లింకులు [మార్చు]
కమల్ హసన్ & అభిమానుల అధికారిక వెబ్సైట్
ఇతర మూలాలు [మార్చు]
మూలాలు [మార్చు]
- ↑ ఇంటర్నెట్ మూవీ డేటాబేసు వెబ్ సైట్ లోకమల్ హసన్ జీవిత చరిత్రజూన్ 16,2008న సేకరించబడినది.