స్వాతిముత్యం

వికీపీడియా నుండి
స్వాతిముత్యం (1985)
SwatiMutyam.jpg
దర్శకత్వం కె .విశ్వనాథ్
నిర్మాణం ఏడిద నాగేశ్వరరావు
కథ కె. విశ్వనాధ్
చిత్రానువాదం కె.విశ్వనాథ్
తారాగణం కమల్ హాసన్ , రాధిక, దీప, నిర్మలమ్మ, శరత్ బాబు, జె.వి. సోమయాజులు, గొల్లపూడి మారుతీరావు, సుత్తి వీరభద్రరావు, డబ్బింగ్ జానకి, మల్లికార్జునరావు, ఏడిద శ్రీరామ్, వై.విజయ, విద్యాసాగర్, వరలక్ష్మి
సంగీతం ఇళయరాజా
నేపథ్య గానం ఎస్.జానకి, ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, ఎస్.పి.శైలజ, పి.సుశీల
గీతరచన వేటూరి,సిరివెన్నెల
సంభాషణలు సాయినాధ్
ఛాయాగ్రహణం ఎమ్.వి.రఘు
నిర్మాణ సంస్థ పూర్ణోదయా మూవీ క్రియేషన్స్
విడుదల తేదీ మార్చి 27 1985
నిడివి 181 నిమిషాలు
భాష తెలుగు
ఐ.ఎమ్.డీ.బి పేజీ

స్వాతి ముత్యం లేదా స్వాతిముత్యం 1985 లో విడుదలైన తెలుగు కుటుంబ కథా చిత్రం. పెద్దలని ఎదిరించి పెళ్ళి చేసుకున్న ఒక సాంప్రదాయ సామాన్య కుటుంబానికి చెందిన యువతి, చిన్నపుడే భర్త పోతే ఎదురుకున్నపరిస్థితులు, అనుకోకుండా ఆమె జీవితము లోకి వచ్చిన ఒక అమాయకపు యువకుడు, ఆ తరువాత వారిద్దరి జీవన ప్రయాణం, ఇది స్థూలం గా కధ.

విషయ సూచిక

[మార్చు] కధ

సినిమా అంతా ఫ్లాష్ బ్యాక్ లో నడుస్తుంది. శివయ్య (కమలహాసన్) కొడుకులు, తమ కుటుంబాలతో తల్లి,తండ్రి దగ్గరకు వస్తారు. లలిత(రాధిక) ఆరోగ్యము బాగుండదు. శివయ్య మనవరాలు కధ రాయటానికి తండ్రి సహాయము కోరగా, తాతగారి కధను రాయమంటాడు.

పెద్దలను ఎదిరించి పెళ్ళి చేసుకున్న లలిత భర్తని పోగొట్టుకుని, అన్నగారు చలపతి (శరత్ బాబు), కొడుకులతో కలిసి అత్తగారింటికి వెడుతుంది. కోటీశ్వరుడైన మామగారు లోపలికి రానివ్వకుండా, బయటికి గెంటేస్తాడు. అన్నగారింటికి చేరిన లలితకి వదినగారి (వై.విజయ) సాధింపులు మొదలు అవుతాయి. వారు వున్న ఇంటి లోగిలిలోనే శివయ్య తన నాయనమ్మ (నిర్మలమ్మ)తో కలిసి ఉంటుంటాడు. చిన్నపిల్లవాడి మనస్తత్వము గల అమాయకుడు శివయ్య. లలిత పడుతున్న బాధలని తీర్చడానికి తన వంతు సహాయము చేద్దామని అనుకుంటాడు. ఆమెని పెళ్ళి చేసుకుని కొత్త జీవితము ఇవ్వటమే ఎవరైన ఆమెకు చేయగలిగే సహాయము అన్న నాయనమ్మ మాటలకి స్పందించి, శ్రీరామ నవమి పందిళ్ళప్పుడు ఆమె మెడలో తాళి కడతాడు.

నాయనమ్మ మరణం తరువాత, శివయ్య లలితని, కొడుకును తీసుకుని పట్నము వెళ్ళిపోతాడు. అక్కడ వారు అద్దెకు తీసుకున్న ఇంటి యజమాని(గొల్లపూడి మారుతీరావు) లలిత మీద కన్నువేసి, శివయ్యని మగవాడు అన్నాక అడుక్కుని అయినా భార్యను పోషిచాలి అన్న మాటకు, ఉద్యోగ నిమిత్తము లలిత బయటికి వెళ్ళినప్పుడు, కొడుకుతో బిచ్చానికి వెడతాడు. అక్కడ తారసపడ్డ లలిత గురువు (జె.వి. సోమయాజులు) గారి ద్వారా గుడిలో ఉద్యోగము సంపాదిస్తాడు.

మరణ శయ్య మీద ఉన్న భార్య కోసము తనని, కొడుకుని తీసుకుని వెళ్ళి, శివయ్యను అవమానించి పంపించివేసిన మామగారిని ఎదిరించి, భర్త దగ్గరకు చేరుతుంది లలిత. లలిత మరణము తో, కొడుకులతో కలిసి బయల్దేరుతాడు శివయ్య, ఆమె పూజించిన తులసికోట ను కూడా తీసుకుని. కధ పూర్తి చేసిన మనవరాలు కధకి "స్వాతిముత్యం" అని పెడుతుంది.

[మార్చు] పాటలు

పాట రచయిత సంగీతం గాయకులు
సువ్వి సువ్వి సువ్వాలమ్మా ఆత్రేయ ఇళయరాజా ఎస్పీబీ, జానకి
చిన్నారి పొన్నారి కిట్టయ్య నిన్నెవరు కొట్టారయ్య ఆత్రేయ ఇళయరాజా ఎస్పీబీ, జానకి
మనసు పలికే మౌన గీతం మమతలోలికే స్వాతి ముత్యం సిరివెన్నెల ఇళయరాజా ఎస్పీబీ, జానకి
పట్టుసీర తెస్తానని ఆత్రేయ ఇళయరాజా ఎస్పీబీ, జానకి
రామా కనవేమిరా శ్రీ రఘురామ కనవేమిరా ఆత్రేయ ఇళయరాజా ఎస్పీబీ, జానకి
ధర్మం శరణం గచ్చామి సంఘం శరణం గచ్చామి ఆత్రేయ ఇళయరాజా ఎస్పీబీ, జానకి
వటపత్రశాయికి వరహాల లాలి సి.నారాయణరెడ్డి ఇళయరాజా పి.సుశీల

[మార్చు] అవార్డులు / ఎంట్రీలు

  1. 1986 ఆస్కార్ కి భారతదేశము తరుపున ఎంట్రీ
  2. 1986 బంగారు నంది
  3. 1986 ఉత్తమ తెలుగు చిత్రము - జాతీయ అవార్డు

[మార్చు] విశేషములు

  1. ఈ చిత్రాన్ని తమిళము లో కి అనువదించారు.
  2. హిందీ లో ఈశ్వర్ పేరుతో, అనీల్ కపూర్, రాధిక లతో మరల నిర్మించారు.
  3. ఈ చిత్రము లో కమలహాసన్, సుత్తివీరభద్రరావు కొట్టుకునే సన్నివేశములో ఇద్దరికీ నిజంగానే కొన్ని దెబ్బలు తగిలాయి.

[మార్చు] వనరులు

[మార్చు] మూలాలు

  • డి.వి.వి.ఎస్.నారాయణ సంకలనం చేసిన మధుర గాయని పి.సుశీల మధుర గీతాలు, జె.పి.పబ్లికేషన్స్, విజయవాడ, 2007.
వ్యక్తిగత పరికరాలు
నేంస్పేసులు

వైవిధ్యాలు
పేజీకి సంభందించిన లింకులు
చర్యలు
మార్గదర్శకము
పరస్పరక్రియ
పరికరాల పెట్టె
ఇతర భాషలు