ఎస్.జానకి

వికీపీడియా నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు
ఎస్.జానకి
నేపథ్యం
జననం ఏప్రిల్ 23,1938
India పల్లపట్ల, గుంటూరుజిల్లా,
సాహిత్యం నేపథ్యగానం, కర్ణాటక సంగీతము
వృత్తులు గాయని
వాయిద్యాలు గాత్ర సంగీతం
క్రియాశీలక కాలం 1957-2005

సిరిమల్లె పువ్వా... సిరిమల్లె పువ్వా అంటూ పదహారేళ్ల అమ్మాయి ఊసులను చెప్పింది ఆ కంఠం. గోవుల్లు తెల్లన... గోధూళి ఎర్రనర... అంటూ అమాయక చిన్నారి ప్రశ్నలను పలికించింది ఆ గాత్రం. వెన్నెల్లో గోదారి అందం అంటూ నిర్బంధంలో ఉన్న స్త్రీ వేదనను రాగయుక్తంగా ఆలపించింది. ఆమె గాత్రం ఏడిచే పిల్లాడికి జోలపాట, శ్రామికుడికి పనిలో అలసటను మరిపించే పాట, పోరాట మహిళలకు ఉత్సాహాన్నిచ్చే పాట. ఇలా ఆమె గాత్రం దక్షిణ భారతాన సుపరిచితం. దాదాపు 55 సంవత్సరాలకు పైగా చిత్ర పరిశ్రమకు ఆమె తన సేవలను అందించింది. కొద్ది రోజుల క్రితం కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన పద్మ విభూషణ్‌ పురస్కారాన్ని సున్నితంగా తిరస్కరించింది. ఆమె ఎవరో కాదు.. 35,000లకు పైగా పాటలను పాడి లక్షలాది మందిని తన గాత్రంతో ఓలలాడించిన ప్రముఖ గాయిని జానకి.

పగలే వెన్నెల జగమే ఊయాల... అంటూ ప్రేక్షకుల మనసుల్లో పాతుకుపోయిన జానకి స్వరానికి ఎందరో అభిమానులు. అ మధుర స్వరాన్ని ఇప్పటికీ మరచిపోలేని వారు ఉన్నారు. తియ్యటి స్వరాలను అందించిన జానకి గురించి ఎంత చెప్పిన తక్కువే. మన రాష్ట్రంలోనే కాకుండా, దక్షిణ భారత దేశంలోని అన్ని భాషల్లో తన స్వరాన్ని వినిపించి శ్రోతల మనసులో ప్రత్యేక ముద్ర వేసుకున్నారు. అనేక భాషల్లో తెలుగు వారి గళ మాధుర్యపు రుచిని చూపి, మన కీర్తి పతాకను ఎగుర వేసిన స్వరసుధామయి.

ఎస్.జానకి (S. Janaki) (జ.ఏప్రిల్ 23,1938) దక్షిణభారత నేపథ్యగాయని. గుంటూరు జిల్లా, రేపల్లె తాలూకా, పల్లపట్ల గ్రామములో శ్రీరామమూర్తి, సత్యవతి దంపతులకు జన్మించింది. జానకి తండ్రి శ్రీరామమూర్తి ఉపాధ్యాయుడు, ఆయుర్వేద వైద్యుడు. ఉద్యోగ రీత్యా ఈయన కరీంనగర్‌ జిల్లాలోని సిరిసిల్లలో ఉండేవాడు. చిన్నతనం నుంచి జానకి సంగీతం పట్ల ఎంతో మక్కువ చూపేది. తన మూడవ ఏట నుంచే అనేక కార్యక్రమాల్లో పాల్గొనడం మొదలు పెట్టింది. ఉద్దండులైన సంగీత విద్వాంసుల వద్ద శిష్యరికం చేసింది. బాల్యంలోనే సినీ సంగీతంపై ఆకర్షితురాలయ్యింది. లతామంగేష్కర్‌, పి.సుశీల, జిక్కీ, పి.లీల పాడిన పాటలు తన కార్యక్రమాల్లో పాడతూ ఉండేది. నాదస్వరం విద్వాన్ పైడిస్వామి వద్ద సంగీతం నేర్చుకున్న జానకి తన 19వ ఏట మామయ్య సలహా మేరకు, చెన్నైలోని ఏవీయం స్టూడియోలో పాడటం ఆరంభించిన జానకి మద్రాసుకు మారింది.

తొలినాళ్లలో ఏవీయం స్టూడియో గాయనిగా ఉండి, 1957లో టి.చలపతిరావు సంగీత దర్శకత్వంలో రూపొందిన తమిళ చిత్రం విధియిన్‌ విలాయత్తులో తన గాత్రాన్ని అందించడంలో సినీ ప్రస్థానం మొదలయ్యింది. ఎమ్మెల్యే చిత్రం ద్వారా తెలుగు వారికి దగ్గరయింది. ఈ చిత్రంలో తన పాట ఎంతో పేరు తెచ్చిపెట్టింది. అలా మొదలైన ఈమె గానం ఎన్నో మలుపులు తిరుగుతూ దినదిన ప్రవర్ధమానంగా సాగుతూ ఆబాలగోపాలాన్నీ అలరింపజేసింది. తెలుగులో విజయవంతము అయిన ఎన్నో చిత్రాలకు పాటలు పాడింది. 1957వ సంవత్సరంలో తన కెరీర్‌ను ప్రారంభించిన జానకి.. తెలుగు, తమిళం, మలయాళం మరియు కన్నడ మున్నగు అనేక భారతీయ భాషలలో పాటలు పాడినది. జానకి పాటల రచయిత, కర్ణాటక గాత్ర సంగీత విద్వాంసురాలు మరియు సంగీత దర్శకురాలు కూడా. కృష్ణుని మరియు సాయిబాబా భక్తురాలైన ఈమె చాలా సమయము పూజలలో గడుపుతుంది. అంతేకాక మీరా పై అనేక భక్తిగీతాల క్యాసెట్ల రికార్డు చేసి విడుదల చేసినది. ఉషా కిరణ్ మూవీస్ వారి ‘మౌన పోరాటం’ చిత్రానికి సంగీత దర్శకత్వం వహించి, భానుమతి, లీల తర్వాత మూడో మహిళా సంగీత దర్శకురాలిగా పేరు గడించింది.

శ్రోతలను మాయ చేయడంలో అందెవేసిన గొంతు జానకిది. పాటల్లో మిమిక్రి మిక్స్‌ చేసి సంగీతప్రపంచాన్ని ఇలా కూడా మెప్పించవచ్చా? అని ఆశ్చర్యపరిచేలా పాడినదామె. పదహారేళ్ళ వయసు చిత్రంలోని కట్టుకథలు చెప్పి.. నేను కవ్విస్తే.. పాటలో పండు ముసలావిడ గొంతు.. గోవుల్లు తెల్లన.. గోపయ్య నల్లన పాటలో చిన్న పిల్లాడి గొంతు, పెద్ద వాళ్ళ స్వరం... చిన్నారిపొన్నారి కిట్టయ్య పాటలో పిల్లాడి గొంతు.. శ్రీవారి శోభనం చిత్రంలోని `అలకపానుపు ఎక్కనేల చిలిపి గోరింక` పాటలో హీరోయిన్ బామ్మ గొంతులతో పాట పాడి తనది ఎవరూ గెలువలేని ప్రత్యేకత అని నిరూపించుకున్నది, జానకి. జానకి గొంతులో ఎన్నెన్నో భావాలు.. మేఘమా దేహమా పాటలో ఆమె గొంతు పలికిన ఆర్ద్రత.. `ఆకాశం ఏనాటిదో అనురాగం ఆనాటిది` అంటూ సాగే పాటలో ఆమె స్వరం పలికిన ప్రేమ తత్వం.. వెన్నెల్లో గోదావరి అందం పాటలో ఆమె గొంతులో పలికించిన ఆవేదన.. `తొలిసారి మిమ్మల్ని చూసింది` అంటూ సాగే పాటలో ఆమె స్వరంలో ప్రతిఫలించిన అల్లరి ఎన్నటికీ మరచిపోలేని రీతిలో ఉంటాయి. అలనాటి జమున నుంచి నిన్నమొన్నటి హీరోయిన్ల వరకూ ఐదు తరాల హీరోయిన్లకి ఆలంబన అయింది. తెరముందు కనిపించే హీరోయిన్లకి ఆమె స్వరం అతికినట్టు సరిపోతుంది. అదీ జానకి ప్రత్యేకత.

ఒక గాయని 55 ఏళ్ళపాటు పాటలు పాడుతూ శ్రోతలను అలరించడం మామూలు విషయం కాదు. అంత సుదీర్ఘమైన నేపథ్య గాన జీవితం లో కడదాకా ఒకే విధంగా ఆలపించడం ఇంకా కష్టం. ఐదారు తరాల హీరోయిన్లకి గొంతు అరువిచ్చి ఒప్పించడం, వయసు మీదపడినా ఆ ప్రభావం గొంతుమీద పడనివ్వకపోవడం... ఇవన్నీ అందరికీ సాధ్యమయ్యే విషయాలు కావు. అది ఎస్‌.జానకి కే సాధ్యమని నిస్సందేహంగా చెప్పవచ్చు. మధురమైన సంగీతం, తిరుగులేని స్వరసంపదతో జానకి కెరీర్‌ ఎదురులేకుండా సాగింది. వేలకొద్దీ పాటలు పాడింది జానకి. వాటిలో మంచిపాటలు ఎన్నో ఎన్నెన్నో ఉన్నాయి. ఏదో అస్పష్టమైన అజ్ఞాతమైన భావాన్ని కలిగించే మూడీ సాంగ్స్‌... కిర్రెక్కించే హుషారైన జాలీ సాంగ్స్‌.. రెండు రకాలూ పాడగలిగింది జానకి గళం.

హిందీ, సింహళం, బెంగాలి, ఒరియా, ఇంగ్లీషు, సంస్కృతం, తుళు, సౌరాష్ట్ర, జపనీస్, జర్మన్ భాషలు తెలిసిన జానకి, ఘంటసాల, డాక్టర్ రాజ్‌కుమార్, వాణి జయరాం, కె.జె. జేసుదాస్, ఎల్.ఆర్. ఈశ్వరి, పి. జయ చంద్రన్, పి.లీలా, కె.ఎస్. చిత్ర, సుజాత, జెన్సీ, పి.బి. శ్రీనివాస్, ఇళయరాజా, ఎస్.బి. బాలసుబ్రహ్మణ్యం వంటి పలువురు ప్రముఖ గాయకులతో పనిచేసింది.

విశేషాలు[మార్చు]

  1. ఎస్.జానకి ఎంతటి రాగమైన అతి సులభముగా పాడగలదు
 • నీ లీల పాడెద దేవా...అనే పాట అరుణాచలం సన్నాయితో పోటీపడి పాడింది.
 • నీలిమేఘాలలో, నీ ఆశ అడియాస, పగలే వెన్నెల జగమే ఊయల, పగలైతే దొరవేరా, నడిరేయి ఏజాములో, సిరిమల్లె పువ్వల్లే నవ్వు, గోవుల్లు తెల్లనా, మనసా తుళ్లిపడకే, ఈ దుర్యోధన దుశ్శాసన దుర్వినీత లోకంలో, నరవరా ఓ కురువరా, జననీ-వరదాయనీ, ఏ దివిలో విరిసిన పారిజాతమో, గున్నమామిడి కొమ్మమీదా...లాంటి 70,000పాటలు పాడింది.
 • జానకి కొంతకాలం సిరిసిల్లలో, రాజమండ్రిలో ఉన్నారు. రాజమండ్రిలో గాడవల్లి పైడిస్వామి అనే నాదస్వర విద్వాంసుని దగ్గర కీర్తనలు నేర్చుకున్నది.
 • ఇలా గాయనిగా పేరుగాంచిన జానకి ఫన్‌డాక్టర్‌ చంద్రశేఖర్ కుమారుడువి. రామ్‌ప్రసాద్‌ను వివాహమాడి చెన్నైలో స్థిరపడ్డారు. ఈమెకు మురళీకృష్ణ అనే కుమారుడు ఉన్నారు. ఆరు జాతీయ అవార్డులు, వివిధ రాష్ట్రాలకు చెందిన 35కి మించిన అవార్డులను జానకి సొంతం చేసుకున్నారు.


 • భారతీయ గాయనిలలో యస్, జానకి ప్రత్యేకమైన గాయనిగా పేరుపొందినది.
  • జానకి భారతీయ గాయనిలలో అతిఎకుౢవ పేరుపొందినది గాయనిలలొ జానకి 2వది.
 • జానకి ప్రత్యేక అనుకరణ కళాకారిణి.

ఘంటసాల - ఎస్. జానకి యుగళ గీతాలు[మార్చు]

 1. అందాలు చిందే దీపం అల చందమామ - ఋష్యశృంగ - 1961 - రచన: సముద్రాల జూనియర్
 2. అడగవే జాబిల్లి అడగవే అందాల - భూలోకంలో యమలోకం - 1966 - రచన: దాశరధి
 3. అలుకమానవే చిలుకల కొలికిరో - శ్రీ కృష్ణ సత్య - 1971 - రచన: పింగళి
 4. ఆశ నీవు తీర్చుమా ఆవల - మురిపించే మువ్వలు - 1962 (డబ్బింగ్) - రచన: ఆరుద్ర
 5. ఇంగ్లీషులోన మ్యారేజి హిందిలొ - ఆరాధన - 1962 - రచన: ఆరుద్ర
 6. ఇదే వేళ నా వలపు నిన్నే కోరిందీ - వసంతసేన - 1967 - రచన: శ్రీశ్రీ
 7. ఇదేనండి ఇదేనండి భాగ్యనగరము - ఎం.ఎల్.ఏ - 1957 - రచన: ఆరుద్ర
 8. ఇనాళ్ళు లేని సిగ్గు ఇపుడెందుకే - బంగారు తల్లి - 1971 - రచన: డా. సినారె
 9. ఈ పగలు రేయిగ పండు వెన్నెలగ - సిరిసంపదలు - 1962 - రచన: ఆత్రేయ
 10. ఈ పూలమాలే నీ పాదసేవకు - పూలమాల - 1973 - రచన: వడ్డాది
 11. ఉలకక పలుకక ఉన్నతీరే తెలియనీక - టైగర్ రాముడు - 1962 - రచన: సముద్రాల జూనియర్
 12. ఎందుకూ కవ్వించేదెందుకు - ఆలుమగలు - 1959 - రచన: ఆత్రేయ
 13. ఎనలేని ఆనందమీ రేయీ - పరమానందయ్య శిష్యుల కథ - 1966 - రచన: సదాశివ బ్రహ్మం
 14. ఎవ్వరో ఎందుకీరీతి సాధింతురు - నవగ్రహ పూజా మహిమ - 1964 - రచన: జి. కృష్ణమూర్తి
 15. ఎవ్వరో పిలిచినట్టుటుంది ( ఘంటసాల నవ్వు) - విజయం మనదే - 1970 - రచన: డా. సినారె
 16. ఏడుకొండలవాడా - లవ్ ఇన్ ఆంధ్ర - 1969 - రచన: డా. సినారె
 17. ఏమోఏమో ఇది నాకేమో ఏమో ఐనది - అగ్గిపిడుగు - 1964 - రచన: డా. సినారె
 18. ఏయ్ ఏయ్ నువ్వెంతో బాగుంటావు - పట్టిందల్లా బంగారం - 1971 - రచన: జంపన
 19. ఒకసారి కలలోకి రావయ్యా నా ఉవిళ్ళు - గోపాలుడు భూపాలుడు - 1967 - రచన: ఆరుద్ర
 20. ఓ ఓ మీసమున్న మొనగాడా చెప్ప- భూలోకంలో యమలోకం - 1966 - రచన: దాశరధి
 21. ఓ దారినపోయే చిన్నవాడా ఊరేది పేరేది - మా బాబు - 1960 - రచన: కొసరాజు
 22. ఓరబ్బీ చెబుతాను ఓలమ్మీ చెబుతాను - ఖైదీ బాబాయ్ - 1974 - రచన: డా. సినారె
 23. ఓహో సుందర ప్రకృతిజగతి - పాదుకా పట్టాభిషేకం - 1966 - రచన: వడ్డాది
 24. ఓహో హోహో రైతన్నా - విజయం మనదే - 1970 - రచన: కొసరాజు
 25. కదలించే వేదనలోనే ఉదయించును - సంగీత లక్ష్మి - 1966 - రచన: డా. సినారె
 26. కలల అలలపై తేలెను మనసు - గులేబకావళి కథ - 1962 - రచన: డా. సినారె
 27. కళ్ళళ్ళో నీరెందులకు కలకాలం - కానిస్టేబులు కూతురు - 1963 - రచన: ఆత్రేయ
 28. కాపాడుమా మము దేవా శాపాలనే - భక్త అంబరీష - 1959 - రచన: ఆరుద్ర
 29. కిలకిల బుల్లెమ్మో కిలాడి బుల్లెమ్మో - లక్ష్మీ కటాక్షం - 1970 - రచన: కొసరాజు
 30. కుశలమా నీకు ( సంతోషం) - శ్రీకాకుళ ఆంధ్ర మహావిష్ణువు కథ - 1966 - రచన: పింగళి
 31. కుశలమా నీకు (విషాదం) - శ్రీకాకుళ ఆంధ్ర మహావిష్ణువు కథ - 1966 - రచన: పింగళి
 32. కొండలన్నీ వెదికేను కోనలన్నీ- వసంతసేన - 1967 - రచన: దాశరధి
 33. గత సువిఙ్ఞానప్రకాశమ్ము మరల - లక్ష్మీ కటాక్షం - 1970 - రచన: చిల్లర భావనారాయణ
 34. గాలిలో తేలే పూలడోలలో పన్నీరు చల్లే - కలిమిలేములు - 1962 - రచన: మల్లాది
 35. గున్నమావి కొమ్మన కులికే చిలకమ్మా- పూలమాల - 1973 - రచన: వడ్డాది
 36. గులాబీలు పూచే వేళ కోరికలే పెంచుకో - భలే అబ్బాయిలు - 1969 - రచన: కొసరాజు
 37. చిరునవ్వుల చినవాడే పరువంలో - పవిత్ర హృదయాలు - 1971 - రచన: డా. సినారె
 38. చిలిపి చిలకమ్మ ఆగు నా చేతిలొ ఉయ్యాల - కలిమిలేములు - 1962 - రచన: ఆరుద్ర
 39. చూపుమా నీదయా కురిపించుమా - భక్త అంబరీష - 1959 - రచన: ఆరుద్ర
 40. చూపులు కలసిననాడే నీ రూపం - మా మంచి అక్కయ్య - 1970 - రచన: డా. సినారె
 41. చెంపకు చారెడు కళ్ళున్నాయి కళ్ళకు - తాళిబొట్టు - 1970 - రచన: ఆత్రేయ
 42. చెప్పకయే తప్పించుకు పోవకు - పెళ్ళి సంబంధం - 1970 - రచన: కె.వరప్రసాద రావు
 43. జయ గణనాయక విఘ్నవినాయక - నర్తనశాల - 1963 - రచన: సముద్రాల సీనియర్
 44. జూటా మాటల్తొ ఎందుకయ్యా మనకంతా - ఎత్తుకు పైఎత్తు - 1958 - రచన: కొసరాజు
 45. త ధిన్ ధోన ( ధిల్లానా) - ఉమా చండీ గౌరీ శంకరుల కథ - 1968 - సాంప్రదాయం
 46. ధర్మం చెయ్యండి బాబు దానం - వంశోద్ధారకుడు - 1972 - దాశరధి
 47. నడిరేయి ఏ ఝాములో స్వామి - రంగుల రాట్నం - 1967 - రచన: దాశరధి
 48. నాన్నా అనే రెండక్షరాలు మరపురాని - దీక్ష - 1974 - రచన: దాశరధి
 49. నీ ఆశా అడియాస చెయిజారే మణిపూస - ఎం.ఎల్.ఏ - 1957 - రచన: ఆరుద్ర
 50. పందొమ్మిదొందల యాభై మోడల్ - లోగుట్టు పెరుమాళ్ళకెరుక - 1962 - రచన: వీటూరి
 51. పలికేది నేనైనా పలికించేది నీవేలే- పవిత్ర హృదయాలు - 1971 - రచన: డా. సినారె
 52. భువనమోహినీ అవధిలేని యుగయుగాల - భామావిజయం - 1967 - రచన: డా. సినారె
 53. మధురం మధురం ఈ సమయం - కన్నుల పండుగ - 1969 - రచన: రెంటాల గోపాలకృష్ణ
 54. మనసులో మాలిక - మనసు మమత - 0000 - రచన: కె. వసంతరావు
 55. మనిషిని చూశాను ఒక మంచి మనిషిని - తల్లిదండ్రులు - 1970 - రచన: ఆత్రేయ
 56. మమతలలో మధురిమగా - మనసు మమత - 0000 - రచన: ఎలమంచిలి రాంబాబు
 57. మల్లెలు కురిసిన చల్లని వేళలో మనసే - అడుగుజాడలు - 1966 - రచన: డా. సినారె
 58. మీరజాలగలనా నీ ఓ లలనా - మా నాన్న నిర్దోషి - 1970 - రచన: డా. సినారె
 59. మేడలో ఉన్నావా ఓ రాజా వెన్నెల - పట్టిందల్లా బంగారం - 1971 - రచన: డా. సినారె
 60. రెడి రడి రెడీ ఎందుకైన మంచిది - పట్టుకుంటే లక్ష - 1971 - రచన: విజయ రత్నం
 61. లడ్డులడ్డులడ్డు బందరు మిఠాయి లడ్డు - అగ్గిపిడుగు - 1964 - రచన: జి. కృష్ణమూర్తి
 62. శ్రీశైల భవనా! భ్రమరాంబా రమణా - బంగారు పంజరం - 1969 - రచన: దేవులపల్లి
 63. స స స సారె గ గ గ గారె నీవురంగుల - సవతికొడుకు - 1963 - రచన: బైరాగి
 64. సలామాలేకుం సాహెబుగారు - గులేబకావళి కథ - 1962 - రచన: డా. సినారె
 65. సిక్కింది సేతులో కీలుబొమ్మా - ఎత్తుకు పైఎత్తు - 1958 - రచన: కొసరాజు
 66. సిలకవే రంగైన మొలకవే - సంగీత లక్ష్మి - 1966 - రచన: దాశరధి
 67. హిమనగిరీ మధుర (వరూధీనీ ప్రవరాఖ్య) - టైగర్ రాముడు - 1962 - రచన: సముద్రాల జూనియర్

పురస్కారాలు[మార్చు]

 • ఉత్తమ నేపథ్య గాయనిగా 1977, 1981, 1984, 1992 సంవత్సరాల్లో కేంద్ర ప్రభుత్వం ఇచ్చే జాతీయ పురస్కారాలు అందుకున్నారు.
 • 1986లో కలైమామణి
 • 1997లో ఫిలింఫేర్‌ దక్షిణ భారత సాహిత్య అవార్డు 2002లో ఎచీవర్‌ అవార్డు
 • 2005లో స్వరాలయ జేసుదాసు ప్రత్యేక పురస్కారం 2009లో గౌరవ డాక్టరేట్‌
 • 2011లో కర్నాటక బసవభూషణ్‌ అవార్డు
 • 2012లో నిత్యనూతన గాత్రంగా విజయా మ్యూజికల్‌ అవార్డు
 • 2013లో మా మ్యూజిక్‌ జీవిత సాఫల్య అవార్డు
 • రాష్ట్ర ప్రభుత్వం అందించే నంది అవార్డులు 10 సార్లు అందుకుంది.
 • వీటితోపాటు తమిళనాడు సినీ అవార్డులు 7, ఒరియా సినీ అవార్డుల్లో ఉత్తమ నేపథ్య గాయనిగా, కేరళ రాష్ర్ట ఉత్తమ గాయని గా 11 అవార్డులు సాధించింది.
 • జానకి గురించి ఇళయరాజా ఒక తమిళ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో, "జానకమ్మకి తేనె ఖర్చు ఎక్కువ. ఆమె దినామూ కొన్ని లీటర్ల తేనె తాగుతుంటాది. లేకపోతే ఆమె గాత్రంలో అంత మాధుర్యం ఎట్టా వచ్చునప్పా" అని ఆమె గాత్ర మాధుర్యం గురించి చమత్కరించాడు.

బయటి లింకులు[మార్చు]

"http://te.wikipedia.org/w/index.php?title=ఎస్.జానకి&oldid=1284259" నుండి వెలికితీశారు