అంతులేని కథ

వికీపీడియా నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు
అంతులేని కథ (1976)
Antulenikatha.jpg
దర్శకత్వం కె.బాలచందర్
నిర్మాణం రామ అరణంగళ్
రచన కె.బాలచందర్
తారాగణం జయప్రద, సరిత,
రజనీకాంత్(పరిచయం),
నారాయణ రావు(పరిచయం),
ఫటాఫట్ జయలక్ష్మి, శ్రీప్రియ,
కమల హాసన్, ప్రసాద్ బాబు
సంగీతం ఎం.ఎస్.విశ్వనాథం
నేపథ్య గానం వాణీ జయరాం, ఎస్.జానకి, ఎస్.పీ.బాలసుబ్రమణ్యం
గీతరచన ఆచార్య ఆత్రేయ
విడుదల తేదీ ఫిబ్రవరి 27, 1976
నిడివి 150 నిమిషాలు
భాష తెలుగు
ఐ.ఎమ్.డీ.బి పేజీ


మధ్య తరగతి ఇంటిలో పనికిమాలిన వారికోసం, చాదస్తాలతో డబ్బు తగలేసే వారికోసం ఉద్యోగం చేస్తూ ఒక దృఢమైన అమ్మాయి అనుభవించే యాతనలపై సాగిన చిత్రం. కె.బాలచందర్ దర్శకత్వం, కథన కౌశల్యం ఏ మాత్రం స్టార్ వాల్యూ లేని ఈ చిత్రాన్ని సూపర్ హిట్ చేశాయి (అప్పుడే జయప్రద రంగంలో వస్తున్నది).


సినిమా కథ[మార్చు]

సరిత (జయప్రద) ఒక మధ్యతరగతి కుటుంబ జీవనానికి ఏకైక ఆర్ధిక ఆధారమైన ఉద్యోగస్తురాలు. ఆమె చుట్టూ ఎన్నో సమస్యలు అల్లుకొని ఉంటాయి. ఆమె తండ్రి కుటుంబాన్ని వదిలేసి సన్యాసుల్లో కలిసిపోయాడు. తల్లి చాదస్తపు మనిషి. తమ్ముడు గుడ్డివాడు. ఒక చెల్లెలు వితంతువు. మరో చెల్లికి పెళ్ళి కావలసి ఉంది. అన్న (రజనీకాంత్) త్రాగుబోతు. ఇంకా అన్నకొక భార్య, బిడ్డ ఉన్నారు. వారంతా సరిత సంపాదన మీద ఆధారపడినవారే. అంతే కాకుండా ఆమె నిరంకుశత్వాన్ని (అలా అని వారి భావం) అసహ్యించుకొంటుంటారు.


సరితను ప్రేమిస్తున్న తిలక్ (?) ఆమెను పెళ్ళికి ఒప్పించాలని ప్రయత్నిస్తాడు కానీ కుటుంబ బాధ్యతల కారణంగా సరిత వివాహానికి సిద్ధం కాలేకపోతుంది. అయితే సరిత వితంతు సోదరి (శ్రీప్రియ) తిలక్ పట్ల ఇష్టం పెంచుకొంటుంది. తిలక్ కూడా ఆమెపట్ల ఆకర్షితుడౌతాడు. సరిత వారిద్దరి పెళ్ళీ చేస్తుంది.


సరిత ఇంటిపై గదిలో అద్దెకుండే వికటకవి గోపాల్ (నారాయణరావు) తన ఆటపాటలతో అందరినీ అలరిస్తుంటాడు. సరిత స్నేహితురాలు "ఫటాఫట్" జయలక్ష్మి జీవితాన్ని తేలికగా తీసుకొనే రకం. సాంఘీకమైన కట్టుబాట్లను లెక్క చేయదు. అయితే ఒక చిక్కు సమస్యలో ఆమె మనసు విరిగిపోయి ఆత్మహత్యకు తలపడుతుంది. సరిత ఆమెను రక్షించి వికటకవి గోపాల్‌తో పెళ్ళి చేస్తుంది.

ఒక సంఘటనలో సరిత అన్న కూడా పరివర్తన చెంది పనిచేసి బ్రతకడానికి సిద్ధపడ్డాడు. అప్పుడే సరిత బాస్ (కమల్ హాసన్) సరితను ఇష్టపడి పెళ్ళి చేసుకోవాలనుకొంటాడు. ఇక కుటుంబ బాధ్యతలు అన్నకు అప్పగించి తాను పెళ్ళి చేసుకోవాలనుకొని ఉద్యోగానికి రాజీనామా చేయడానికి నిర్ణయించుకొంది. అందరికీ శుభలేఖలు పంచింది. సరిత పెళ్ళికి అంతా సిద్ధమైంది. కాని పెళ్ళి పనుల్లో వెళ్ళిన సరిత అన్న హత్య చేయబడ్డాడు. ముహూర్తానికి ముందు సరితకు ఈ సంగతి తెలిసింది. ఎలాగో ఒప్పించి పెళ్ళికొడుకు (కమల్ హాసన్)తో తన చెల్లెలి పెళ్ళి చేస్తుంది. మరునాడు తను ఉద్యోగానికి ఎప్పుడూ వెళ్ళే సిటీబస్సులో బయలుదేరింది.

సినిమా చిత్రీకరణ[మార్చు]

ఈ సినిమా పూర్తిగా వైజాగ్‌లో చిత్రీకరింపబడింది. సినిమాలో అనేక పాత్రల చిత్రీకరణను సున్నితంగా మలచడంలో బాలచందర్ అద్భుతమైన ప్రతిభ స్పష్టంగా గమనించవచ్చును. సినిమాలో "మాస్‌" అనబడే విషయాలు ఏమీ లేవు. పెద్ద సెట్టింగులు లేవు. ఫైట్లు లేవు. డ్యూయట్లు లేవు. దాదాపు సినిమా అంతా ఒక మధ్యతరగతి ఇంటిలోనే తీశారు. అదీ నలుపు-తెలుపులో. పాత్రల స్వభావాలు కూడా హీరో-విలన్ మూసల్లోకి రావు. అయినా ఈ సినిమా అన్ని తరగతుల ప్రేక్షకుల మన్నననూ పొందింది.


హిట్టయిన పాటలు[మార్చు]

పాట సంగీతము నేపథ్యగానము
దేవుడే ఇచ్చాడు వీధి ఒకటీ ఎం.ఎస్.విశ్వనాథన్ యేసుదాసు
కళ్ళలో ఉన్న నీరు కన్నులకే తెలుసు ఎం.ఎస్.విశ్వనాథన్ ఎస్.జానకి
తాళి కట్టు శుభవేళ, మదిలో కల్యాణ మాల ఎం.ఎస్.విశ్వనాథన్ ఎస్.పీ.బాలసుబ్రమణ్యం
అరె ఏమిటీ లోకం, పలుగాకుల లోకం ఎం.ఎస్.విశ్వనాథన్ ఎల్.ఆర్.ఈశ్వరి
ఊగుతున్నది నీ ఇంటి ఉయ్యాల ఎం.ఎస్.విశ్వనాథన్ పి.సుశీల

తాళి కట్టు శుభవేళ[మార్చు]

తాలి కట్టు శుభవేల మెడలో కల్యణమాల ఒహొహూ అహహా మ్మ్హ్మ్హ్మ్మ్ హెయ్హెయ్హెయ్
తాలి కట్టు శుభవేల మెడలో కల్యణమాల
ఎనాడు ఎ జంటకో రాసి వున్నాడు విధి ఎప్పుడో
ఎనాడు ఎ జంటకో రాసి వున్నాడు విధి ఎప్పుడో || తాళి||

వికటకవి నేను వినండి ఒక కథ చెపుతాను
కాకులు దూరని కారడవి
అందులో కాలం యెరుగని మానోకటి
ఆ అందాల మానులో ఆ అద్బుత వనంలో
చక్కని చిలకలు అక్క చెల్లెలు పక్కన గోరింకలు
ఒక గోరింక ఓ చిలకమ్మకు ఒద్దిక కుదిరెనమ్మ
బావ రావ నన్నేలుకోవా || తాళి||

మేళాలు తాళాలు మంగళ వాద్యాలు మిన్నంటి మొగెనమ్మ
మేళాలు తాళాలు మంగళ వాద్యాలు మిన్నంటి మొగెనమ్మ
వలపుల విమాన తలపుల వేగాన వచ్చాయి కాంకలమ్మ
ఊరేగు దారులు వయ్యరి భామలు వీణలు మీటిరమ్మ
సింగారి జాణల ముంగాలి మువ్వలు ఘల్లున మొగెనమ్మ || తాళి||

గోమాత లేగతో కోండంత ప్రేమతో దీవించు వచ్చెనమ్మా
కాన్వెంటు పిల్లలు పోలిన నెమళులు గ్రీటింగ్స్ చెప్పిరమ్మ
నాలుగు వేదాలు వల్లించు హరిణాలు మంత్రాలు చదివెనమ్మ
నాలుగు వేదాలు వల్లించు హరిణాలు మంత్రాలు చదివెనమ్మ
పట్టపు టేనుగు పచ్చగ నూరేళ్ళు వర్ధిల్లమనెనమ్మ || తాళి||

చెయి చేయిగ చిలుక గోరింక శయ్యకు తరలిరమ్మ
చెల్లిలికోసం త్యాగము చేసిన చిలుకమ్మ తోలగెనమ్మ
తప్పుగ తలచిన అప్పటి గోరింక ఇప్పుడు తెలిసెనమ్మ
అది చిలుకే కాదని బావిలో కప్పని జాలిగ తలచెనమ్మ || తాళి||

దేవుడే ఇచ్చాడు వీధి ఒకటి[మార్చు]

దేవుడే ఇచ్చాడు వీధి ఒకటి..
దేవుడే ఇచ్చాడు వీధి ఒకటి
ఇక ఊరేల సొంత ఇల్లేల
ఇక ఊరేల సొంత ఇల్లేల ఓ చెల్లెలా
ఏల ఈ స్వార్ధం ఏది పరమార్ధం
ఏల ఈ స్వార్ధం ఏది పరమార్ధం

నన్నడిగి తలిదండ్రి కన్నారా..
నన్నడిగి తలిదండ్రి కన్నారా
నా పిల్లలే నన్నడిగి పుట్టారా
పాపం పుణ్యం నాది కాదే పోవే పిచ్చమ్మా
నారు పోసి నీరు పోసే నాధుడు వాడమ్మా
ఏది నీది ఏది నాది
ఈ వేదాలు ఉత్త వాదాలే ఓ చెల్లెలా
ఏల ఈ స్వార్ధం ఏది పరమార్ధం
దేవుడే ఇచ్చాడు వీధి ఒకటి
దేవుడే ఇచ్చాడు వీధి ఒకటి

శిలలేని గుడికేల నైవేద్యం
ఈ కలలోని సిరికేల నీ సంబరం
ముళ్ళ చెట్టుకు చుట్టూ కంచే ఎందుకు చిట్టమ్మా
కళ్ళులేని కభోధి చేతి దీపం నీవమ్మా
తొలుత ఇల్లు తుదకు మన్ను
ఈ బ్రతుకెంత దాని విలువెంత
ఏల ఈ స్వార్ధం ఏది పరమార్ధం

తెలిసేట్లు చెప్పేది సిద్ధాంతం
అది తెలియకపోతేనే వేదాంతం
మన్నులోన మాణిక్యాన్ని వెతికే వెర్రెమ్మా
నిన్ను నువ్వే తెలుసుకుంటే చాలును పోవమ్మా
ఏది సత్యం ఏది నిత్యం
ఈ మమకారం ఒట్టి అహంకారం ఓ చెల్లెలా
ఏల ఈ స్వార్ధం ఏది పరమార్ధం
దేవుడే ఇచ్చాడు వీధి ఒకటి
దేవుడే ఇచ్చాడు వీధి ఒకటి

విశేషాలు[మార్చు]

  • ఈ చిత్రానికి నారాయణ రావుకు 1500 రూపాయలూ, రజనీకాంత్ కు 1000 రూపాయలూ పారితోషికం లభించాయి.
  • "తాళి కట్టు శుభవేళ" - మిమిక్రీ పాట పెద్ద హిట్టు
  • రజనీకాంత్ సిగరెట్టు స్టైలు బాగా ప్రజలకు నాటింది.


మూలాలు[మార్చు]


బయటి లింకులు[మార్చు]