వసంత కోకిల
| వసంత కోకిల | |
|---|---|
| దర్శకత్వము | బాలు మహేంద్ర |
| నిర్మాత | రాజ్ ఎన్. సిప్పీ రోము ఎన్. సిప్పీ |
| రచన | బాలు మహేంద్ర |
| తారాగణం | కమల్ హాసన్ శ్రీదేవి సిల్క్ స్మిత |
| సంగీతం | ఇళయరాజా |
| సినిమెటోగ్రఫీ | బాలు మహేంద్ర |
| కూర్పు | డి. వాసు |
| విడుదలైన తేదీలు | 19 ఫిబ్రవరి 1982 |
| నిడివి | 141 నిమిషాలు |
| దేశము | భారత దేశం |
| భాష | తెలుగు |
వసంత కోకిల శ్రీదేవి మరియు కమల్ హాసన్ నాయికా నయకులుగా బాలు మహేంద్ర దర్శకత్వంలో 1982 లో విడుదలైన తెలుగు చిత్రము. ఈ చిత్ర తమిళ మాతృక మూండ్రమ్ పిరై అదే రోజు విడుదలైనది. హిందీ లో ఇది సద్మా గా 1983 జులై 8 న విడుదలైనది. ఈ చిత్రం లో తమ నటనకు శ్రీదేవి మరియు కమల్ హాసన్ విమర్శకుల ప్రశంసలు అందుకున్నారు.
విషయ సూచిక |
కథ [మార్చు]
లక్ష్మి(శ్రీదేవి) ఆధునిక భావాలు కల యువతి. ఒకసారి కారు నడుపుతుండగా ప్రమాదానికి గురై ఆసుపత్రిలో అపస్మారక స్థితిలోకి వెళ్ళిపోతుంది. కొద్దిరోజులకు తన గత జీవితాన్ని మరిచిపోయి ఆరేళ్ళ బాలిక వలె ప్రవర్తిస్తుంటుంది.ఆసుపత్రి నుండి పారిపోయి ఒక వ్యభిచార గృహానికి చేరుతుంది. అక్కడి నుండి ఆమెను సోము (కమల్ హాసన్) అనే ఒక ఒంటరి ఉపాధ్యాయుడు కాపాడి ఆశ్రయమిస్తాడు. ఆమె రాకతో అతని ఒంటరితనము దూరమౌతుంది. వారిద్దరూ కొద్దికాలంలోనే చాలా దగ్గరవుతారు. ఈ విషయాలన్నీ తెలియని రక్షకభటులు లక్ష్మిని మరియు ఆమెను కిడ్నాప్ చేసిన నేరగాళ్ళ కోసం వెతుకుతుంటారు. కొద్దికాలానికి లక్ష్మికి గతం గుర్తుకువచ్చి తన తల్లితండ్రుల వద్దికు వెళ్ళిపోతుంది. ఈ క్రమంలో సోము పడే వేదన వర్ణణాతీతం. ఆమెకు తాము కలిసి గడిపిన రోజులను గుర్తు చేయాలని సోము చేసే ప్రయత్నాలన్నీ విఫలమౌతాయి.
తారాగణం [మార్చు]
- కమల్ హాసన్ ... కె. సోంప్రకాష్ అలియాస్ సోము
- శ్రీదేవి ... రశ్మి
పాటలు [మార్చు]
1. కథగా కల్పనగా కనిపించెను
2. భోజరాజు కాలంలోన
3. ఈ లోకం అతి పచ్చన
4. మనకోసం వేకువయ్యేను
5. ఊరించే వయసిది లాలించే
పురస్కారములు [మార్చు]
ఫిల్మ్ ఫేర్ పురస్కారము [మార్చు]
పరిశీలన:
- శ్రీదేవి ... ఉత్తమ నటి
వనరులు : వసంత కోకిల