జూన్ 16
వికీపీడియా నుండి
జూన్ 16, గ్రెగొరియన్ క్యాలెండర్ ప్రకారము సంవత్సరములో 167వ రోజు (లీపు సంవత్సరము లో 168వ రోజు ). సంవత్సరాంతమునకు ఇంకా 198 రోజులు మిగిలినవి.
| << | జూన్ | >> | ||||
| ఆది | సోమ | మంగళ | బుధ | గురు | శుక్ర | శని |
| 1 | ||||||
| 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 |
| 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 |
| 16 | 17 | 18 | 19 | 20 | 21 | 22 |
| 23 | 24 | 25 | 26 | 27 | 28 | 29 |
| 30 | ||||||
| 2013 | ||||||
విషయ సూచిక |
సంఘటనలు[మార్చు]
- 1977: 'ఒరాకిల్ కార్పొరేషన్' ని కాలిఫోర్నియా (రెడ్ వుడ్ షోర్స్)లో, లారీ ఎల్లిసన్, బాబ్ మైనర్, ఎడ్ ఓట్స్ స్థాపించారు (సాఫ్ట్ వేర్ డెవలప్ మెంట్ లేబరేటరీస్ (ఎస్.డి.ఎల్) కొరకు)
- 1976: ఆంధ్రప్రదేశ్ 8వ గవర్నర్ గా ఆర్.డి. భండారి ప్రమాణ స్వీకారం చేసాడు (16 జూన్ 1976 నుంచి 16 ఫిబ్రవరి 1977 వరకు)
- 1963: లెఫ్టినెంట్ 'వాలెంటీనా తెరెష్కోవా ' తన 26వ ఏట, మొట్టమొదటి మహిళా రోదసీ యాత్రికురాలు గా (రోదసీలోనికి వెళ్ళిన 5వ వ్యక్తి), వోస్తోక్-6 (రోదసీ నౌక పేరు) లో, రోదసీలోనికి ప్రయాణించింది. ఆమె 2 రోజుల్ 22 గంటల 50 నిమిషములలో, భూమి ఛుట్టూ 49 సార్లు తిరిగి 12,50,000 మైళ్ళూ ప్రయాణించింది.
- 1960: ఆల్ ఫ్రెడ్ హిచ్ కాక్ దర్శకత్వంలో నిర్మించిన త్రిల్లర్ / హారర్ (భయానకమైన) 'సైఖో' సినిమా విడుదల అయ్యింది. రాబర్ట్ బ్లాచ్ రాసిన 'సైఖో' నవల ఈ సినిమాకి ఆధారం.
- 1903: ప్రపంచ ప్రసిద్ది పొందిన 'ఫోర్డ్ కార్లు' తయారు చేసే 'ఫోర్డ్ మోటారు కంపెనీ ని' అమెరికాలో స్థాపించారు.
- 1903: అంటార్కిటికా లోని దక్షిణ ధృవాన్ని చేరటానికి, 'రోల్డ్ అముండ్ సెన్' నార్వే లోని 'ఓస్లో' రేవుని వదిలి ప్రయాణ మయ్యాడు.
- 1897: 'రిపబ్లిక్ ఆఫ్ హవాయి' ని అమెరికా లో కలుపు కొనే ఒప్పందం పై సంతకం జరిగింది. 1898 వరకూ 'రిపబ్లిక్ ఒఫ్ హవాయి' రద్దు కాదని కూడా ఆ ఒప్పందంలో వుంది.
- 1891: జాన్ అబ్బాట్, కెనడ 3వ ప్రధాన మంత్రి గా ప్రమాణ స్వీకారం.
- 1890: 'లారెల్ అండ్ హార్డీ' గా పేరు పొందిన హాలీవుడ్ హాస్య జంటలోని 'లారెల్ (స్టాన్ లారెల్) (సన్నగా ఉండే నటుడు) పుట్టిన రోజు.
- 1883: ఇంగ్లాండ్ (సన్ డెర్ లేండ్) లోని విక్టోరియా హాల్ థియేటర్ లొ జరిగిన ప్రమాదంలో 183మంది పిల్లలు ఛనిపోయారు.
- 1858: సిపాయిల యుద్ధం (మొదటి స్వాతంత్ర్య సమరం) లో భాగంగా, 'మొరార్ యుద్దం - బేటిల్ ఆఫ్ మొరార్) జరిగింది.
- 1858: అబ్రహాం లింకన్, ఇల్లినాయిస్ లోని 'స్ప్రింగ్ ఫీల్డ్' లో, తన 'హౌస్ డివైడెడ్' ఉపన్యాసాన్ని ఇచ్ఛాడు.
- 1815: నెపొలియోనిక్ యుధ్దాలు - నెపోలియన్ ఆధ్వర్యంలో ఫ్రెంచి సైన్యం 'బ్లూఛెర్స్ ' అనబడే ప్రష్యన్ సైన్యాన్ని 'బేటిల్ ఆఫ్ లిగ్నీ' లో ఓడించాయి.(మరో 2 రోజుల్లో వాటర్లూ యుద్దం జరిగి, నెపొలియన్ ఓడిపోయాడు).
- 1815: నెపొలియోనిక్ యుద్దాలు - 'బేటిల్ ఆప్ క్వాత్రె బ్రాస్' ఫ్రెంచ్ మార్షల్ 'మైకేల్ నీ' 'ఆంగ్లో-డచ్' సైన్యంపై విజయం సాధంచాడు.(మరో 2 రోజుల్లో వాటర్లూ యుద్దం జరిగి, నెపొలియన్ ఓడిపోయాడు).
- 1723: స్కాట్లాండ్ కి చెందిన ఆడమ్ స్మిత్ ప్రముఖ ఆర్ధిక శాస్త్రవేత్త పుట్టిన రోజు. ఇతను రాసిన 'వెల్త్ ఆఫ్ నేషన్స్' పుస్తకం, నేటి 'ఆర్దిక శాస్త్రానికి' పునాది వేసింది. (17 జూలై 1790 మరణం).
- ఈ రోజు డబ్లిన్ , ఐర్లాండ్ ల లో 'బ్లూమ్స్ డే' జరువుకుంటారు.
- ఈ రోజు దక్షిణ ఆఫ్రికా లో 'యూత్ డే (యువకుల రోజు) జరుపుకుంటారు.
- 1954: ప్రపంచ కప్ ఫుట్‌బాల్ పోటీలు స్విట్జర్లాండ్ లో ప్రారంభమయ్యాయి.
- 2001: దేవాదుల ప్రాజెక్టుకు అప్పటి ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు శంకుస్థాపన చేశాడు.
జననాలు[మార్చు]
- 1902: ప్రముఖ శాస్త్రవేత్త, నోబెల్ బహుమతి గ్రహీత బార్బరా మెక్క్లింటన్
- 1959 : అమెరికా ప్రొఫెషనల్ మల్లయోధుడు వారియర్ జననం.
- 1977 : సుప్రసిద్ధ అమెరికా వాద్యకారుడు జాన్ మేయర్ జననం.
- 1971 : ప్రముఖ అమెరికన్ రాప్ కళాకారుడు టూపాక్ షకుర్ జననం.(మ.1996)
మరణాలు[మార్చు]
- 2004 -
పండుగలు మరియు జాతీయ దినాలు[మార్చు]
- [[]] - [[]]
బయటి లింకులు[మార్చు]
- బీబీసి: ఈ రోజున
- టీ.ఎన్.ఎల్: ఈ రోజు చరిత్రలో
- చరిత్రలో ఈ రోజు : జూన్ 16
- చారిత్రక సంఘటనలు 366 రోజులు - పుట్టిన రోజులు - స్కోప్ సిస్టం.
- ఈ రోజున చరిత్రలో ఏమి జరిగింది.
- ఈ రోజున ఏమి జరిగిందంటే.
- చరిత్రలో ఈ రోజున జరిగిన సంగతులు.
- ఈ రొజు గొప్పతనం.
- కెనడాలో ఈ రోజున జరిగిన సంగతులు
- చరిత్రలోని రోజులు
జూన్ 15 - జూన్ 17 - మే 16 - జూలై 16 -- అన్ని తేదీలు
| జనవరి | ఫిబ్రవరి | మార్చి | ఏప్రిల్ | మే | జూన్ | జూలై | ఆగష్టు | సెప్టెంబర్ | అక్టోబర్ | నవంబర్ | డిసెంబర్ |