మే 12
వికీపీడియా నుండి
మే 12, గ్రెగొరియన్ క్యాలెండర్ ప్రకారము సంవత్సరములో 132వ రోజు (లీపు సంవత్సరము లో 133వ రోజు ). సంవత్సరాంతమునకు ఇంకా 233 రోజులు మిగిలినవి.
| << | మే | >> | ||||
| ఆది | సోమ | మంగళ | బుధ | గురు | శుక్ర | శని |
| 1 | 2 | 3 | 4 | |||
| 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 |
| 12 | 13 | 14 | 15 | 16 | 17 | 18 |
| 19 | 20 | 21 | 22 | 23 | 24 | 25 |
| 26 | 27 | 28 | 29 | 30 | 31 | |
| 2013 | ||||||
విషయ సూచిక |
సంఘటనలు [మార్చు]
- 0254: పోప్ లూసియస్-I తరువాత పోప్ సెయింట్ స్టీఫెన్-I, 23వ కేథలిక్ పోప్ అయ్యాడు.
- 1364: 'కాసిమిర్ III', పోలాండ్ రాజు 'జగీల్లోనియన్ యూనివర్సిటీ' (పోలాండ్ లోని అత్యంత ప్రాచీనమైన విశ్వవిద్యాలయం)ని నెలకొల్పమని, 'రాజ పత్రం' (రాయల్ ఛార్టర్) ఇచ్చాడు.
- 1459: 'సన్ సిటీ ఇండియా' గా పేరుగాంచిన జోధ్‌పూర్ ని, రాథోర్ (డ్) వంశానికి చెందిన, రాజ్‌పుట్ ప్రముఖుడు, 'రావు జోధ్' స్థాపించాడు.
- 1701: నెదర్లాండ్ లోని 'డ్రెన్త్' అనే ప్రాంతం గ్రెగొరియన్ కేలండర్ ని అమలు చేసింది (నిన్నటి రోజు తేది 29 ఏప్రిల్ 1701 నుంచి నేటి తేది 12 మే 1701 కి తేదీలు మారాయి. అంటే ఈ మధ్య రోజులు అన్నీ మాయమయ్యాయి అన్న మాట)
- 1777: మొట్టమొదటి 'ఐస్ క్రీం' ప్రకటన (ఫిలిప్ లెంజి - న్యూయార్క్ గెజెట్ లో ప్రకటించారు).
- 1792: నియమిత సమయంలో దానంతట అదే శుభ్రం చేసుకునే మరుగుదొడ్లు (టాయిలెట్స్ ఫ్లషింగ్) పేటెంటు హక్కులు పొందారు.
- 1835: ఛార్లెస్ డార్విన్ ఉత్తర ఛిలి దేశంలో ఉన్న రాగి గనులను చూడటానికి వెళ్లాడు.
- 1908: 'నాథన్ బి. స్టబ్‌ల్‌ఫీల్డ్' 'వైర్‌లెస్ రేడియో ప్రసారానికి' పేటెంట్ హక్కులు తీసుకున్నాడు.
- 1921: మొట్ట మొదటి 'నేషనల్ హాస్పిటల్ డే' ని అమెరికా లో జరుపుకున్నారు.
- 1926: బ్రిటన్ లో కార్మిక సంఘాలు చేసిన 9 రోజుల సాధారణ సమ్మె ను విరమించారు.
- 1937: కింగ్ జార్జి VI పట్టాభిషేకం గ్రేట్ బ్రిటన్ లో జరిగింది.
- 1942: 1500 మంది యూదులను 'ఆస్చ్విట్జ్ కాన్సెంట్రేషన్ కేంపు' లో విషవాయువు ద్వారా చంపేసారు. ఈ కేంపు నాజీ జర్మనీ ఆక్రమించిన పోలాండ్ లో ఉంది.
- 1942: అమెరికా కు చెందిన రవాణానౌకను, మిస్సిసిపి నదీ ముఖద్వారం దగ్గర, నాజీ లకు చెందిన యు-బోటు ముంచేసింది.
- 1943: జర్మన్ సైన్యం, ఉత్తర ఆఫ్రికా లో లొంగిపోయింది.
- 1949: అమెరికా లో మొట్ట మొదటి మహిళా రాయబారిగా శ్రీమతి విజయలక్ష్మి పండిట్ ని భారత దేశం నియమించింది.
- 1951: మొదటి ఉదజని బాంబు (హైడ్రోజన్ బాంబు) ను 'ఎనెవెటక్ అటోల్' అనే చోట పరీక్షించారు.
- 1952: 'గజ్ సింగ్' జోధ్‌పూర్ మహారాజుగా కిరీట ధారణ జరిగింది.
- 1956: తూర్పు పాకిస్తాన్ (బంగ్లాదేశ్) తీవ్రమైన తుఫాను, ఎత్తైన సముద్రపు అలలతో, అతలాకుతలమైంది.
- 1965: సోవియట్ యూనియన్ ప్రయోగించిన రోదసీనౌక లూనా 5 చంద్రుని నేల మీద నెమ్మదిగా దిగలేక కూలిపోయింది. ప్రయోగం విఫలమైంది.
- 1982: 'యు.ఎస్. ఫుట్బాల్ లీగ్' ఏర్పడింది.
- 1984:ఫ్రాన్స్ అణుబాంబు ను పరీక్షించింది.
- 1984: నెల్సన్ మండేలా, దక్షిణాఫ్రికా లో ఖైదు చేయబడిన 22 సంవత్సరాల తరువాత తన భార్యను చూసాడు.
- 1986: అమెరికాకు చెందిన 'ఫ్రెడ్ మార్ఖం' తన రెండుచక్రాల సైకిలు పై, గంటకు 65 మైళ్ళ (104.607 కి.మీ) వేగం సాధించాడు.
- 1991: పసిఫిక్ ప్రాంతపు వాయవ్య దిక్కులో దొరికే, అరుదైన మూలిక తో కేన్సర్ వ్యాధికి ఒక కొత్త మందును కనుగొన్నారు.
- 1992: ఎవరెస్ట్ శిఖరాన్ని ఎక్కిన మొదటి బెల్జియం దేశ మహిళ 'ఇన్గ్రిడ్ బేయెన్స్'.
- 1997: ఆస్ట్రేలియా కు చెందిన 'సుసాన్ జీన్ (సుసీ) మరోనీ' (22 సంవత్సరాలు), క్యూబా నుంచి ఫ్లోరిడా స్ట్రెయిట్స్ (అమెరికా) వరకూ (180 కి.మీ - 112 మైళ్ళు) ఈత కొట్టిన మొదటి మనిషి, మొదటి మహిళ. ఈమె సెరిబ్రల్ ఫాల్సీ వ్యాధితో పుట్టింది.
- 2002: మాజీ అమెరికా అద్యక్షుడు జిమ్మీ కార్టర్ 5 రోజుల క్యూబా పర్యటనకు వెళ్లాడు. 1959 లో, క్యూబా లో ఫిడెల్ కాస్ట్రో తిరుగుబాటు చేసిన తరువాత పర్యటించిన మొట్టమొదటి అమెరికా అధ్యక్షుడు జిమ్మీ కార్టర్.
- 2008: ఛైనాలోని సిచుయాన్ లొ రెక్టర్ స్కేల్ మీద 8.0 మేగ్నిట్యూడ్ తీవ్రత తో భూకంపం వచ్చి, 69,000 మంది మరణించారు.
- 2010: బ్రిటన్ ప్రధానమంత్రిగా కన్జర్వేటివ్ పార్టీకి చెందిన డేవిడ్ కామెరాన్ ప్రమాణస్వీకారం చేశాడు.
- 2010: 'ఆఫ్రిఖియా ఏర్వేస్' కి చెందిన విమానం కూలి అందరూ మరణించారు ఒక్కడు తప్ప.
- 2012: భారత అంతరిక్ష పరిశోధన సంస్థ స్వదేశీ సాంకేతిక పరిజ్ఞానంతో తయారు చేసిన క్రయొజెనిక్ ఇంజిన్ ప్రయోగం సఫలమైంది. దీనిని, ఉపగ్రహ ప్రయోగ వాహకం జి.ఎస్.ఎల్.వి-డి5 లో బిగించుతారు. భారతదేశం, అమెరికా ను ఈ ఇంజిన్లు అడిగినప్పుడు భారత దేశానికి ఇవ్వకుండగా, భారత దేశానికి అనేకమైన అడ్డంకులను కల్పించింది.
జననాలు [మార్చు]
- 1401 - జపాన్ 101వ చక్రవర్తి 'షొకొ చక్రవర్తి' (మ. 1428)
- 1820 - ఫ్లోరెన్స్ నైటింగేల్ ని లేడి విత్ ద లేంప్ అని పిలుస్తారు. ఈమె ఇటలీలోని ఫ్లోరెన్స్ అనే నగరంలో పుట్టింది. క్రిమియన్ యుద్ధంలో ఈమె చేసిన సేవలు మరువరానివి. (మ. 13 ఆగష్టు 1910)
- 1895 - జిడ్డు కృష్ణమూర్తి, ప్రముఖ భారతీయ తత్వవేత్త.(మ. 1986)
- 1899 - ఇంద్రా దేవి [1], లాట్వియన్ యోగా గురువు (మ. 2002)
- 1950 - షోజొ ఫుజీ, జూడో ఛాంపియన్
- 1951 - గున్నార్ లార్సన్ స్వీడెన్, 200 మీటర్లు / 400 మీటర్లు ఈతగాడు (1972 లో ఒలింపిక్ బంగారుపతకాన్ని గెలిచాడు).
- 2003 - ప్రిన్స్ సద్రుద్దిన్ ఆగా ఖాన్, ఫ్రెంచి యునైటెడ్ నేషన్స్ హై కమిషనర్ ఫొర్ రెఫ్యూజీస్ (కాందిశీకులకు) (జ.1933)
మరణాలు [మార్చు]
- 1871: జాన్ ఎఫ్.డబ్లు. హెర్షెల్, బ్రిటిష్ ఖగోళ శాస్త్రవేత్త (నెబ్యులాలను కేటలాగ్ లో ప్రకటించాడు. (నక్షత్ర మేఘాల పట్టిక తయారుచేసిన వాడు)).
- 2004 -
పండుగలు మరియు జాతీయ దినాలు [మార్చు]
- 'నేషనల్ హాస్పిటల్ డే' ని 1921 నుంచి అమెరికా లో జరుపుకుంటున్నారు.
- [[]] - [[]]
బయటి లింకులు [మార్చు]
- బీబీసి: ఈ రోజున
- టీ.ఎన్.ఎల్: ఈ రోజు చరిత్రలో
- చరిత్రలో ఈ రోజు : మే 12
- చారిత్రక సంఘటనలు 366 రోజులు - పుట్టిన రోజులు - స్కోప్ సిస్టం.
- ఈ రోజున చరిత్రలో ఏమి జరిగింది.
- ఈ రోజున ఏమి జరిగిందంటే.
- చరిత్రలో ఈ రోజున జరిగిన సంగతులు.
- ఈ రొజు గొప్పతనం.
- కెనడాలో ఈ రోజున జరిగిన సంగతులు
మే 11 - మే 13 - ఏప్రిల్ 12 - జూన్ 12 -- అన్ని తేదీలు
| జనవరి | ఫిబ్రవరి | మార్చి | ఏప్రిల్ | మే | జూన్ | జూలై | ఆగష్టు | సెప్టెంబర్ | అక్టోబర్ | నవంబర్ | డిసెంబర్ |