జూలై 16
వికీపీడియా నుండి
జూలై 16, గ్రెగొరియన్ క్యాలెండర్ ప్రకారము సంవత్సరములో 197వ రోజు (లీపు సంవత్సరము లో 198వ రోజు ). సంవత్సరాంతమునకు ఇంకా 168 రోజులు మిగిలినవి.
| << | జూలై | >> | ||||
| ఆది | సోమ | మంగళ | బుధ | గురు | శుక్ర | శని |
| 1 | 2 | 3 | 4 | 5 | 6 | |
| 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 |
| 14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 |
| 21 | 22 | 23 | 24 | 25 | 26 | 27 |
| 28 | 29 | 30 | 31 | |||
| 2013 | ||||||
విషయ సూచిక |
సంఘటనలు [మార్చు]
- 0622 - ఇస్లామిక్ కేలండర్ (కాల గణన) మొదలైన రోజు. (హిజ్రీ శకం)
- 1439 - ఇంగ్లాండ్ లో ముద్దు పెట్టుకోవటం నిషేధించారు.
- 1661 - బేంక్ ఆఫ్ స్టాక్‌హోమ్ మొదటి సారిగా యూరప్ లో "బేంక్ నోట్స్" ని విడుదల చేసింది. (ప్రవేశ పెట్టింద్).
- 1880 - డాక్టర్ ఎమిలి హోవార్డ్ స్టోవ్, కెనడా లో సేవ (ప్రాక్టీసు) చేయటానికి అనుమతి (లైసెన్స్) పొందిన తొలి మహిళ.
- 1862 - లూయిస్ స్విప్ట్ అనే శాస్త్రవేత్త 'స్విప్ట్-టట్టల్' అనే తోకచుక్కను కనుగొన్నాడు.
- 1918 - నికొలస్ II , రష్యన్ జార్ (చక్రవర్తి) ని అతని కుటుంబాన్ని (భార్య, ఐదుగురు పిల్లలు ఉరి తీసారు.
- 1926 - నేషనల్ జియోగ్రాఫిక్ పత్రికలో (మేగజైన్) మొదటిసారిగా నీటిలోపల తీసిన కలర్ ఫొటో (రంగుల చిత్రం) ప్రచురించబడింది.
- 1936 - రక్తప్రసరణ (ఆర్టీరియల్ సర్క్యులేషన్) యొక్క మొదటీ ఎక్ష్-రే ఫొటో ను రోచెస్టర్, న్యూయార్క్ లోని రోచెస్టర్ లో తీసారు.
- 1941 - 100 డిగ్రీల ఫారెన్‌హీట్ (38 డిగ్రీల సెంటిగ్రేడ్) వేడి (వాతావరణం) సీట్టెల్ నగరం (వాషింగ్టన్ రాష్ట్రం, అమెరికా) లో నమోదు అయ్యింది.
- 1945- "ఫేట్ బాయ్" అని ముద్దు పేరున్న మొదటి ప్లుటొనియం అణుబాంబును (ప్రయోగాత్మకంగా) ఉదయం 5:30 గంటలకు అమెరికా అలమొగొర్డొ ఎయిర్ బేస్ (న్యూమెక్సికో ఎడారి ప్రాంతం) పరీక్షించింది. అణుబాంబు పేలిన తర్వాత ఏర్పడిన పుట్టగొడుగు మేఘాలు 41,000 అడుగుల ఎత్తువరకు వ్యాపించాయి. దాని ఫలితంగా, ఒక మైలు వ్యాసార్ధం (రేడియస్) లో ఉన్న జీవజాతులన్నీ మరణించాయి. ఈ రోజునుంచి "అణు యుగం" ప్రారంబమయ్యింది. ఈ అణుబాంబు తయారీ, ప్రయోగం అంతటినీ "మన్‌హట్టన్ ప్రాజెక్టు" గా పేరు పెట్టారు..
- 1945 - మిత్రదేశాల నాయకులు విన్‌స్టన్ చర్చిల్, హేరీ ఎస్. ట్రూమన్, జోసెఫ్ స్టాలిన్, రెండవ ప్రపంచ యుద్ధంలో ఓడిపోయిన జర్మనీ భవిష్యత్తు గురించి చర్చించటానికి సమావేశమయ్యారు.
- 1965 - 'ది మాంట్ బ్లాంక్' రోడ్ సొరంగం (ఫ్రాన్స్ దేశాన్ని, ఇటలీ దేశాన్ని కలిపే సొరంగం) ప్రారంభమయ్యింది.
- 1969 - అపొల్లో 11 రోదసీ నౌక (చంద్రుడి మీద మొదటిసారిగా మనిషిని దింపే ఉద్దేశంతో) కేప్ కెన్నెడి, ఫ్లొరిడా రాష్ట్రం నుంచి చంద్రుని మీదకు ప్రయాణం మొదలు పెట్టింది.
- 1979 - సద్దాం హుస్సేన్ , ఇరాక్ అద్యక్షుడు అయ్యాడు.
- 1990 - భూకంపం రిక్టర్ స్కేల్ 7.8 తీవ్రతతో, భూకంపం, ఫిలిప్పీన్స్ లో వచ్చి, 1600 మంది ప్రజలు మరణించారు. వేయికి పైగా ప్రజలు కనిపించకుండా పోయారు. మనీలా, చబనతుయన్, బగుయొవొ, లుజన్ ప్రాంతాలు బాగా నష్టపోయాయి. 1976 నుంచి ఆ ప్రాంతంలో జరిగిన భూకంపాలలో చాలా పెద్ద భూకంపం.
- 1993 - బ్రిటిష్ ఎమ్. ఐ. 15 , (అంతర్గత రహస్య భద్రతా దళం) తన 84 సంవత్సరాల చరిత్రలో, మొదటిసారిగా ప్రజల ముందుకు పత్రికల ద్వారా వచ్చింది. స్టెల్లా రెమింగ్టన్ (56 సం)(మహిళ) పత్రికల ముందు ఫొటో ఇచ్చిన మొదటి డైరెక్టర్ జనరల్
జననాలు [మార్చు]
- 1704: జాన్ కే ఇంగ్లాండ్, మెషినిస్ట్, ఫ్లైయింగ్ షటిల్ ని కనుగొన్నాడు.
- 1746: జియుసెప్పె పియజ్జి (Giuseppe Piazzi) మొదటి గ్రహశకలాన్ని (ఏస్టరాయిడ్) కనుగొన్నాడు (గ్రహశకలం పేరు: సెరెస్)
- 1872: రోల్డ్ అముండ్‌సెన్, నార్వే దేశస్థుడు, దక్షిణ ధృవాన్ని కనుగొన్నాడు (మరణం 18 జూన్ 1928).
- 1888: ఫ్రిట్జ్ జెర్నికె 'ఫేజ్-కంట్రాస్ట్ మైక్రోస్కోప్' ని కనుగొన్నాడు (1953 లో నోబెల్ బహుమతి పొందాడు)
- 1896: ట్రైగ్వె లీ మొదటి యునైటెడ్ నేషన్స్ సెక్రటరీ జనరల్ (1946-52)
- 1909: స్వాతంత్య్ర సమరయోధురాలు అరుణా ఆసఫ్ అలీ.
మరణాలు [మార్చు]
- 1999 - ఒకే ఇంజన్ గల విమానాన్ని జాన్ ఎఫ్. కెన్నెడి (జూనియర్) నడుపుతున్నప్పుడు, మార్తాస్ వైన్‌యార్డ్ (మసాచుసెట్స్) దగ్గర అట్లాంటిక్ సముద్రంలో కూలి జాన్ ఎఫ్.కెన్నెడీ (జూనియర్), అతని భార్య కేరొలిన్, అతని సోదరి మరణించారు.
- 2004 -
పండుగలు మరియు జాతీయ దినాలు [మార్చు]
- [[]] - [[]]
బయటి లింకులు [మార్చు]
- బీబీసి: ఈ రోజున
- టీ.ఎన్.ఎల్: ఈ రోజు చరిత్రలో
- చరిత్రలో ఈ రోజు : జూలై 16
- చారిత్రక సంఘటనలు 366 రోజులు - పుట్టిన రోజులు - స్కోప్ సిస్టం.
- ఈ రోజున చరిత్రలో ఏమి జరిగింది.
- ఈ రోజున ఏమి జరిగిందంటే.
- చరిత్రలో ఈ రోజున జరిగిన సంగతులు.
- ఈ రొజు గొప్పతనం.
- కెనడాలో ఈ రోజున జరిగిన సంగతులు
- చరిత్రలోని రోజులు
జూలై 15 - జూలై 17 - జూన్ 16 - ఆగష్టు 16 -- అన్ని తేదీలు
| జనవరి | ఫిబ్రవరి | మార్చి | ఏప్రిల్ | మే | జూన్ | జూలై | ఆగష్టు | సెప్టెంబర్ | అక్టోబర్ | నవంబర్ | డిసెంబర్ |