మే 21
వికీపీడియా నుండి
మే 21, గ్రెగొరియన్ క్యాలెండర్ ప్రకారము సంవత్సరములో 141వ రోజు (లీపు సంవత్సరము లో 142వ రోజు ). సంవత్సరాంతమునకు ఇంకా 224 రోజులు మిగిలినవి.
| << | మే | >> | ||||
| ఆది | సోమ | మంగళ | బుధ | గురు | శుక్ర | శని |
| 1 | 2 | 3 | 4 | |||
| 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 |
| 12 | 13 | 14 | 15 | 16 | 17 | 18 |
| 19 | 20 | 21 | 22 | 23 | 24 | 25 |
| 26 | 27 | 28 | 29 | 30 | 31 | |
| 2013 | ||||||
విషయ సూచిక |
[మార్చు] సంఘటనలు
- 0143: అమెరికా చరిత్రకారులకు తెలిసిన అతిపురాతనమైన సంవత్సరం. ఈ రోజున 'మాయా నాగరికత' కన్నా ముందు పాలించిన రాజు 'కింగ్ హర్వెస్ట్-బెర్‌గ్వోర్‌స్ట్' సింహాసనం ఎక్కిన సంవత్సరం.
- 1502: 'సెయింట్ హెలెనా' దీవిని పోర్చుగీస్ కి చెందిన నౌకాదళాధికారి అడ్మిరల్ 'జో డ నోవా' కనుగొన్నాడు.
- 1819:అమెరికాలో, మొట్టమొదటి 'సైకిల్' (రెండుచక్రాల వాహనం)(స్విఫ్ట్ వాకర్) ని న్యూయార్ నగరంలో ప్రవేశపెట్టారు.
- 1829: సికింద్రాబాదుకు ఆ పేరు రావటానికి కారణమైన సికిందర్ ఝా అసఫ్ జాహి మరణించాడు.
- 1851: దక్షిణ అమెరికా లోని కొలంబియాలో బానిసత్వాన్ని రద్దుచేసారు.
- 1871: యూరప్ లో మొట్టమొదటి రైలు (స్విట్జర్లాండ్ అందాలను చూడటానికి రిగి కొండ 'రిగి రైల్వేస్ (రిగి-బాహ్నెన్) ఏర్ఫాటు చేసారు. ('రేక్' టెక్నాలజీని వాడారు).
- 1881: క్లారా బార్టన్ 'అమెరికన్ రెడ్ క్రాస్' ని స్థాపించాడు.
- 1894: ఇంగ్లాండ్ లో 'మాంచెస్టర్ షిప్ కెనాల్' ని విక్టోరియా మహారాణి అధికారికంగా ప్రారంభించి, ఆ కాలువను డిజైన్ చేసిన 'సర్ ఎడ్వర్డ్ లీడర్ విలియమ్స్' కి 'నైట్‌హుడ్' బిరుదు ఇచ్చింది.
- 1908: మొట్టమొదటి హర్రర్ సినిమా (డాక్టర్ జెకీల్ అండ్ మిస్టర్ హైడ్) చికాగో (అమెరికా)లో విడుదల అయ్యింది.
- 1916: 'సమ్మర్ టైమ్' (డేలైట్ సేవింగ్ టైమ్) ని బ్రిటన్ అమలులో పెట్టింది.
- 1929: మొట్ట మొదటి సారి, న్యూయార్క్ లోని 'స్టాక్ ఎక్స్‌చేంజి' లొ 'ఆటోమాటిక్ ఎలెక్ట్రిక్ స్టాక్ కొటేషన్ బోర్డ్' ఏర్పాటు చేసారు.
- 1934: తన మునిసిపల్ పరిధిలో ఉన్న ప్రజలందరి వేలిముద్రలు సేకరించిన మొట్టమొదటి అమెరికన్ మునిసిపాలిటి 'ఒస్కాలూసా (అమెరికాలోని ఐవా రాష్ట్రంలో ఉంది).
- 1937: ఆర్కిటిక్ మహాసముద్రం మంచు ఖండాల మీద సోవియట్ రష్యా తన మొట్టమొదటి వైజ్ఞానిక పరిశోధక కేంద్రం మొదలు పెట్టింది.
- 1938: 'ఆస్ట్రేలియ-సర్రీ' క్రికెట్ మాచ్ లో బ్రాడ్‌మన్ 143 పరుగులు సాధించాడు. (198 నిమిషాలు 11 ఫోర్లు (ఫోర్స్)).
- 1958: బ్రిస్టల్ ప్రాంతంలో 'సబ్‌స్క్రైబర్ డయలింగ్ సిస్టం (ఎస్.టి.డి)' ని 1958 డిసెంబరు నుంచి ప్రవేశపెడుతున్నట్లు, యునైటెడ్ కింగ్‍డం పోస్ట్ మాస్టర్ జనరల్ ఎర్నెస్ట్ మార్‌ప్లెస్ ప్రకటించాడు.
- 1990: రిపబ్లిక్ ఆఫ్ యెమెన్ గా కలిసి పోవటానికి రెండు దేశాలు 'డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ యెమెన్', 'నార్త్ యెమెన్' లు అంగీకరించాయి.
- 1990: డౌ జోన్స్(అమెరికన్ స్టాక్ ఎక్స్‌చేంజ్ - మన నిఫ్టీ, సెన్సెక్స్ లాగ) 2844.68 స్థాయిని తాకింది.
- 1991: రాజీవ్ గాంధి, మాజీ భారత ప్రధాన మంత్రిని, 'నళిని' అనే మహిళ తన నడుముకి కట్టుకున్న బాంబును పేల్చి ('ఎల్.టి.టి.ఇ' కి చెందిన ఆత్మాహుతి దళ సభ్యురాలు) హత్య చేసింది.
- 1994: భారత దేశానికి చెందిన సుస్మితా సేన్,18 సంవత్సరాల వయసులో, 43వ మిస్ యూనివర్స్ గా ఎన్నికైంది.
- 1996: టాంజానియా కి దగ్గరలో ఉన్న విక్టోరియా సరస్స్తు లోఎమ్.వి. బుకొబ ములిగి పోయింది. 1000 మంది మరణించారు.
- 2003: ఉత్తర అల్జీరయాలో భూకంపం వచ్చి 2000 మందికి పైగా ప్రజలు మరణించారు.
• 2007: కడప జిల్లాలొ కోటి టన్నుల సామర్ద్యము గల ఉక్కు పరిశ్రమ స్థాపన కోసం అప్పటి వై.ఎస్. రాజశేఖర రెడ్డి ప్రభుత్వము గాలి జనార్ధన రెడ్డికి చెందిన బ్రహ్మణి ఇండస్ట్రీస్ తో ఒప్పందం చేసుకుంది
[మార్చు] జననాలు
- 0427 బి.సి. : ప్లాటో (అరిస్టోక్లెస్), ఏథెన్స్ (?)
[మార్చు] మరణాలు
- 1991: భారత మాజీ ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ.
[మార్చు] పండుగలు మరియు జాతీయ దినాలు
- చిలీ దేశపు నేవీ డే (నౌకాదళ దినోత్సవము) (1879 లో జరిగిన ఇంక్విక్ యుద్ధం).
- సెయింట్ హెలెనా దినోత్సవము (1502 లో ఇదేరోజున ఈ దీవి ని కనుగొన్నారు)
- ప్రపంచ సాంస్కృతిక దినోత్సవము (వరల్డ్ డే ఫర్ కల్చరల్ డైవర్సిటీ ఫర్ డైలాగ్ అండ్ డెవలప్‌మెంట్ (ఇంటర్నేషనల్)
[మార్చు] బయటి లింకులు
- బీబీసి: ఈ రోజున
- టీ.ఎన్.ఎల్: ఈ రోజు చరిత్రలో
- చరిత్రలో ఈ రోజు : మే 21
- చారిత్రక సంఘటనలు 366 రోజులు - పుట్టిన రోజులు - స్కోప్ సిస్టం.
- ఈ రోజున చరిత్రలో ఏమి జరిగింది.
- ఈ రోజున ఏమి జరిగిందంటే.
- చరిత్రలో ఈ రోజున జరిగిన సంగతులు.
- ఈ రొజు గొప్పతనం.
- కెనడాలో ఈ రోజున జరిగిన సంగతులు
- చరిత్రలోని రోజులు
మే 20 - మే 22 - ఏప్రిల్ 21 - జూన్ 21 -- అన్ని తేదీలు
| జనవరి | ఫిబ్రవరి | మార్చి | ఏప్రిల్ | మే | జూన్ | జూలై | ఆగష్టు | సెప్టెంబర్ | అక్టోబర్ | నవంబర్ | డిసెంబర్ |