జూలై 21
వికీపీడియా నుండి
జూలై 21, గ్రెగొరియన్ క్యాలెండర్ ప్రకారము సంవత్సరములో 201వ రోజు (లీపు సంవత్సరము లో 202వ రోజు ). సంవత్సరాంతమునకు ఇంకా 164 రోజులు మిగిలినవి.
| << | జూలై | >> | ||||
| ఆది | సోమ | మంగళ | బుధ | గురు | శుక్ర | శని |
| 1 | 2 | 3 | 4 | 5 | 6 | |
| 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 |
| 14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 |
| 21 | 22 | 23 | 24 | 25 | 26 | 27 |
| 28 | 29 | 30 | 31 | |||
| 2013 | ||||||
విషయ సూచిక |
సంఘటనలు [మార్చు]
- 0356 బి.సి. : హెరోస్ట్రేటస్ అనే యువకుడు, ప్రపంచపు 7 వింతలలో ఒకటైన, ఎఫెసిస్ లో ఉన్న ఆర్టెమిస్ ఆలయానికి, నిప్పు పెట్టాడు.
- 1588 : స్పానిష్ ఆర్మడా ని ఇంగ్లీష్ వారి నౌకాదళం ఓడించింది.
- 1667 : బ్రేడా సంధి జరిగింది. దీనివలన రెండావ ఆంగ్లేయులు-డచ్చిదేశస్తుల మధ్య జరిగిన రెండవ యుద్ధం అంతమైంది.
- 1718 : పస్సరోవిట్జ్ సంధి, ఒట్టోమన్ సామ్రాజ్యానికి, ఆస్ట్రియాకి, రిపబ్లిక్ ఆఫ్ వెనిస్ కి మధ్య జరిగింది.
- 1831 : నెదర్లాండ్ నుంచి బెల్జియమ్ స్వాతంత్ర్యం పొందింది. లియోపోల్డ్ I రాజు అయ్యాడు.
- 1873 : అయోవా (పశ్చిమ అమెరికా) రాష్ట్రంలోని అడేర్ దగ్గర జెస్సె జేమ్స్, జేమ్స్ యంగర్ ముఠా మొదటిసారిగా రైలు దోపిడీ చేసారు.
- 1904 : కేమిల్లె జెనాట్జీ కారుని గంటకు 65.79 మైళ్ళ వేగంతో ప్రయాణించి, ప్రపంచ రికార్డు నెలకొల్పాడు.
- 1931 : సి.బి.ఎస్. టెలివిజన్ చానెల్, అమెరికా లో, తన 7 రోజుల రోజు వారీ ప్రసారాలను, క్రమం తప్పకుండా ప్రసారం చేయటం మొదలుపెట్టింది.
- 1934 : గల్లిపొలిస్ (అమెరికాలోని ఓహియో రాష్ట్రం) లో 113 డిగ్రీల ఫారెన్‌హీట్ (45 డిగ్రీల సెంటిగ్రేడ్). ఇది ఓహియో రాష్ట్రంలో నమోదు అయిన రికార్డు.
- 1940 : ఎస్తోనియా, లాత్వియా, లిథూనియా దేశాలను, సోవియట్ యూనియన్, తనలో కలిపి వేసుకుంది.
- 1944 : జపాన్ ఆక్రమించిన 'గువామ్' అనే ప్రాంతాన్ని, అమెరికన్ దళాలు విడిపించాయి. (రెండవ ప్రపంచ యుద్ధం).
- 1949 : అమెరికన్ సెనేట్ నార్త్ అట్లాంటిక్ సంధిని (నాటో) ని 82-13 ఓట్లతో రద్దు చేసింది.
- 1954 : జెనీవా సమావేశంలో వియత్నాం దేశాన్ని, ఉత్తర వియత్నాం, దక్షిణ వియత్నాం దేశాలుగా విడదీసారు.
- 1954 : ఫ్రాన్స్, ఉత్తర వియత్నాం, దక్షిణ వియత్నాం దేశాలకు స్వాతంత్ర్యం ఇచ్చుటకు, జెనీవా లో ఒప్పుకున్నది.
- 1959 : ప్రపంచంలో మొట్టమొదటిగా అణుశక్తితో నడిచే వాణిజ్య నౌక 'సవన్నా' జల ప్రవేశం చేసింది.
- 1960 : సిరిమావొ బండారునాయకె, శ్రీలంక (నాటి సిలోన్) ప్రధాన మంత్రి (ణి) గా పదవిని చేపట్టి, ప్రపంచంలో మొదటి మహిళా ప్రధానిగా మరియు మొదటి మహిళా దేశాధినేత్రిగా గుర్తింపు పొందింది. (20 జూలై 1960 అని కూడా అంటారు)
- 1960 : అఫ్రికా లో కటం(తం)గా దేశంగా ఆవిర్భవించింది.
- 1961 : మెర్క్యురీ 4 (మెర్క్యురీ - రెడ్‌స్టోన్ 4 మిషన్) అనే రోదసీ నౌకను (లిబర్టీ బెల్ 7) గుస్ గ్రిస్సాం (రోదసీ యాత్రికుడు) తో అమెరికా ఆకాశంలోకి పంపింది. ఇతడు రోదసీలోకి వెళ్ళిన రెండవ అమెరికన్( సబ్-ఆర్బిటల్ మిషన్ అంటే రోదసీ లోనే తక్కువ ఎత్తులో, కక్ష్యలో, ప్రయాణించటం). (మెర్క్యురీ ప్రోగ్రాం)
- 1965 : పాకిస్తాన్, ఇరాన్, టర్కీ దేశాలు ప్రాంతీయ సహకార సంధిని చేసుకున్నాయి.
- 1980 : జీన్ క్లాడ్ డ్రోయెర్, పారిస్ లోని ఈపిల్ టవర్ ని 2గంటల 18 నిమిషాలలో ఎక్కాడు.
- 1983 : పోలిష్ ప్రభుత్వం 19 నెలల మార్షల్ లా ని ఎత్తివేసింది.
- 1983 : ప్రపంచంలోనే అతి తక్కువ ఉష్ణోగ్రత వోస్తోక్ స్టేషన్, అంటార్క్‌టికా ఖండం లో (-89.2 డిగ్రీల సెంటిగ్రేడ్ -128.6 డిగ్రీల ఫారెన్ హీట్) రికార్డ్ అయ్యింది.
- 1984 : తూర్పు జర్మనీ కి చెందిన 'మారిటా కోచ్' 200 మీటర్లను 21.71 సెకండ్లలో సాధించి మహిళల ప్రపంచ రికార్డును నెలకొల్పింది.
- 1988 : ఏరియేన్ -3 రాకెట్ ద్వారా 2 కమ్యూనికేషన్ ఉపగ్రహాలను పంపారు. అందులో ఒకటి భారత దేశానికి చెందినది.
- 1990 : తూర్పు బెర్లిన్ లో బెర్లిన్ గోడని తీసివేసినందుకు ఆనందంగా రాక్ కన్సర్ట్, 1,50,000 మంది ఒక పండుగలా జరుపుకున్నారు.
- 2005 : లండన్ లో బాంబు పేలుళ్ళు. అంతకు ముందు జూలై 7 న కూడా బాంబు పేలుళ్ళు జరిగాయి]]
- 2007 : జె.కె. రౌలింగ్ రాసిన హారీ పాటర్ వరుస నవలలో చివరిదైన హారీ పాటర్ అండ్ ది డెత్లో హాలోస్ విడుదలైంది.
జననాలు [మార్చు]
- 1899 : ఎర్నెస్ట్ హెమింగ్వే అమెరికన్ నవలా రచయిత. నోబెల్ బహుమతి గ్రహీత
- 1940: గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి శంకర్ సిన్హ్ వాఘేలా.
- 1947: భారత మాజీ క్రికెట్ క్రీడాకారుడు చేతన్ చౌహాన్.
మరణాలు [మార్చు]
- 1796 : రాబర్ట్ బర్న్స్, స్కాటిష్ కవి.
- 1948 : అర్షిలె గోర్కీ, అబ్స్ట్రాక్ట్ ఎక్ష్ప్రెషనిస్ట్ , 43వ ఏట.
- 1957 : అమెరికా లో బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ ను కనిపెట్టిన బెర్నార్డ్ స్పూనర్.
- 1998: అమెరికాకు చెందిన మొదటి రోదసీ యాత్రికుడు అలాన్ షెపార్డ్ మరణం. ఇతడు అపొలొ-14 రోదసీ నౌకను నడిపి చంద్రుడిని చేరి, చంద్రుడి మీద నడిచిన 5వ మనిషి.
- 2009 : ప్రముఖ హిందుస్తాని గాయని పద్మభూషణ్ ,పద్మవిభూషణ్ శ్రీమతి గంగూబాయ్ హంగళ్ పరమపదించారు.
పండుగలు మరియు జాతీయ దినాలు [మార్చు]
బయటి లింకులు [మార్చు]
- బీబీసి: ఈ రోజున
- టీ.ఎన్.ఎల్: ఈ రోజు చరిత్రలో
- చరిత్రలో ఈ రోజు : జూలై21
- చారిత్రక సంఘటనలు 366 రోజులు - పుట్టిన రోజులు - స్కోప్ సిస్టం.
- ఈ రోజున చరిత్రలో ఏమి జరిగింది.
- ఈ రోజున ఏమి జరిగిందంటే.
- చరిత్రలో ఈ రోజున జరిగిన సంగతులు.
- ఈ రొజు గొప్పతనం.
- కెనడాలో ఈ రోజున జరిగిన సంగతులు
- చరిత్రలోని రోజులు
జూలై 20 - జూలై 22 - జూన్ 21 - ఆగష్టు 21 -- అన్ని తేదీలు
| జనవరి | ఫిబ్రవరి | మార్చి | ఏప్రిల్ | మే | జూన్ | జూలై | ఆగష్టు | సెప్టెంబర్ | అక్టోబర్ | నవంబర్ | డిసెంబర్ |