ఆగష్టు 7
వికీపీడియా నుండి
ఆగష్టు 7, గ్రెగొరియన్ క్యాలెండర్ ప్రకారము సంవత్సరములో 219వ రోజు (లీపు సంవత్సరము లో 220వ రోజు ). సంవత్సరాంతమునకు ఇంకా 146 రోజులు మిగిలినవి.
| << | ఆగష్టు | >> | ||||
| ఆది | సోమ | మంగళ | బుధ | గురు | శుక్ర | శని |
| 1 | 2 | 3 | ||||
| 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 |
| 11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 |
| 18 | 19 | 20 | 21 | 22 | 23 | 24 |
| 25 | 26 | 27 | 28 | 29 | 30 | 31 |
| 2013 | ||||||
విషయ సూచిక |
సంఘటనలు [మార్చు]
- 1858: బ్రిటిష్ క్వీన్ విక్టోరియా, ఒట్టావా నగరాన్ని, కెనడా కి రాజధానిగా ఎంపిక చేసింది.
- 1942: అమెరికా మెరైన్లు గ్వాడల్కెనాల్ పై దాడి ప్రారంబించారు.
- 1960: ఫ్రాన్స్ నుంచి ఐవరీ కోస్ట్ స్వాతంత్ర్యం పొందింది.
- 1970: ఇంగ్లాండ్ లోని ఆక్స్‌ఫర్డ్‌షైర్ కి చెందిన వేలెరీ గనె, కి ఒక నాలుగు సంవత్సరాల బర్మా జాతికి చెందిన తారావుడ్ ఆంటిగొనె, అనే పేరుగల పిల్లి ఉంది. అధి ఒకే కాన్పులో (ఈత), పందొమ్మిది పిల్లి పిల్లలకు, జన్మనిచ్చింది. జీవించి ఉన్న పదిహేను పిల్లి పిల్లలలో, ఒకటి ఆడది మిగిలిన 14 మగ పిల్లిపిల్లలు. నాలుగు పిల్లిపిల్లలు మరణించాయి. ఇప్పటికీ, ఇదే రికార్డు.
- 1972: ఉగాండా నియంత, ఇడి అమిన్ ఆసియా దేశస్తులందరూ, ఉగాండా ని 90 రోజులలోగా, విడిచి వెళ్ళిపోవాలని ఆదేశాలు జారీచేశాడు.
- 1987: 30 సంవత్సరాల వయసు ఉన్న లైనే కాక్స్, ఆర్కిటిక్ మరియు పసిఫిక్ సముద్రాల వేరుచేసే బేరింగ్ జలసంధిని, స్విమ్ సూట్ (ఈత దుస్తుల) లో, అలస్కా నుండి సైబీరియా కు 2.7 మైళ్ళు (4.3 కిలోమీటర్లు)దూరాన్ని, రెండు గంటల ఆరు నిమిషాలలో ఈదింది. ఆమె ఈదుతున్నప్పుడు నీరు 50 సెంటిగ్రేడ్ వేడ్ మాత్రమే ఉంది. అంతేకాదు, సంవత్సరంలో, ఎక్కువ భాగం ఈ ప్రాంతం అంతా గడ్డకట్టుకుని ఉంటుంది.
- 1998: ఆఫ్రికా లోని, కెన్యా మరియు టాంజానియా లోని అమెరికా దౌత్య కార్యాలయాలపై వెంట వెంటనే నిమిషాల్లో బాంబు దాడి చేసినప్పుడు కనీసం 200 మంది మృతి చెందగా, అనేక మంది గాయపడ్డారు.
- 2009: ఉత్తరాఖండ్ గవర్నర్‌గా మార్గరెట్ ఆల్వా ప్రమాణస్వీకారం.
జననాలు [మార్చు]
- 0317: కాన్స్‌టాంటియస్ II రోమన్ చక్రవర్తి (పరిపాలన 337నుంచి 361 వరకు- మరణం. 361)
- 1598: జార్జ్ స్టీర్న్‌హీం, "స్వీడిష్ కవిత్వ పితామహుడి" పేర్కొంటారు. (హెర్క్యులెస్)
- 1779: ఆధునిక భూగోళశాస్త్రానికి పునాది వేసిన వారిలో కార్ల్ రిట్టేర్ రెండవవాడు.
- 1783: జాన్ హీత్కోట్ ఆవిష్కర్త లేస్-మేకింగ్ (లేస్ తయారు చేసే) యంత్రాలను కనుగొన్నాడు. పశ్చిమ గోదావరి జిల్లాలోని, మహిళలు, ఈ లేసు తయారీలో నిపుణులు. అది వారికి కుటీర పరిశ్రమ. వారు తయారుచేసిన లేసులు విదేశాలకు ఎగుమతి అవుతాయి.
- 1876: మాతా హరి, డచ్ దేశస్తురాలు. నర్తకి మరియు గూఢచారి
- 1886: లూయిస్ హజెల్టైన్, న్యూట్రొడైన్ సర్క్యూట్ ని కనుగొన్నాడు. ఈ సర్క్యూట్ వలన రేడియో ని తయారు చేయటం సాధ్యమైంది.
- 1903: లూయిస్ లీకీ, ఆంత్రోపోలజిస్ట్ (1964 లో రిచర్డ్ హూపెర్ మెడల్ బహుమతిగా పొందాడు.)
- 1903: లూయిస్ లీకీ, బ్రిటిష్ పురావస్తు శాస్త్రవేత్త
- 1907: స్వాతంత్ర్యసమరయోధుడు బెజవాడ గోపాలరెడ్డి
- 1907: ఆంధ్ర రాష్ట్ర రెండవ ముఖ్యమంత్రి, డా.బెజవాడ గోపాలరెడ్డి
- 1925: ప్రఖ్యాత శాస్త్రవేత్త ఎం.ఎస్.స్వామినాథన్
- 1980: భారతదేశపు బ్యాడ్మింటన్ క్రీడాకారుడు చేతన్ ఆనంద్.
మరణాలు [మార్చు]
- 1941: విశ్వకవి రవీంద్రనాథ్ టాగూర్.
- 2012: ప్రముఖ సాహితీవేత్త సామల సదాశివ
పండుగలు మరియు జాతీయ దినాలు [మార్చు]
- తల్లిపాల వారోత్సవాలు ఆంధ్రప్రదేశ్ లో వారం రోజులు జరుగుతాయి (1 ఆగష్టు నుంచి 7 ఆగష్టు వరకు)
- 1960: ఐవరీకోస్ట్ స్వాతంత్ర్యదినోత్సవము.
బయటి లింకులు [మార్చు]
- బీబీసి: ఈ రోజున
- టీ.ఎన్.ఎల్: ఈ రోజు చరిత్రలో
- చరిత్రలో ఈ రోజు : ఆగష్టు 7
- చారిత్రక సంఘటనలు 366 రోజులు - పుట్టిన రోజులు - స్కోప్ సిస్టం.
- ఈ రోజున చరిత్రలో ఏమి జరిగింది.
- ఈ రోజున ఏమి జరిగిందంటే.
- చరిత్రలో ఈ రోజున జరిగిన సంగతులు.
- ఈ రొజు గొప్పతనం.
- కెనడాలో ఈ రోజున జరిగిన సంగతులు
ఆగష్టు 6 - ఆగష్టు 8 - జూలై 7 - సెప్టెంబర్ 7 -- అన్ని తేదీలు
| జనవరి | ఫిబ్రవరి | మార్చి | ఏప్రిల్ | మే | జూన్ | జూలై | ఆగష్టు | సెప్టెంబర్ | అక్టోబర్ | నవంబర్ | డిసెంబర్ |