జె.బాపురెడ్డి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
జె. బాపురెడ్డి
జననంజంకె బాపురెడ్డి
(1936-07-21)1936 జూలై 21
సిరికొండ, ఇల్లంతకుంట మండలం, రాజన్న సిరిసిల్ల జిల్లా, తెలంగాణ
మరణం2023 ఫిబ్రవరి 8(2023-02-08) (వయసు 86)
హైదరాబాదు, తెలంగాణ
ప్రసిద్ధికవి, రచయిత
మతంహిందూ
భార్య / భర్తరాజేశ్వరి
తల్లిదండ్రులుజంకె కృష్ణారెడ్డి, జంకె రామలక్ష్మి

జె.బాపురెడ్డి, (1936, జూలై 21 - 2023, ఫిబ్రవరి 8) తెలంగాణ రాష్ట్రానికి చెందిన ఐఏఎస్ అధికారి, కవి, రచయిత. ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్‌లో చేరి మెదక్, వరంగల్లు జిల్లాలకు కలెక్టర్‌గా పనిచేశాడు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రికి ప్రత్యేక సహాయకుడుగా ఉన్నాడు. భారత పొగాకు బోర్డుకు ఎక్జిక్యూటివ్ డైరెక్టర్‌గా, ధర్మాదాయశాఖకు కమీషనర్‌గా, పరిశ్రమల శాఖ కమీషనర్‌గా, చిన్నమొత్తాల పొదుపు సంస్థ కమీషనర్‌గా, ఆంధ్రప్రదేశ్ పరిశ్రమల అభివృద్ధి కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టర్‌గా, ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ సభ్యుడిగా వివిధ హోదాలలో పనిచేసి పదవీ విరమణ చేశాడు. ఇతడు 37 దేశాలలో పర్యటించి పలు సాహిత్య, సాంస్కృతిక కార్యక్రమాలలో పాలుపంచుకున్నాడు. తెలుగు, ఇంగ్లీషు భాషలలో 38కి పైగా గ్రంథాలను వెలువరించాడు.[1]

జననం, విద్య[మార్చు]

బాపురెడ్డి 1936, జూలై 21న కృష్ణారెడ్డి - రామలక్ష్మి దంపతులకు తెలంగాణ రాష్ట్రం, రాజన్న సిరిసిల్ల జిల్లా, ఇల్లంతకుంట మండలం, సిరికొండ గ్రామంలో జన్మించాడు. సిరిసిల్ల, హైదరాబాద్‌లలో విద్యాభ్యాసం చేశాడు. ఉస్మానియా విశ్వవిద్యాలయం నుండి అర్థశాస్త్రంలో ఎం.ఎ. పట్టాపొందాడు.[2]

వ్యక్తిగత జీవితం[మార్చు]

బాపురెడ్డికి రాజేశ్వరితో వివాహం జరిగింది.

సాహిత్య ప్రస్థానం[మార్చు]

మహాకవి సి. నారాయణ రెడ్డి స్పూర్తితో 8వ తరగతిలలోనే కవిత్వం రాసి సాహిత్యరంగంలోకి అడుగుపెట్టిన బాపురెడ్డి పద్యం, గేయం, వచనం, విమర్శ, అనువాదం మొదలు అన్ని సాహిత్య ప్రక్రియల్లో రచనలు చేశాడు.

సామాజిక, సాహిత్య, సాంస్కృతిక సంఘాలతో అనుబంధం[మార్చు]

  • ఆంధ్రప్రదేశ్ సంగీత నాటక అకాడమీ - ప్రత్యేక అధికారి
  • అఖిల భారత సాంస్కృతికోత్సవాలు - కార్యదర్శి
  • మొదటి ప్రపంచ తెలుగు మహాసభలు - కార్యదర్శి
  • నాల్గవ ప్రపంచ తెలుగు మహాసభలు - హైపవర్ కమిటీ సభ్యుడు
  • అంతర్జాతీయ తెలుగు సంస్థ - బోర్డ్ ఆఫ్ గవర్నర్స్ సభ్యుడు
  • ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ - సభ్యుడు
  • హైదరాబాద్ పొయెట్రీ సొసైటీ - అధ్యక్షుడు
  • జవహర్ పుస్తకాలయ సలహా సంఘం - సభ్యుడు
  • నేషనల్ బుక్ ట్రస్ట్ - సభ్యుడు
  • చైతన్య కవితావేదిక, బెంగుళూరు - ఉపాధ్యక్షుడు
  • సమైక్యభారతి సాహిత్య, సాంస్కృతిక సంస్థ - గౌరవ అధ్యక్షుడు
  • అమెరికన్ బయోగ్రాఫిక్ ఇన్‌స్టిట్యూట్ - గౌరవ సభ్యుడు
  • మైకేల్ మధుసూదన్ అకాడెమీ, కలకత్తా - గౌరవ అధ్యక్షుడు

రచనలు[మార్చు]

తెలుగు[మార్చు]

  1. చైతన్యరేఖలు
  2. రాకెట్టు రాయబారం
  3. హృదయపద్యం[3]
  4. బాపురెడ్డి గేయాలు[4]
  5. బాపురెడ్డి గేయనాటికలు
  6. బాపురెడ్డి పద్యకావ్యాలు
  7. శ్రీకార శిఖరం[5] (గేయ సంపుటి)
  8. నా దేశం నవ్వుతూంది[6] (గేయ సంపుటి)
  9. ప్రేమారామం[7] (గేయ సంపుటి)
  10. మనసులోని మాట (వ్యాస సంపుటి)
  11. ప్రణవ ప్రణయం[8] (వచన కవిత)
  12. మన చేతుల్లోనే ఉంది[9] (వచన కవితలు)
  13. రంగు రంగుల చీకట్లు[10] (వచన కవిత)
  14. వాడిపోని వసంతాలు[11]
  15. కాలం మాయాజాలం[12] (వచన కవిత)
  16. బాపురెడ్డి భావగీతాలు[13] (గేయ సంపుటి)
  17. సౌదామినీ కవితలు[14]
  18. ఆత్మీయరాగాలు
  19. జీవనశ్రుతులు[15] (పద్య కవిత)
  20. ఆటపాటలు[16] (గేయ సంపుటి)
  21. అనంతసత్యాలు[17]
  22. నాదవేదాలు
  23. పంచబాణ సంచా[18]
  24. పద్యాల పల్లకి[19]
  25. నవగీత నాట్యం[20]
  26. వ్యవధి లేదు[21] (అనువాదం)
  27. పైకెత్తాలి[22] (అనువాదం)
  28. అక్షరానుభూతులు[23] (వచన కవిత)
  29. ప్రకృతిలో ఓ పవిత్రత[24] (అనువాదం)

ఆంగ్లం[మార్చు]

  1. In Quest of Harmony
  2. Longing for Life
  3. Urn of Love
  4. Loving is Living
  5. Anatomy of Life
  6. Verities and Visions

పురస్కారాలు[మార్చు]

  • 1971లో ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ పురస్కారం
  • 1987లో మైఖేల్ మధుసూదన్ అవార్డ్.
  • 1988లో ఆనరరీ డాక్టర్ ఇన్ హ్యుమానిటిస్ ప్రదానం.
  • 1989లో ప్రపంచ కవుల మహాసభల్లో ప్రపంచ కళాసంస్కృతుల అకాడమీ నుండి గౌరవ డాక్టరేట్.
  • 1989లో తెలుగు విశ్వవిద్యాలయం నుండి "మన చేతుల్లోనే ఉంది" గ్రంథానికి ఉత్తమ వచన కవిత పురస్కారం.
  • 2016లో దాశరథి సాహితీ పురస్కారం - తెలంగాణ ప్రభుత్వం[25]

మరణం[మార్చు]

బాపురెడ్డి 2023, ఫిబ్రవరి 8న హైదరాబాదులో మరణించాడు.

మూలాలు[మార్చు]

  1. "తెలంగాణ చాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ వారి జాలస్థలిలో జె.బాపురెడ్డి ప్రొఫైల్". Archived from the original on 2016-04-19. Retrieved 2016-02-06.
  2. పత్తిపాక, మోహన్‌ (2022-08-21). "బాలల కవితా 'బాలహేల' డా. జె. బాపురెడ్డి | సాహిత్యం". NavaTelangana. Archived from the original on 2023-02-09. Retrieved 2023-02-09.
  3. డిజిటల్ లైబ్రరీ ఆఫ్ ఇండియాలో హృదయపద్యం పుస్తకప్రతి
  4. డిజిటల్ లైబ్రరీ ఆఫ్ ఇండియాలో బాపురెడ్డి గేయాలు పుస్తకప్రతి
  5. డిజిటల్ లైబ్రరీ ఆఫ్ ఇండియాలో శ్రీకార శిఖరం పుస్తకప్రతి
  6. డిజిటల్ లైబ్రరీ ఆఫ్ ఇండియాలో నా దేశం నవ్వుతూంది పుస్తకప్రతి
  7. డిజిటల్ లైబ్రరీ ఆఫ్ ఇండియాలో ప్రేమారామం పుస్తకప్రతి
  8. డిజిటల్ లైబ్రరీ ఆఫ్ ఇండియాలో ప్రణవ ప్రణయం పుస్తకప్రతి
  9. డిజిటల్ లైబ్రరీ ఆఫ్ ఇండియాలో మన చేతుల్లోనే ఉంది పుస్తకప్రతి
  10. డిజిటల్ లైబ్రరీ ఆఫ్ ఇండియాలో రంగురంగులచీకట్లు పుస్తకప్రతి
  11. డిజిటల్ లైబ్రరీ ఆఫ్ ఇండియాలో వాడిపోని వసంతాలు పుస్తకప్రతి
  12. డిజిటల్ లైబ్రరీ ఆఫ్ ఇండియాలో కాలం మాయాజాలం పుస్తక ప్రతి
  13. డిజిటల్ లైబ్రరీ ఆఫ్ ఇండియాలో బాపురెడ్డి భావగీతాలు పుస్తకప్రతి
  14. డిజిటల్ లైబ్రరీ ఆఫ్ ఇండియాలో సౌదామినీ కవితలు
  15. డిజిటల్ లైబ్రరీ ఆఫ్ ఇండియాలో జీవనశ్రుతులు పుస్తకప్రతి
  16. డిజిటల్ లైబ్రరీ ఆఫ్ ఇండియాలో ఆటపాటలు పుస్తకప్రతి
  17. డిజిటల్ లైబ్రరీ ఆఫ్ ఇండియాలో అనంతసత్యాలు పుస్తకప్రతి
  18. డిజిటల్ లైబ్రరీ ఆఫ్ ఇండియాలో పంచబాణ సంచా పుస్తకప్రతి
  19. డిజిటల్ లైబ్రరీ ఆఫ్ ఇండియాలో పద్యాలపల్లకి పుస్తకప్రతి
  20. డిజిటల్ లైబ్రరీ ఆఫ్ ఇండియాలో నవగీతనాట్యం పుస్తకప్రతి
  21. డిజిటల్ లైబ్రరీ ఆఫ్ ఇండియాలో వ్యవధిలేదు పుస్తకప్రతి
  22. ఆర్కీవ్స్.ఆర్గ్ లో పైకెత్తాలి పుస్తకప్రతి
  23. డిజిటల్ లైబ్రరీ ఆఫ్ ఇండియాలో అక్షరానుభూతులు పుస్తకప్రతి
  24. డిజిటల్ లైబ్రరీ ఆఫ్ ఇండియాలో ప్రకృతిలో ఓ పవిత్రత పుస్తకప్రతి
  25. నమస్తే తెలంగాణ (22 July 2016). "కవి బాపురెడ్డికి దాశరథి సాహిత్య పురస్కారం ప్రదానం". Archived from the original on 27 July 2018. Retrieved 27 July 2018. {{cite news}}: |archive-date= / |archive-url= timestamp mismatch; 26 జూలై 2018 suggested (help)