వింజమూరి అనసూయ
| వింజమూరి అనసూయా దేవి | |
|---|---|
వింజమూరి అనసూయా దేవి
|
|
| పూర్వరంగ సమాచారం | |
| ఇతర పేర్లు | అవసరాల అనసూయా దేవి |
| జననం | మే 12 1920 (వయసు 93) |
| సంగీత రీతి | జానపద సంగీతము, లలిత సంగీతము |
| వృత్తి | గాయని |
| క్రియాశీలక సంవత్సరాలు | 1929-ఇప్పటి వరకు |
| సభ్యులు | |
| వింజమూరి సీత | |
డా|| అవసరాల (వింజమూరి) అనసూయా దేవి ఒక ప్రముఖ జానపద కళాకారిణి, సంగీత దర్శకురాలు, రచయిత. హార్మోనియం వాయించటంలో దిట్ట. కళా ప్రపూర్ణ బిరుదాంకితురాలు. ఎనిమిదేళ్ళ వయసులోనే ఆమె పాట రికార్డ్ అయింది. ఆమె ఒక బాలమేధావి.
విషయ సూచిక |
బాల్యం [మార్చు]
ఈమె మే 12, 1920 న ఒక సంగీత కళాకారుల, సాహిత్యకారుల కుటుంబంలో జన్మించింది. కర్ణాటక సంగీతం మునుగంటి వెంకట్రావు దగ్గర నేర్చుకున్నది. ఆమె తండ్రి వింజమూరి వెంకట లక్ష్మీ నరసింహారావు ఒక కవి. తల్లి వింజమూరి వెంకటరత్నమ్మ 1914లో అనసూయ అనే పత్రికకు సంపాదకత్వం వహించేది.
విశేషాలు [మార్చు]
స్వాతంత్ర్యోద్యమంలో మహామహులైన గాంధీజీ, సుభాష్ చంద్రబోస్, జవహర్‌లాల్ నెహ్రూ, సర్వేపల్లి రాధాక్రిష్ణన్ లాంటి వారి సమక్షంలో పాడిన అనుభవం ఆమెకుంది.
పుస్తకాలు [మార్చు]
ఆమె రాసిన భావ గీతాలు, జానపద గేయాలు అనే రెండు పుస్తకాలను ఆమెకు 90 సంవత్సరాలు నిండిన సందర్భంగా చెన్నై లో ఏప్రిల్ 12, 2008 లో జరిగిన ఒక కార్యక్రమం లో విడుదల చేశారు. వీటితో బాటు ఆమె దాదాపు ఏడు పుస్తకాలను జానపద సంగీతం మీద ఏడు పుస్తకాలను విడుదల చేశారు.
పురస్కారాలు [మార్చు]
1977లో ఆమెకు ఆంధ్రా విశ్వవిద్యాలయం 'కళా ప్రపూర్ణ' అనే బిరుదునిచ్చి గౌరవ డాక్టరేట్ ఇచ్చి సన్మానించింది. ఇంకా అమెరికాలో జీవిత సాఫల్య పురస్కారాన్ని కూడా అందుకుంది. ప్యారిస్ లోనూ ఈమెకు క్వీన్ ఆఫ్ ఫోక్ అనే బిరుదును ప్రధానం చేశారు.