దోమ

వికీపీడియా నుండి

దోమ
భద్రంగా ఉన్నది
Anopheles gambiae
Anopheles gambiae
శాస్త్రీయ వర్గీకరణ
సామ్రాజ్యము: ఏనిమేలియా
Phylum: ఆర్థ్రోపోడా
తరగతి: ఇన్సెక్టా
వర్గము: డిప్టెరా
ఉపవర్గము: Nematocera
Infraorder: Culicomorpha
కుటుంబము: కులిసిడే
Diversity
41 ప్రజాతులు
ప్రజాతి
See text.

దోమ (ఆంగ్లం: Mosquito) రక్తాన్ని పీల్చి చాలా వ్యాధులకు కారణమైన కీటకము. దోమలు ప్రపంచ వ్యాప్తంగా ఉష్ణ మండల దేశాలలో అధికంగా ఉన్నాయి. వీటిలో ముఖ్యంగా మూడు రకాల దోమలు వ్యాధులకు వాహకాలుగా పనిచేస్తాయి. అవి కులిసిడే కుటుంబానికి చెందిన క్యూలెక్స్, అనాఫిలస్, ఈడిస్ దోమలు. వీటి దేహంలో తల, వక్షం, ఉదరం అనే మూడు భాగాలుంటాయి. మధ్యవక్షానికి ఒక జత రెక్కలు ఉంటాయి. అంత్యవక్షానికి చెందిన రెక్కలు 'హాల్టర్లు' గా ఉండి శరీర సమతాస్థితికి పనిచేస్త్రాయి. ఆడ దోమలలో గుచ్చి పీల్చేరకమైన ముఖభాగలుంటాయి. ఇవి మానవులమీద అంతరాయక బాహ్య పరాన్న జీవులుగా బ్రతుకుతాయి. మగ దోమలు మొక్క స్రావాల మీద బ్రతుకుతాయి.

[మార్చు] జీవిత చక్రం

ఈగ మాదిరిగా దోమలు కూడా హాలోమెటాబోలిక్ కీటకాలు. నిశ్చలంగా ఉండే నీళ్ళలో గుడ్లను పెడతాయి. గుడ్లు పొదిగి డింభకాలు వస్తాయి. ఇవి నీటిలో ఉండే సేంద్రియ పదార్ధాలను తింటాయి. ఇవి రూపవిక్రియ జరుపుకొని ప్యూపాలుగా ఏర్పడతాయి. డింభకాలు శ్వాస గొట్టాలతోను, ప్యూపాలు అంకుశ నాళాలు, తుత్తారలతోను గాలిని పూల్చుకొంటాయి.

[మార్చు] వ్యాధులు

"http://te.wikipedia.org/wiki/%E0%B0%A6%E0%B1%8B%E0%B0%AE" నుండి వెలికితీశారు
పేజీకి సంభందించిన లింకులు