ధనికొండ హనుమంతరావు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ధనికొండ హనుమంతరావు
ధనికొండ హనుమంతరావు
జననంధనికొండ హనుమంతరావు
1919
India ఇంటూరు గ్రామం,అమృతలూరు మండలం, గుంటూరు జిల్లా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం
మరణండిసెంబర్ 21, 1989
మద్రాసు
ప్రసిద్ధిరచయిత, ప్రచురణకర్త, పత్రికా సంపాదకుడు
మతంహిందూ

ధనికొండ హనుమంతరావు తెలుగులో లబ్ధ ప్రతిష్ఠుడైన రచయిత. ఇతడు క్రాంతి పబ్లికేషన్స్, క్రాంతి ప్రెస్సులను స్థాపించాడు. రేరాణి పత్రికకు సంపాదకుడిగా పనిచేశాడు. ఇంద్రజిత్ అనే కలం పేరుతో కూడా రచనలు చేశాడు.[1] ఇతడు గుంటూరు జిల్లా, ఇంటూరులో 1919వ సంవత్సరంలో జన్మించాడు. బి.ఎ. చదువు మధ్యలోనే ఆపివేసి రచనలపై దృష్టి కేంద్రీకరించాడు.[2]

రచనలు[మార్చు]

ఇతని రచనలు యువ, అభిసారిక, పుస్తకం, జ్యోతి, సుభాషిణి, వాణి, ఆహ్వానం, ఆంధ్రజ్యోతి, ప్రజాబంధు, భారతి, చిత్రగుప్త, నీలిమ, ఆంధ్రప్రభ, కథాంజలి, ఆనందవాణి, పత్రిక తదితర పత్రికలలో ప్రచురింపబడ్డాయి.

పత్రికలు[మార్చు]

జ్యోతి మాస పత్రిక, చిత్రసీమ, అభిసారిక పత్రిక వ్యవస్థాపకుడు, ముద్రాపకుడు ధనికొండ హనుమంతరావు. తన స్వంత క్రాంతి ప్రెస్స్ వ్యవహారాలతో తీరిక దొరకనందున, జ్యోతి మాసపత్రికని వేమూరి రాఘవయ్యకి, అభిసారికని రాంషాకి (సామర్లకోట), చిత్రసీమని కొలను బ్రహ్మానందరావుకి ధనికొండ ఇచ్చేసాడు. జ్యోతిని రాఘవయ్య నడిపినా కొంత కాలం ధనికొండ పేరే సంపాదకుడిగా ప్రచురించాడు.

నవలలు, నవలికలు[మార్చు]

  1. లోకచరిత్ర
  2. గుడ్డివాడు[3]
  3. మగువమనసు[4]
  4. ఏకాకి
  5. ఇలవేలుపు
  6. దూతికావిజయం
  7. జ్ఞాని[5]
  8. తీర్పు[6]
  9. జగదేకసుందరి
  10. క్లియోపాట్రా

కథాసంపుటాలు[మార్చు]

  1. పరిశోధన
  2. గర్వభంగం
  3. ప్రియురాలు
  4. కాముకి
  5. సంజీవి
  6. కుక్కతోక
  7. బుద్ధిశాలి[7]
  8. ప్రణయాన్వేషి
  9. అనాథ
  10. చక్రి[8]
  11. అపనింద
  12. గళ్లరుమాలు
  13. పన్నాగం
  14. వృత్తిధర్మం
  15. నా కొడుకు (పెద్దకథ) [9]

నాటికలు, నాటకాలు[మార్చు]

  1. ఎర్రబుట్టలు
  2. ఉల్టా సీదా
  3. ప్రొఫెసర్ బిండ్సన్
  4. చికిత్స
  5. జ్ఞాని
  6. మధురకళ్యాణం

మరణం[మార్చు]

ఇతడు తన 71వ యేట డిసెంబరు 21, 1989న మద్రాసులో మరణించాడు.[2]

మూలాలు[మార్చు]

  1. "కథానిలయం - View Writer". kathanilayam.com. Retrieved 2023-03-20.
  2. 2.0 2.1 "కథల కొండ ధనికొండ". ఆంధ్ర సచిత్రవారపత్రిక. 82 (22): 72. 19 January 1990.
  3. ధనికొండ, హనుమంతరావు (1955). గుడ్డివాడు (1 ed.). మద్రాసు: జ్యోతి కార్యాలయం.
  4. ధనికొండ, హనుమంతరావు (1967). మగువ మనసు (4 ed.). మద్రాసు: శ్రీ పబ్లికేషన్స్.
  5. ధనికొండ, హనుమంతరావు (1953). జ్ఞాని. రాజమండ్రి: కొండపల్లి వీరవెంకయ్య & సన్స్.
  6. ధనికొండ, హనుమంతరావు (1957). తీర్పు (4 ed.). మద్రాసు: జ్యోతి కార్యాలయం.
  7. ధనికొండ, హనుమంతరావు (1947). బుద్ధిశాలి. తెనాలి: సుందరరామ్‌ & సన్స్.
  8. ధనికొండ, హనుమంతరావు (1954). చక్రి. రాజమండ్రి: కొండపల్లి ప్రచురణలు.
  9. ధనికొండ, హనుమంతరావు (1942). నా కొడుకు (2 ed.). తెనాలి: యువ కార్యాలయం.