నకిరేకల్
| ?నకిరేకల్ మండలం నల్గొండ • ఆంధ్ర ప్రదేశ్ |
|
|
|
|
|
|
|
| అక్షాంశరేఖాంశాలు: | |
| కాలాంశం | భాప్రాకా (గ్రీ.కా+5:30) |
| ముఖ్య పట్టణము | నకిరేకల్ |
| జిల్లా(లు) | నల్గొండ |
| గ్రామాలు | 16 |
| జనాభా • మగ • ఆడ • అక్షరాస్యత శాతం • మగ • ఆడ |
55,030 (2001) • 27893 • 27137 • 65.40 • 76.55 • 53.95 |
నకిరేకల్ (Nakirekal), ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని నల్గొండ జిల్లాకు చెందిన ఒక పట్టణము మరియు అదే పేరుగల మండలమునకు కేంద్రము. ఇది తొమ్మిదొ నంబరు జాతీయ రహదారి మీద హైదరాబాద్ నుండి 110 కి.మీ.ల దూరంలో వున్నది. నల్గొండ నుండి 20 కి. మీ.ల దూరంలో వున్నది. చుట్టు ప్రక్కల గ్రామాలకు ఇది విద్యా కేంద్రంగా ఉన్నది. ఇంకా వినియోగదారులకు అవుసరమైన వ్యవసాయ సామగ్రి, పంపుసెట్లు, నిత్యావసర సరుకులు వంటివాటికి ఇది వ్యాపారకేంద్రం. నకిరేకల్ సాయిసేవాశ్రమ సంస్థానం ట్రస్ట్ వారిచే ఒక సాయిబాబా మందిరం నిర్మింపబడింది. నకిరేకల్‌లో ఒక ఇండోర్ స్టేడియం ఉంది.
సూర్యాపేట, నార్కెట్‌పల్లి, నల్గొండ, మిరియాలగూడ లు నకిరేకల్లుకు దగ్గఱలో ఉన్న ఇతర పట్టణాలు.
విషయ సూచిక |
చరిత్ర[మార్చు]
నియోలితిక్ కాలానికి చెందిన వడిసెల రాళ్ళు, ఇతర వస్తువులు "చోట యెలుపు" అనే చోట బయటపడినాయి. మెగాలితిక్ కాలానికి చెందిన సమాధి స్థలాలు, ఇతర వస్తువులు తిప్పర్తి, నకిరెకల్లు, నల్గొండల వద్ద బయటపడినాయి.
వసంతరాయని క్రీడాభిరామము అనే గ్రంధంలో రచయిత ఈ వూరిని "నాగరికల్లు" అని ప్రస్తావించాడు.
రవాణా[మార్చు]
ఈ పట్టణంలో ఎ.పి.ఎస్.ఆర్.టి.సి. బస్ స్టేషన్ ఉంది. జాతీయరహదారి కనుక ఇతర ప్రాంతాలకు బస్సు ప్రయాణమే ముఖ్యసాధనం. వూరి లోపల ప్రయాణాలకు మోటారు సైకిళ్ళు, ఆటోలు వాడుతుంటారు. సైకిళ్ళ వినియోగం తగ్గుముఖం పట్టింది.
రాజకీయాలు[మార్చు]
చాలా కాలంగా ఈ ప్రాంతంలో కమ్యూనిస్టు పార్టీలకు మంచి బలం ఉంది. భారతీయ కమ్యూనిస్టు పార్టీ అభ్యర్ధులు ఇక్కడ అనేకమార్లు విజయం సాధించారు. తెలంగాణా సాయుధ పోరాటం సమయంలో ఉద్యమాలలో పాల్గొన్న నంద్యాల శ్రీనివాసరెడ్డి వంటి నాయకుల కారణంగా ఇక్కడ కమ్యూనిస్టు పార్టీకి బలమైన పునాదులు ఉన్నాయి. షుమారు 30 సంవత్సరాల కాలం కమ్యూనిస్టి పార్టీ తరపున నర్రా రాఘవరెడ్డి శాసనసభ ప్రతినిధిగా ఎన్నికయ్యాడు. 1972లో భారత జాతీయ కాంగ్రెస్ కు చెందిన మూసపాటి కమలమ్మ, 2009లో టి. లింగయ్య ఎన్నికయ్యారు. 2009 ఎన్నికలనాటికి ఈ నియోజకవర్గంలో వోట్ల సంఖ్య 2,21,453. ప్రస్తుతం ఇది ఎస్.సి.లకు రిజర్వు చేయబడిన నియోజకవర్గంగా ఉంది.
విద్య[మార్చు]
నకిరేకల్లులో అనేక పాఠశాలలు, కాలేజీలు ఉన్నాయి. వాసవి, ఎ.వి.ఎమ్., అరుణోదయ, మల్లికార్జున వంటి పేరు పొందిన విద్యాసంస్థలు. ఇంగ్లీషు మీడియం స్కూళ్ళలో సెయింట్ యాన్స్ స్కూలు ప్రసిద్ధం. ఇటీవల కాకతీయ విశ్వవిద్యాలయం అధ్వర్యంలో ఎ.వి.ఎమ్. కాలేజి దూరవిద్యాసదుపాయాలను నెలకొలిపింది.
విశేషాలు[మార్చు]
ఎవరెస్టు శిఖరం అధిరోహించిన మొదటి తెలుగువాడు శేఖర్ బాబు ఈ మండలానికి చెందినవాడు. ఇక్కడి సాయిబాబా గుడి ఆంధ్రప్రధేశ్‌లోనే రెండవ అతి పెద్దది.లిమిటేషన్ తరువాత రాష్ట్రంలో ఇది అతిపెద్ద నియోజకవర్గం. జిల్లాలో ఇది అతిపెద్ద ప్రత్తిమార్కెట్. ఇక్కడినుండి అడులూరు సరస్వతీ మందిరం 14 కి.మీ. దూరం. రాణి రుద్రమదేవి మండల పరిధిలోని చందుపట్ల గ్రామంలో ప్రాణాలు విడిచింది. గుర్తు గా సమాధి నెలకొల్పడం జరిగింది.మూసీ ప్రాజెక్టు కూడా 14 కి.మీ. దూరంలో ఉంది.మూసీ ప్రాజెక్టు కేతేపల్లి మండల పరిధిలో ఉంది.
మండలంలోని గ్రామాలు[మార్చు]
- ఒగోడు
- వల్లభాపూర్
- పాలెం
- నోముల
- కడపర్తి
- అడవిబొల్లారం
- చందంపల్లి
- నెల్లిబండ
- నకిరేకల్
- తాటికల్
- తెట్టెకుంట
- మంగలిపల్లి
- చందుపట్ల
- మర్రూర్
- గొరెంకల్‌పల్లి
- మండలపూర్
- కందిమళ్ళ వారి గూడెం
ఇవి కూడా చూడండి[మార్చు]
నల్గొండ జిల్లా మండలాలు
బొమ్మలరామారం - తుర్కపల్లి - రాజాపేట - యాదగిరి గుట్ట - ఆలేరు - గుండాల - తిరుమలగిరి - తుంగతుర్తి - నూతనకల్లు - ఆత్మకూరు(S) - జాజిరెడ్డిగూడెం - శాలిగౌరారం - మోతుకూరు - ఆత్మకూరు(M) - వలిగొండ - భువనగిరి - బీబీనగర్ - పోచంపల్లి - చౌటుప్పల్ - రామన్నపేట - చిట్యాల - నార్కెట్‌పల్లి - కట్టంగూర్ - నకిరేకల్ - కేతేపల్లి - సూర్యాపేట - చేవేముల - మోతే - నడిగూడెం - మునగాల - పెన్‌పహాడ్ - వేములపల్లి - తిప్పర్తి - నల్గొండ - మునుగోడు - నారాయణపూర్ - మర్రిగూడ - చండూరు - కంగల్ - నిడమానూరు - త్రిపురారం - మిర్యాలగూడ - గరిడేపల్లి - చిలుకూరు - కోదాడ - మేళ్లచెరువు - హుజూర్‌నగర్ - మట్టంపల్లి - నేరేడుచర్ల - దామరచర్ల - అనుముల - పెద్దవూర - పెద్దఅడిసేర్లపల్లి - గుర్రమ్‌పోడ్ - నాంపల్లి - చింతపల్లి - దేవరకొండ - గుండ్లపల్లి - చందంపేట
|
|
|
|---|---|
| ఒగోడు · వల్లభాపూర్ · పాలెం · నోముల · కడపర్తి · అడవిబొల్లారం · చందంపల్లి · నెల్లిబండ · నకిరేకల్ · తాటికల్ · తెట్టెకుంట · మంగలిపల్లి · చందుపట్ల · మర్రూర్ · గొరెంకల్‌పల్లి · మండలపూర్ · కందిమళ్ళ వారి గూడెం |
బొద్దు పాఠ్యం