నరసింహ నాయుడు
వికీపీడియా నుండి
| నరసింహ నాయుడు (2001) | |
| దర్శకత్వం | బి. గోపాల్ |
|---|---|
| నిర్మాణం | ఎమ్.వి. మురళీకృష్ణ |
| రచన | పరుచూరి బ్రదర్స్ |
| తారాగణం | నందమూరి బాలకృష్ణ సిమ్రాన్ , ప్రీతి జింగ్యాని ముకేష్ రిషి జయప్రకాశ్ రెడ్డి |
| సంగీతం | మణిశర్మ |
| ఛాయాగ్రహణం | వి.ఎస్.ఆర్. స్వామి |
| విడుదల తేదీ | 11, జనవరి 2001 |
| భాష | తెలుగు |
బి.గోపాల్ దర్శకత్వం లో వచ్చిన ఈ చిత్రం 72 సంవత్సరాల తెలుగు సినీ చరిత్ర లో తొలిసారిగా 105 కేంద్రాలలో శతదినోత్సవం జరుపుకుని రికార్డు సృష్టించింది. ఈ చిత్రం విజయవంతమవడం తో తెలుగు కథానాయకులందరూ ఫ్యాక్షన్ బాట పట్టారు. దగ్గర దగ్గర ఐదు సంవత్సరాలు ఫ్యాక్షన్ చిత్రాలు తెరను ముంచెత్తాయి.
ఈ చిత్రం తెలుగు సినీ చరిత్ర లో ఒక సరికొత్త ట్రెండ్ కు శ్రీకారం చుట్టింది.
పాటలు [మార్చు]
- కో కో కోమలి : ఉదిత్ నారాయణ్, హరిణి
- లక్స్ పాపా లక్స్ పాపా లంచికొస్తావా : ఎస్.పి.బాలు, హరిణి
- నాదిర దిన్నా నాదిర దిన్నా నడుమే నాజూకు : సుఖ్విందర్ సింగ్, స్వర్ణలత
- అబ్బా అబ్బా ఆనందం : శంకర్ మహదేవన్, సుజాతమోహన్
- చిలకపచ్చ కోక : మనో, రాధిక
- నిన్నా కుట్టేసినది : హరిహరన్, కవితా కృష్ణమూర్తి