పద్మజా నాయుడు
పద్మజా నాయుడు (1900 - 1975) స్వాతంత్ర సమరయోధురాలు, కవయిత్రి. ఈమె ముత్యాల గోవిందరాజుల నాయుడు మరియు సరోజినీ దేవి ల కుమార్తె. ఈమె 1956 నుండి 1967 వరకు పశ్చిమ బెంగాల్ గవర్నరు గా పనిచేశారు. స్వాతంత్రోద్యమంలో చురుకుగా తల్లితో పాటు పనిచేసిన పద్మజ 21 యేళ్ల వయసులోనే హైదరాబాదులో భారత జాతీయ కాంగ్రేసు సహవ్యవస్థాపకురాలయ్యింది. 1942లో క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొని జైలుకు వెళ్ళింది.
స్వాతంత్ర్ర్యానంతరం పద్మజా నాయుడు పార్లమెంటుకు ఎన్నికైంది కానీ అనారోగ్యం వళ్ళ రాజీనామా చేసింది. ఆ తరువాత పశ్చిమ బెంగాల్ గవర్నరుగానూ, బంగ్లాదేశ్ శరణార్ధుల సహాయచర్యలప్పుడు భారత రెడ్ క్రాస్ సంస్థ యొక్క చైర్మన్ గాను పనిచేసింది. పద్మజా నాయుడుకు భారత్ సేవక్ సమాజ్, అఖిల భారత హస్తకళల బోర్డు మరియు నెహ్రూ స్మారక నిధి వంటి సంస్థలతో అనుబంధం ఉన్నది.
1961లో పద్మజ తన కవితా సంకలనం "ది ఫెదర్ ఆఫ్ డాన్" పేరుతో ప్రచురించింది.[1] 1975లో పద్మజా నాయుడు స్మృత్యర్ధం డార్జిలింగులోని జంతుప్రదర్శనశాలను పద్మజా నాయుడు హిమాలయ జంతుప్రదర్శనశాలగా అప్పటి ప్రధాన మంత్రి ఇందిరాగాంధీ ప్రారంభోత్సవం చేశారు.