పద్మారాణి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
పద్మారాణి
జననం(1937-01-25)1937 జనవరి 25
మరణం2016 జనవరి 25(2016-01-25) (వయసు 79)
వృత్తినటి
జీవిత భాగస్వామినామ్‌దార్ ఇరానీ
బంధువులుసరితా జోషి (సోదరి)

పద్మారాణి, (1937, జనవరి 25 - 2016, జనవరి 25) మహారాష్ట్ర రాష్ట్రానికి చెందిన నాటకరంగ, సినిమా నటి. గుజరాతీ నాటకాలు, గుజరాతీ సినిమాలు, హిందీ సినిమాలలో నటించింది.

జననం, విద్య[మార్చు]

పద్మారాణి 1937, జనవరి 25న మహారాష్ట్రలోని పూణే నగరంలో జన్మించింది. గుజరాత్‌ రాష్ట్రం, వడోదరలోని రాజ్‌మహల్ రోడ్‌లోని కనాబి వాడ్, ఉంచి పోల్‌లో పెరిగింది.[1] తండ్రి భీమ్‌రావ్ భోంస్లే ఒక బారిస్టర్, తల్లి కమలాబాయి రాణే గోవాకు చెందినవారు. తన ప్రాథమిక విద్యను వడోదరలోని దాండియా బజార్‌లోని గోవిందరావు సెంట్రల్ స్కూల్ నుండి పూర్తిచేసింది.[1]

నాటకరంగం[మార్చు]

తన కుటుంబం ఆర్థిక ఇబ్బందుల సమయంలో తన సోదరి (ప్రముఖ నటి సరితా జోషి) తో కలిసి నాటకరంగంలోకి అడుగుపెట్టింది.[2][3] తన సోదరితో కలిసి వడోదరలో రామన్‌లాల్ మూర్తివాలా నాటకంలో నటిస్తున్నప్పుడు అరుణా ఇరానీ తండ్రి ఫారెడూన్ ఇరానీ దృష్టిని ఆకర్షించగా వారిని ముంబై తీసుకెళ్ళాడు.

పద్మారాణి 6,000 పైగా గుజరాతీ నాటకాలలో నటించింది. వాటిల్లో బా రిటైర్ థాయ్ ఛే, బా ఈ మారి బౌండరీ, కేవదా నా దంఖ్, సప్తపది, చందర్వో, 5 స్టార్ ఆంటీ, వచన్ వంటి అనేక ప్రసిద్ధ నాటకాలు ఉన్నాయి. జీవితం చివరి దశలలో ఎక్కువగా తల్లి పాత్రలను పోషించింది. అమరి తో అర్జీ బాకీ తమరి మార్జీ చివరి నాటకం.[3][4] బా రిటైర్ థాయ్ ఛేతో సహా అనేక నాటకాలలో ప్రసిద్ధ గుజరాతీ నటుడు అరవింద్ రాథోడ్‌తో కలిసి పనిచేసింది.[5][6]

సినిమారంగం[మార్చు]

200కు పైగా గుజరాతీ సినిమాల్లో నటించింది.[7] 1961లో వచ్చిన నర్సయ్యని హుండీ అనే సినిమాలో తొలిసారిగా నటించింది. 1963లో ఆశా పరేఖ్‌తో కలిసి అఖండ సౌభాగ్యవతి సినిమాలో నటించింది. 1966లో గుజరాతీ రాయల్, కవి కలాపి జీవితం ఆధారంగా తీసిన కలాపి సినిమాలో నటించింది, ఇందులో ఆమె సంజీవ్ కుమార్ పోషించిన కలాపి యువరాణి భార్యగా నటించింది. ఉపేంద్ర త్రివేదితో కలిసి జనమ్‌టిప్ (1969), పాట్లీ పర్మార్ (1978), గంగాసతి (1979), లోహినీ సగాయి (1980), కసుంబి నో రంగ్, షామల్ షా నో వివాహ్, భగత్ పీపాజీ (1980) వంటి అనేక విజయవంతమైన గుజరాతీ చిత్రాలలో కూడా ఆమె నటించింది.[1][4][6][7]

ప్రధాన పాత్రలో నటించిన తొలి సినిమా కన్యాదాన్ (1968) తో సహా కొన్ని హిందీ చిత్రాలలో కూడా నటించింది. పరివార్ (1968), వీర్ ఘటోత్కచ్ (1970), జై సంతోషి మా (1975), దిల్ (1990), జాలిమ్ (1994) వంటి వాటిలో కూడా నటించింది.[2][3]

టివిరంగం[మార్చు]

బెంగాలీ నటుడు అనిల్ ఛటర్జీతో నటించిన నఖాబ్ అనే టీవీ సీరియల్ విమర్శకులు, వీక్షకులచే ప్రశంసించబడింది. ఇందులో ఛటర్జీకి నర్సుగా నటించింది. హిమేష్ రేష్మియా తీసిన సీరియల్ లోనూ, స్వప్న కినారేలోఅ 1000 కంటే ఎక్కువ ఎపిసోడ్‌లలో నటించింది.[6]

వ్యక్తిగత జీవితం[మార్చు]

పద్దెనిమిదేళ్ళ వయసులో పద్మారాణి జమీందార్, పార్సీ కుటుంబ సభ్యుడు, నాటక దర్శకుడైన అరుణా ఇరానీ మేనమామ నామ్‌దార్ ఇరానీని వివాహం చేసుకున్నది.[3] వారికి డైసీ ఇరానీ అనే కుమార్తె ఉంది. నటిగా రాణించిన డైసీ, వివాహం తర్వాత సింగపూర్‌లో స్థిరపడింది.[3]

మరణం[మార్చు]

పద్మారాణి వైరల్ ఇన్ఫెక్షన్ కారణంగా ఊపిరితిత్తులలో సమస్యలతో తన 79వ పుట్టినరోజున 2016, జనవరి 25న ముంబైలో మరణించింది.[2][3][4]

మూలాలు[మార్చు]

  1. 1.0 1.1 1.2 "જીવનની રમત પૂરી કરી 'બા રિટાયર્ડ થયા' પદ્મારાણીનો ઘરોબો વડોદરા સાથે હતો". Mumbai Samachar. Retrieved 2023-01-15.[permanent dead link]
  2. 2.0 2.1 2.2 Baker, Rachel (25 January 2016). "Veteran Gujarati actress Padmarani passes away". The Times of India. Retrieved 2023-01-15.
  3. 3.0 3.1 3.2 3.3 3.4 3.5 DeshGujarat (25 January 2016). "Noted Gujarati actress Padma Rani passes away". DeshGujarat. Retrieved 2023-01-15.
  4. 4.0 4.1 4.2 "ગુજરાતી ફિલ્મોના જાણીતા અભિનેત્રી પદ્મારાણીનું નિધન". NavGujarat Samay. 25 January 2016. Archived from the original on 16 ఫిబ్రవరి 2016. Retrieved 2023-01-15.
  5. Baker, Rachel (25 January 2016). "Veteran Gujarati actress Padmarani passes away". The Times of India. Retrieved 2023-01-15.
  6. 6.0 6.1 6.2 "૮૦મા જન્મદિવસે જ આખરી એક્ઝિટ લેતાં ગુજરાતી તખ્તાનાં 'બા' પદ્મારાણી". Sandesh Gujarati Newspaper. 2023-01-15. Retrieved 2023-01-15.
  7. 7.0 7.1 "લક્ષ્મી સ્ટુડિયો વેચાતા પદ્મારાણી ભાવુક બની ગયાં હતાં". Sandesh Gujarati Newspaper. 2023-01-15. Retrieved 2023-01-15.

బయటి లింకులు[మార్చు]