పాయల్ రాధాకృష్ణ

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
పాయల్ రాధాకృష్ణ
జననం (1996-08-13) 1996 ఆగస్టు 13 (వయసు 27)
జాతీయతభారతీయురాలు
వృత్తినటి, మోడల్
క్రియాశీల సంవత్సరాలు2016 - ప్రస్తుతం
తల్లిదండ్రులుచేతన, రాధాకృష్ణ

పాయల్ రాధాకృష్ణ (జననం 1996 ఆగస్టు 13) భారతీయ సినిమా నటి, మోడల్. ఆమె ప్రధానంగా కన్నడ సినిమాలతో పాటు తమిళం, తెలుగు చలనచిత్రరంగంలోనూ మంచి నటిగా పేరుతెచ్చుకుంది. పి.ఎన్ దర్శకత్వం వహించిన 2017 కన్నడ చిత్రం బెంగళూరు అండర్‌వరల్డ్‌తో ఆమె అరంగేట్రం చేసింది. సత్య. ఆదర్శ్ ఈశ్వరప్ప సంయుక్తంగా దర్శకత్వం వహించిన భిన్నా (2019) లో తన నటనతో విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ఆ సినిమా మాడ్రిడ్ ఫిల్మ్ ఫెస్టివల్ లో ఉత్తమ ప్రాంతీయ చిత్రంగానే కాకుండా ప్రతిష్ఠాత్మక దాదా సాహెబ్ ఫాల్కే అవార్డుతో సహా అనేక అవార్డులను గెలుచుకుంది.

ఆమె నటించిన తరగతి గది దాటి (2021వెబ్‌సిరీస్‌) ఆహా ఓటీటీలో విడుదలై ప్రజాదరణ పొందింది.[1][2]

బాల్యం, విద్యాభ్యాసం[మార్చు]

ఆమె చేతన, రాధాకృష్ణ దంపతులకు 1996 ఆగస్టు 13న మంగళూరులో జన్మించింది. మైసూరులోని లయన్స్ వెస్ట్ పబ్లిక్ స్కూల్, విద్యాశ్రమ కళాశాలల్లోనూ చుదువుకుంది. ఆ తరువాత, తను చేరిన ప్రసాద్ బిడప్ప మోడల్ మేనేజ్‌మెంట్ లో, ఆమె ది మెగా మోడల్ హంట్ లో ఫైనలిస్ట్‌గా ఎంపికయింది. తన తల్లి వద్ద శిక్షణ పొందిన ఆమె కర్ణాటక స్టేట్ బోర్డు ద్వారా భరతనాట్యంలో కోర్సు కూడా పూర్తిచేసింది.

కెరీర్[మార్చు]

ఆ తరువాత ముంబైలో ఆమె ఫ్రీలాన్సర్‌గా కొంత కాలం పనిచేసింది. అమెజాన్ ఇండియా, సఫోలా, రెక్సోనా.. ఇలా ఎన్నో పేరెన్నికగల బ్రాండ్‌ల వాణిజ్య ప్రకటనలలో ఆమె నటించింది. 2021లో, ఆమె జీ5 వెబ్‌సిరీస్‌ సింగపెన్నెతో తమిళంలోకి అడుగుపెట్టింది. ఇది ప్రేక్షకుల నుండి సానుకూల సమీక్షలను అందుకుంది. దినేష్ తేజ్, హెబ్బా పటేల్లతో కలసి ఆమె నటించిన అలా నిన్ను చేరి (2023) సినిమా థియేటర్లలో విడుదలై, అలాగే అమెజాన్ ప్రైమ్‌ ఓటీటీలోనూ స్ట్రీమింగ్ అయి మంచి స్పందనను రాబట్టుకుంది.[3]

మూలాలు[మార్చు]

  1. Sakshi (16 August 2021). "'తరగతి గది దాటి'..ఇప్పుడు 'ఆహా'లో". Archived from the original on 16 ఆగస్టు 2021. Retrieved 16 August 2021.
  2. TV9 Telugu (17 August 2021). "Tharagathi Gadhi Daati: ఆహాలో సరికొత్త వినోదం.. తరగతి గది దాటి స్ట్రీమింగ్ ఎప్పుడంటే." Archived from the original on 17 ఆగస్టు 2021. Retrieved 17 August 2021.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)
  3. "Ala Ninnu Cheri: అమెజాన్‌ ప్రైమ్ ఓటీటీలోకి 'అలా' వచ్చేసింది | Ala Ninnu Cheri Streaming Started in Amazon Prime Video KBK". web.archive.org. 2023-12-24. Archived from the original on 2023-12-24. Retrieved 2023-12-24.{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link)