పాల‌క్ ల‌ల్వాని

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
పాల‌క్ ల‌ల్వాని
పాల‌క్ ల‌ల్వాని
జననం1 జనవరి, 1998
జాతీయతభారతీయురాలు
వృత్తినటి
క్రియాశీల సంవత్సరాలు2016 - ప్రస్తుతం
ఎత్తు5 ft 6 in (168 cm)
తల్లిదండ్రులుజితెన్ అల్వాని
దీపిక లల్వాని

పాల‌క్ ల‌ల్వాని తెలుగు, తమిళ చలనచిత్ర నటి. 2016లో అబ్బాయితో అమ్మాయి సినిమాతో సినీరంగంలోకి అడుగుపెట్టింది.[1]

జీవిత విషయాలు[మార్చు]

సాలక్ లల్వాని 1998, జనవరి 1న జితెన్, దీపిక దంపతులకు ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలోని అలహాబాదులో జన్మించింది. జితెన్ లల్వాని హిందీ టివి నటుడు.[2]

సినిమారంగం[మార్చు]

తెలుగులో నాగశౌర్య హీరోగా వచ్చిన అబ్బాయితో అమ్మాయి సినిమా పాల‌క్ ల‌ల్వాని తొలి సినిమా.[3] 2028లో కమల్ చంద్ర దర్శకత్వంలో రవి శంకర్ సంగీతంలో రహత్ ఫతేహ్ ఆలీ ఖాన్ తో దిల్ జఫ్రాన్ అనే వీడియోలో నటించింది.[4] 2018లో జువ్వ సినిమాలో నటించింది. ఈ సినిమాలో పాల‌క్ ల‌ల్వాని గ్లామర్ గా, చిలిపి అమ్మాయి పాత్రలో చాలా బాగా నటించిందని తెలంగాణ టుడే రివ్యూలో రాసింది.[5]

2019లో క్రేజీ క్రేజీ ఫీలింగ్ సినిమాలో నటించింది.[6][7] 2019లో బాబా భాస్కర్ దర్శకత్వంలో వచ్చిన కుప్పతు రాజా చిత్రంతో తమిళ సినిమారంగంలోకి అడుగుపెట్టింది. ఈ చిత్రంలో లాల్వాని మద్రాస్ అమ్మాయిగా నటించింది.[8][9] అదే సంవత్సరం వైభవ్‌తో కలిసి సిక్సర్‌ సినిమాలో జర్నలిస్టుగా నటించింది.[6][8][10] అరుణ్ విజయ్ తో సినమ్, ఆది పినిశెట్టి, హన్సికతో పార్ట్‌నర్ సినిమాల్లో నటించింది.[11][12]

నటించిన చిత్రాలు[మార్చు]

సంవత్సరం చిత్రం పేరు పాత్రపేరు భాష మూలాలు
2016 అబ్బాయితో అమ్మాయి ప్రార్థన తెలుగు
2018 జువ్వ శృతి తెలుగు
2019 క్రేజీ క్రేజీ ఫీలింగ్ స్పందన తెలుగు
2019 కుప్పతు రాజా కమల తమిళం [13]
2019 సిక్సర్ కార్తీక తమిళం
2020 సినమ్ TBA తమిళం [14]
2020 పార్ట్‌నర్ TBA తమిళం
2023 భగవంత్ కేసరి రిపోర్టర్ తెలుగు

మూలాలు[మార్చు]

  1. "New actress in GV Prakash's next". The New Indian Express. Retrieved 2020-07-27.
  2. "जितेन लालवानी 'पहरेदार पिया की' के लिए राजस्थान में कर रहे हैं शूटिंग". khas khabar (in హిందీ). 2017-07-07. Retrieved 2020-07-27.
  3. "'Abbayitho Ammayi' will be my perfect bday gift: Palak Lalwani". Indian Express. 29 December 2015.
  4. "'Dil Zaffran' sung by Rahat Fateh Ali Khan is going to put you in a romantic mood". www.radioandmusic.com (in ఇంగ్లీష్). Retrieved 2020-07-27.
  5. Tanmayi, Bhawana. "Movie Review: This 'Juvva' doesn't sparkle". Telangana Today.
  6. 6.0 6.1 "I'm a big fan of Mahesh Babu: Palak Lalwani". Deccan Chronicle. 20 February 2018.
  7. "'Crazy Crazy Feeling': Ahead of its release, a brief journey with the team - Times of India". The Times of India.
  8. 8.0 8.1 M Suganth (22 March 2019). "To be working with Hansika is a very big thing for me: Pallak Lalwani". Times of India.
  9. "Kuppathu Raja movie review: A tedious watch that wastes GV Prakash's potential- Entertainment News, Firstpost". Firstpost (in ఇంగ్లీష్). 2019-04-06. Retrieved 2020-07-28.
  10. S, Srivatsan (2019-08-30). "'Sixer' movie review: Eyes wide shut". The Hindu (in Indian English). ISSN 0971-751X. Retrieved 2020-07-28.
  11. Subramanian, Anupama (13 September 2019). "Palak to romance Arun Vijay". Deccan Chronicle.
  12. "Hansika Motwani and Aadhi Pinisetty team up for a sci-fi comedy". The Indian Express (in అమెరికన్ ఇంగ్లీష్). 2019-03-25. Retrieved 2020-07-28.
  13. "I don't have a 'blink-and-miss' role in Kuppathu Raja: Pallak Lalwani". Times of India. 30 March 2019.
  14. V Lakshmi (13 September 2019). "Pallak Lalwani in GNR's #AV30". Times of India.

ఇతర లంకెలు[మార్చు]