పోలకంపాడు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
పోలకంపాడు
—  రెవెన్యూయేతర గ్రామం  —
రాష్ట్రం ఆంధ్రప్రదేశ్
జిల్లా గుంటూరు
మండలం
ప్రభుత్వం
 - సర్పంచి
పిన్ కోడ్
ఎస్.టి.డి కోడ్

పోలకంపాడు, గుంటూరు జిల్లా, తాడేపల్లి మండలానికి చెందిన రెవెన్యూయేతర గ్రామం.

గ్రామ చరిత్ర[మార్చు]

సీఆర్‌డీఏ పరిధిలోకి వస్తున్న మండలాలు, గ్రామాలను ప్రభుత్వం విడిగా గుర్తిస్తూ ఉత్తర్వులు జారీచేసింది. ప్రస్తుతం గుర్తించిన వాటిలోని చాలా గ్రామాలు వీజీటీఎం పరిధిలో ఉన్నాయి. గతంలో వీజీటీఎం పరిధిలో ఉన్న వాటితోపాటుగా ఇప్పుడు మరిన్ని కొన్ని గ్రామాలు చేరాయి. సీఆర్‌డీఏ పరిధిలోకి వచ్చే గుంటూరు, కృష్ణా జిల్లాల్లోని మండలాలు, గ్రామాలను గుర్తిస్తూ పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి ఉత్తర్వులు జారీ చేశారు.[1]

గుంటూరు జిల్లా పరిధిలోని మండలాలు[మార్చు]

తాడేపల్లి, మంగళగిరి, తుళ్లూరు, దుగ్గిరాల, తెనాలి, తాడికొండ, గుంటూరు మండలం, చేబ్రోలు, మేడికొండూరు, పెదకాకాని, వట్టిచెరుకూరు, అమరావతి, కొల్లిపర, వేమూరు, కొల్లూరు, అమృతలూరు, చుండూరు మండలాలతో పాటు ఆయా మండలాల పట్టణ ప్రాంతం కూడా సీఆర్‌డీఏ పరిధిలోకి వస్తుంది. గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం తాడేపల్లి పంచాయతీకి శివారు గ్రామం పోలకంపాడు. పూర్వం ప్రకాశం బ్యారేజి మీదుగా రోడ్డు రవాణా జరిగే రోజుల్లో ఈ గ్రామం తాడేపల్లి తల తన్నేలా ఉండవల్లి సెంటర్ పేరుతో ఓ వెలుగు వెలిగింది. గొప్పగా వుండేది. కొత్తగా సౌకర్యాలేమీ ఒనగూడలేదు కానీ, ప్రస్తుతం సిటీబస్సులు కూడా లేక వెలవెలబోతోంది.

దర్శనీయ ప్రదేశాలు/దేవాలయాలు[మార్చు]

శ్రీ పోలకమ్మ అమ్మవారి ఆలయం[మార్చు]

2008, ఫిబ్రవరి 28న ఈ ఆలయాన్ని పునరుద్ధరణ చేశారు.

శ్రీ గంగా బాల త్రిపుర సుందరీ సమేత రామలింగేశ్వరస్వామివారి ఆలయం[మార్చు]

ఈ ఆలయం విజయవాడలోని శ్రీ దుర్గామల్లేశ్వరస్వామివారి ఆలయానికి దత్త దేవాలయం. ఈ ఆలయంలో ప్రతి సంవత్సరం ఫాల్గుణ మాసం (మార్చి) లో పౌర్ణమికి వార్షిక బ్రహ్మోత్సవాలు, నాలుగు రోజులపాటు వైభవంగా నిర్వహించెదరు.

  • ఈ ఆలయానికి 6.57 ఎకరాల మాన్యం భూమి ఉంది.
  • 2020, నవంబరు-26న, పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన దాత శ్రీ కుర్రెల నాగ చంద్రమోహన్, ఈ ఆలయానికి, 75 వేల విలువైన ఒక వెండి మకర తోరణాన్ని విరాళంగా సమర్పించారు.<ref>ఈనాడు విజయవాడ;2020, నవంబరు-27,2వపేజీ.

మూలాలు[మార్చు]

  1. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2016-08-18. Retrieved 2016-08-18.