ఫైసల్ ఇక్బాల్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ఫైసల్ ఇక్బాల్
వ్యక్తిగత సమాచారం
పుట్టిన తేదీ30 December 1981 (1981-12-30) (age 42)
కరాచీ, సింధ్, పాకిస్తాన్
బ్యాటింగుకుడిచేతి వాటం
బౌలింగుకుడిచేతి ఆఫ్ స్పిన్
బంధువులుజావేద్ మియాందాద్ (మామ)[1]
అంతర్జాతీయ జట్టు సమాచారం
జాతీయ జట్టు
తొలి టెస్టు (క్యాప్ 164)2001 మార్చి 8 - న్యూజీలాండ్ తో
చివరి టెస్టు2010 జనవరి 3 - ఆస్ట్రేలియా తో
తొలి వన్‌డే (క్యాప్ 132)2000 ఫిబ్రవరి 19 - శ్రీలంక తో
చివరి వన్‌డే2006 డిసెంబరు 13 - వెస్టిండీస్ తో
కెరీర్ గణాంకాలు
పోటీ టెస్టులు వన్‌డేలు
మ్యాచ్‌లు 26 18
చేసిన పరుగులు 1,124 314
బ్యాటింగు సగటు 26.76 22.42
100లు/50లు 1/8 1/0
అత్యధిక స్కోరు 139 100*
వేసిన బంతులు 6 18
వికెట్లు 0 0
బౌలింగు సగటు
ఒక ఇన్నింగ్సులో 5 వికెట్లు
ఒక మ్యాచ్‌లో 10 వికెట్లు
అత్యుత్తమ బౌలింగు
క్యాచ్‌లు/స్టంపింగులు 22/– 3/–
మూలం: Cricinfo, 2016 డిసెంబరు 24

ఫైసల్ ఇక్బాల్ (జననం 1981, డిసెంబరు 30) పాకిస్తానీ క్రికెట్ కోచ్, మాజీ క్రికెటర్. టెస్టులు, వన్డే ఇంటర్నేషనల్స్‌ మ్యాచ్ లలో పాకిస్థాన్ జాతీయ క్రికెట్ జట్టుకు ప్రాతినిధ్యం వహించాడు.

కరాచీ రీజియన్, పాకిస్తాన్ ఇంటర్నేషనల్ ఎయిర్‌లైన్స్, పాకిస్తాన్ నేషనల్ షిప్పింగ్ కార్పొరేషన్, సింధ్ డాల్ఫిన్స్, పాకిస్తాన్ ఎ జట్టు తరపున ఫస్ట్ క్లాస్, లిస్ట్ ఎ, టీ20లలో ఆడాడు.

ప్రస్తుతం కోచ్‌గా ఉన్నాడు. వివిధ టీవీ ఛానెల్‌లలో క్రికెట్ పై విశ్లేషణ కార్యక్రమాలలో పాల్గొంటున్నాడు.

ప్రారంభ జీవితం, కుటుంబం[మార్చు]

ఇతను జావేద్ మియాందాద్ మేనల్లుడు.[2] ఇక్బాల్ భార్య దక్షిణాఫ్రికా జాతీయురాలు.[3]

క్రికెట్ రంగం[మార్చు]

దేశీయ క్రికెట్[మార్చు]

2011 జనవరిలో కరాచీలో జరిగిన క్వాయిడ్-ఎ-అజం ట్రోఫీ డివిజన్ వన్ ఫైనల్స్‌కు చేరుకున్న పాకిస్తాన్ జట్టులో ఇక్బాల్ సభ్యుడిగా ఉన్నాడు. రెండు ఇన్నింగ్స్‌లలో అతను 0 (6), 15 (26) పరుగులు చేశాడు.[4] 2017-18 క్వాయిడ్-ఎ-అజం ట్రోఫీలో కరాచీ వైట్స్ తరపున ఏడు మ్యాచ్‌లలో 413 పరుగులతో అత్యధిక పరుగుల స్కోరర్‌గా నిలిచాడు.[5]

అంతర్జాతీయ క్రికెట్[మార్చు]

శ్రీలంకతో తొలి వన్డే మ్యాచ్ ఆడాడు.[6] న్యూజిలాండ్‌లో జరిగిన పాకిస్తాన్ పర్యటనలో అంతర్జాతీయ టెస్ట్ కెరీర్‌ను ప్రారంభించాడు.[7] 2002-03లో దక్షిణాఫ్రికాలో రెండు టెస్టులు ఆడాడు, కానీ బాగా రాణించకపోవడంతో తొలగించబడ్డాడు. రెండు సంవత్సరాల విరామం తర్వాత టెస్ట్ క్రికెట్‌కు తిరిగి వచ్చిన తర్వాత, కరాచీలో జరిగిన 2005-06 టెస్ట్ సిరీస్‌ చివరి టెస్ట్‌లో భారతదేశంపై తన తొలి టెస్ట్ సెంచరీని సాధించి, పాకిస్థాన్‌ సిరీస్ గెలుచుకోవడంలో కీలకపాత్ర పోషించాడు. 2006లో వెస్టిండీస్‌తో తన చివరి వన్డే ఆడాడు.[8]

కోచింగ్ కెరీర్[మార్చు]

క్రికెట్ నుండి పదవీ విరమణ తరువాత ఇంగ్లాండ్ లో క్రికెట్ కోచింగ్ లో శిక్షణ పొందాడు. కొంతకాలంపాటు పిఎస్ఎల్ గత సీజన్లలో కరాచీ కింగ్స్‌కు బ్యాటింగ్ కోచ్ గా, కన్సల్టెంట్‌గా పనిచేశాడు.[9]

2020 నాటికి, బలూచిస్తాన్ జట్టుకు ప్రధాన కోచ్‌గా ఉన్నాడు.[10] 2022లో, అబుదాబి టీ10 ఆరవ సీజన్ కోసం నార్తర్న్ వారియర్స్ జట్టుకు ప్రధాన కోచ్‌గా నియమించబడ్డాడు.[11]

మూలాలు[మార్చు]

  1. "Cricketing Dynasties: The Twenty Two Families of Pakistan Test Cricket – Part 7 | Sports | thenews.com.pk". www.thenews.com.pk.
  2. Profile Cricinfo.
  3. Agha, Shaan (2 September 2013). ""They always wanted me to fail"". DAWN.COM.
  4. Match Retrieved 2023-09-11
  5. "Quaid-e-Azam Trophy, 2017/18: Karachi Whites Batting and bowling averages haji zulfiqar haider". ESPN Cricinfo. Retrieved 2023-09-11.
  6. "Full Scorecard of Sri Lanka vs Pakistan 3rd ODI 2000 - Score Report | ESPNcricinfo.com". ESPNcricinfo.
  7. "Pakistan tour of New Zealand". Cricinfo.
  8. "Full Scorecard of Pakistan vs West Indies 4th ODI 2006 - Score Report | ESPNcricinfo.com". ESPNcricinfo.
  9. "Miandad urges PCB to hire Faisal Iqbal as batting coach". Cricket Pakistan. 13 October 2019.
  10. "National T20 Cup: Faisal Iqbal reinstated as Balochistan head coach". Geo Super. 25 September 2020.
  11. Sharma, Avinash (23 November 2022). "Abu Dhabi T10 2022: Captains, coaches, star players and support staff of all 8 franchises in Season 6". MyKhel.

బాహ్య లింకులు[మార్చు]