ఫ్రీ ఇండియా సెంటర్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
బెర్లిన్‌లోని ఫ్రీ ఇండియా సెంటర్‌ నిర్వహించిన స్వతంత్ర భారత తాత్కాలిక ప్రభుత్వ స్థాపన వేడుక. ఇండియన్ లీజియన్ సైనికులు. జర్మన్, భారతీయ ప్రముఖులూ హాజరయ్యారు

ఫ్రీ ఇండియా సెంటర్, సుభాస్ చంద్రబోస్ నేతృత్వంలో నెలకొల్పిన తాత్కాలిక ప్రభుత్వమైన ఆజాద్ హింద్ యొక్క ఐరోపా శాఖ. దీనిని బోస్ 1942లో జర్మనీలో ఉన్నప్పుడు స్థాపించాడు. దీనికి ACN నంబియార్ నాయకత్వం వహించాడు.

ఐరోపాలో అక్ష రాజ్యాలతో సంబంధాలు నెరపడం, ఇండియన్ లీజియన్ కోసం స్వచ్ఛంద కార్యకర్తలను నియమించడం, వారికి మద్దతు నివ్వడం, ఆజాద్ హింద్ రేడియోను నిర్వహించడం జపాన్ మద్దతుతో ఆగ్నేయాసియాలో ఏర్పాటు చేయతలపెట్టిన పెద్ద తాత్కాలిక ప్రభుత్వం కోసం భూమిక సిద్ధం చేయడం వంటివి దాని విధుల్లో ఉన్నాయి. దాని ప్రధాన స్థావరం బెర్లిన్‌లో ఉండగా, ఇటలీలో, ఆక్రమిత ప్యారిస్‌లో శాఖా కార్యాలయాలు కూడా ఉన్నాయి. బెర్లిన్‌లో స్థాపించినప్పుడు నాజీ జర్మనీ ఫ్రీ ఇండియా సెంటర్‌కు దౌత్య కార్యాలయ హోదా ఇచ్చింది. టైర్‌గార్టెన్‌లోని నం. 2A లీచ్‌టెన్‌స్టైనర్ అల్లీలో దానికి ఒక కార్యాలయం ఉంది. అయితే దీని కార్యకలాపాలు కొంత కాలం పాటు హోటళ్లలో లేదా చార్లోటెన్‌బర్గ్‌లోని సోఫియెన్‌స్ట్రాస్సేలోని బోస్ ఉన్న చివరి ఇంటిలో నిర్వహించారు. [1]

మూలాలు [మార్చు]

  1. Werth, Aleander, ed. (1996). A Beacon Across Asia: A Biography of Subhas Chandra Bose. Orient Blackswan. pp. 106–109. ISBN 8125010289.