Coordinates: 17°25′06″N 78°30′44″E / 17.4182241°N 78.512281°E / 17.4182241; 78.512281

బౌద్ధ నగర్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
బౌద్ధ నగర్
సమీపప్రాంతం
బౌద్ధ నగర్ కమ్యునిటీ హాల్
బౌద్ధ నగర్ కమ్యునిటీ హాల్
బౌద్ధ నగర్ is located in Telangana
బౌద్ధ నగర్
బౌద్ధ నగర్
భారతదేశంలోని తెలంగాణలో ప్రాంతం ఉనికి
Coordinates: 17°25′06″N 78°30′44″E / 17.4182241°N 78.512281°E / 17.4182241; 78.512281
దేశం భారతదేశం
రాష్ట్రంతెలంగాణ
జిల్లాహైదరాబాదు
మెట్రోపాలిటన్ ప్రాంతంహైదరాబాదు మెట్రోపాలిటన్ ప్రాంతం
Government
 • Bodyహైదరాబాదు మహానగరపాలక సంస్థ
భాషలు
 • అధికారికతెలుగు, ఉర్దూ
Time zoneUTC+5:30 (భారత కాలమానం)
పిన్ కోడ్
500 061
Vehicle registrationటిఎస్
లోక్‌సభ నియోజకవర్గంసికింద్రాబాదు లోక్‌సభ నియోజకవర్గం
శాసనసభ నియోజకవర్గంసికింద్రాబాద్ శాసనసభ నియోజకవర్గం
పట్టణ ప్రణాళిక సంస్థహైదరాబాదు మహానగరపాలక సంస్థ

బౌద్ధ నగర్, తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాదులోని ఒక ప్రాంతం. సికింద్రాబాద్ శివారు ప్రాంతాలలో ఒకటైన ఈ ప్రాంతం ఉస్మానియా విశ్వవిద్యాలయం క్యాంపస్ నుండి 1.5 కి.మీ.ల దూరంలో ఉంది. ఈ ప్రాంతంలో పాత బౌద్ధ దేవాలయం ఉండడంవల్ల ఈ ప్రాంతానికి బౌద్ధ నగర్ అని పేరు వచ్చింది. ఇది చిలకలగూడ పోలీస్ స్టేషన్ పరిధిలోకి వస్తుంది. ఇక్కడ బౌద్ధ నగర్ కమ్యూనిటీ హాల్ కూడా ఉంది.[1]

భౌగోళికం[మార్చు]

బౌద్ధ నగర్ కు తూర్పున ఉస్మానియా విశ్వవిద్యాలయ ఆర్ట్స్ కళాశాల, ఉత్తరం వైపు వారసిగూడ, పశ్చిమాన అంబర్ నగర్, దక్షిణాన మహ్మద్ గూడా మొదలైన ప్రాంతాలు ఉన్నాయి.

వార్డు వివరాలు[మార్చు]

ఈ ప్రాంతం హైదరాబాదు మహానగరపాలక సంస్థ పరిధిలోని 146వ వార్డు నెంబరులో ఉంది.[2] సికింద్రాబాద్ సర్కిల్ లోని సికింద్రాబాద్ జోన్‌లో భాగంగా ఉంది. ఈ వార్డులో మొత్తం 39,509 మంది అర్హులైన ఓటర్లు ఉన్నారు, ఇందులో 20,000 మంది పురుషులు కాగా, 19,508 మంది మహిళలు, 1 ట్రాన్స్ జెండర్ ఉన్నారు. ఈ వార్డులో 43 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి. 2020 హైదరాబాదు మహానగర పాలక సంస్థ ఎన్నికలలో తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీకి చెందిన కంది శైలజ కార్పోరేటర్ గా గెలుపొందింది.[3][4]

సమీప ప్రాంతాలు[మార్చు]

ఇక్కడికి సమీపంలో సీతాఫల్ మండి రైల్వే క్వార్టర్స్, మణికేశ్వరినగర్, ఇందిరా నగర్, సీతాఫల్ మండి, శ్రీమతి కాంప్లెక్స్ మొదలైన ప్రాంతాలు ఉన్నాయి.[5]

ప్రార్థనా మందిరాలు[మార్చు]

ఒక్కడ బౌద్ధ దేవాలయం, దుర్గా దేవాలయం, పాత రామాలయం, సాయిబాబా దేవాలయం, మస్జిద్-ఇ-మహమ్మది, జామియా మసీదు, కౌసర్ మసీదు ఉన్నాయి.

చదువు[మార్చు]

దూరవిద్య కోసం ప్రొఫెసర్ జి. రామిరెడ్డి సెంటర్ పక్కన ఉన్న అంతర్జాతీయ సైక్లింగ్ స్టేడియం (వెలోడ్రోమ్) బౌద్ధ నగర్‌కు అతి సమీపంలో ఉంది. జ్యోతి మోడల్ స్కూల్, నేతాజీ స్కూల్, బాలాజీ స్కూల్, జాన్సన్ గ్రామర్ స్కూల్, జవహర్ విఎన్ ఇంగ్లీష్ హైస్కూల్, అమరావతి గ్రామర్ స్కూల్, ఎంఎస్ క్రియేటివ్ స్కూల్, రాంనగర్ పబ్లిక్ స్కూల్ పాఠశాలల ఉన్నాయి.

ఆరోగ్య సంరక్షణ[మార్చు]

ఇక్కడ డాక్టర్ కేశవ్ రెడ్డి క్లినిక్, డాక్టర్ రఘురాములు క్లినిక్, కౌసర్ మసీదు సమీపంలోని డాక్టర్ ఇక్బాల్ అలీ బేగ్ క్లినిక్ వంటి వైద్యశాలలు ఉన్నాయి.

రవాణా[మార్చు]

రోడ్డుమార్గం[మార్చు]

ఇక్కడికి సమీపంలోని వారసిగూడ, ఆర్ట్స్ కళాశాల, జామియా ఉస్మానియా ప్రాంతాలలో బస్టాప్ లు ఉన్నాయి. తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఆధ్వర్యంలో ఈ ప్రాంతం మీదుగా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌, కోఠిలను కలుపుతూ బస్సులు నడుస్తాయి.[6]

రైల్వేమార్గం[మార్చు]

ఇక్కడకి సమీపంలో సికింద్రాబాదు, కాచిగూడ కలిపే రైలు మార్గం ఉంది. ఎంఎంటిఎస్ రైళ్ళు కూడా నడుస్తున్నాయి.

మూలాలు[మార్చు]

  1. "Boudha Nagar, Warasiguda, Boudhanagar Colony Locality". www.onefivenine.com. Retrieved 2021-10-04.
  2. "GHMC Election 2020 Winners List: BJP wins 48; TRS bags 56, AIMIM 44". The Financial Express (in అమెరికన్ ఇంగ్లీష్). 2020-12-04. Retrieved 2021-10-04.
  3. "Boudha Nagar Election Result 2020 Live Updates: TRS Wins Boudha Nagar Ward". News18 (in ఇంగ్లీష్). 2020-12-04. Retrieved 2021-10-04.
  4. Dec 4, TIMESOFINDIA COM / Updated:; 2020; Ist, 22:39. "GHMC Election Results: Key highlights | Hyderabad News - Times of India". The Times of India (in ఇంగ్లీష్). Retrieved 2021-10-04. {{cite web}}: |last2= has numeric name (help)CS1 maint: extra punctuation (link) CS1 maint: numeric names: authors list (link)
  5. "Boudha Nagar, Bank Colony, Padmarao Nagar Locality". www.onefivenine.com. Retrieved 2021-10-04.
  6. "Hyderabad Local TSRTC Bus Routes". www.onefivenine.com. Retrieved 2021-10-04.