బ్రూస్ లీ

వికీపీడియా నుండి
బ్రూస్ లీ
Bruce lee.jpg
జన్మ నామం లీ జున్-ఫాన్
జననం నవంబరు 27 1940(1940-11-27)
మరణం జూలై 20, 1973(1973-07-20) (వయసు 32)
అనుమానాస్పదం
వృత్తి నటుడు, తత్వవేత్త
వెబ్‌సైటు బ్రూస్ లీ ఫౌండేషన్
బ్రూస్ లీ అధికార సైటు

బ్రూస్ లీ (జ: నవంబర్ 27, 1940 - మ: జులై 20, 1973) అమెరికాలో జన్మించిన చెందిన కరాటే యోధుడు మరియు నటుడు. ఆయన్ను చాలామంది 20 వ శతాబ్దంలోనే ప్రఖ్యాతి గాంచిన యుద్ధ విద్యా ప్రవీణుడిగా, సాంస్కృతిక చిహ్నంగా భావిస్తారు.[1] కుమారుడు బ్రాండన్ లీ, కుమార్తె షానన్ లీ కూడా నటులే. తమ్ముడు రాబర్ట్ 1960వ దశకంలో హాంకాంగ్ ను ఒక ఊపు ఊపిన థండర్ బర్డ్స్ అనే సంగీత బృందంలో సభ్యుడు. [2]

బ్రూస్ లో తన సినిమాల్లో చైనా సాంప్రదాయాలను, జాతీయ గౌరవాన్ని ఎక్కువగా చూపించడం చేత చైనీయులు లీ ని అమితంగా అభిమానించే వారు. [3]. చైనీయుల సాంప్రదాయ క్రీడ యైన కుంగ్ ఫూ ను లీ తన సినిమాల్లో ఎక్కువగా ప్రదర్శించే వాడు.

విషయ సూచిక

బాల్యం [మార్చు]

బ్రూస్ లీ కాలిఫోర్నియా రాష్ట్రంలోని శాన్‌ ఫ్రాన్సిస్కో అనే నగరంలో జన్మించి. హాంకాంగ్ లో పెరిగాడు. లీ జన్మించిన సంవత్సరం చైనీస్ క్యాలెండర్ ప్రకారం డ్రాగన్ సంవత్సరం.

నటనా జీవితం [మార్చు]

బ్రూస్ లీ 1973 వ సంవత్సరంలో ఎంటర్ ది డ్రాగన్ చిత్రం లో నటించాడు. కానీ, ఆతడు ఈ చిత్రం విడుదలకు ముందే చనిపోయాడు.

శారీరక ధారుడ్యము, పౌష్టికాహారం [మార్చు]

అప్పటి మార్షల్ ఆర్ట్స్ క్రీడాకారులు ఫిజికల్ కండిషనింగ్ కోసం ఎక్కువ సమయం కేటాయించేవారు కాదని బ్రూస్ లీ అభిప్రాయపడేవాడు. అన్నిరకాలుగా ఫిట్ గా ఉండటం కోసం బాగా కసరత్తు చేసేవాడు.

మరణం [మార్చు]

మే 10, 1973 న ఎంటర్ ది డ్రాగన్ సినిమాకు గోల్డెన్ హార్వెస్ట్ అనే స్టూడియో లో డబ్బింగ్ జరుగుతుండగా లీ అకస్మాత్తుగా కుప్పకూలిపోయాడు. మెదడు విపరీతంగా ఉబ్బిపోవడం దీనికి కారణం. వెంటనే లీ ని హాంకాంగ్ బాప్టిస్ట్ హాస్పిటల్ కుతరలించారు.

మూలాలు [మార్చు]

  1. Stein, Joel (1999). "TIME 100: Bruce Lee". Time. Retrieved 2008-05-30. 
  2. Web UK Online, Bruce Lee Articles In The Shadow Of A Legend - Robert Lee Remembers Bruce Lee by Steve Rubinstein
  3. Dennis, Felix; Atyeo, Don (1974). Bruce Lee King of Kung-Fu. United States: Straight Arrow Books. ISBN 0-87932-088-5. 
"http://te.wikipedia.org/w/index.php?title=బ్రూస్_లీ&oldid=811111" నుండి వెలికితీశారు