భీమరాజు వెంకటరమణ

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

భీమరాజు వెంకటరమణ హాస్య కథా రచయిత. [1] ఆయన హాస్య కథలతోపాటు మామూలు కథలు అనగా ప్రేమకథలు, కుటుంబ సంబంధాల కథలు కూడా రాశాడు. అతను హాస్యరచన రంగంలో తెలుగు విశ్వవిద్యాలయం కీర్తి పురస్కారాన్ని 2017లో అందుకున్నాడు[2]

జీవిత విశేషాలు[మార్చు]

అతను ప్రకాశం జిల్లా ఒంగోలులో 1956 ఆగస్టు 15న భీమరాజు నరసింహారావు, లీలావతి దంపతులకు జన్మించాడు. ప్రాథమిక విద్యను అక్కడే అభ్యసించాడు. కామర్స్ లో డిగ్రీ చేసాడు. అతని తండ్రి భీమరాజు నరసింహారావు 1960ల కాలంలో ఆంధ్రపత్రిక, హిందూ దినపత్రికలకు ఒంగోలు నుండి విలేకరిగాను, రెండు దశాబ్దాల పాటు జ్ఞానప్రభ (ఆధ్యాత్మిక పత్రిక) కు సంపాదకులుగా వ్యవహరించాడు. అతని ప్రభావం కారణంగా వెంకటరమణకు సాహిత్యంపై ఆసక్తి ఏర్పడినది. వృత్తి రీత్యా ప్రైవేటు సర్వీసు రంగంలో ఉన్న అతనికి అనుకోకుండా సాహిత్య రంగంపై అనురక్తి ఏర్పడినది. శ్రీ వేంకటేశ్వరస్వామి మీద 30 కి పైగా కవితలు రాసాడు. అవి "వసుధ" ఆధ్యాత్మిక మాసపత్రికలో ప్రచురితమయ్యాయి. తరువాత కథారచనను చేపట్టాడు. అతను రాసిన కథలు 30కి పైగా ప్రచురితమయ్యాయి. అందులో 23 హాస్యకథలు. ఈ కథలను కలిపి ఒక సంపుటిగా "కుడి ఎడమైతే" అనే పుస్తకంగా వెలువరించాడు. కొన్ని కథలు కన్నడ భాషలోకి అనువాదమయ్యాయి. మానవ ప్రవృత్తులలోని వైరుధ్యాలు, విభిన్న పోకడలు అతని రచనలకు ఇతివృత్తాలు. [3] వీరి కథల్లో సన్నివేశాలు, సంభాషణలు సహజంగా ఉంటాయి.

రచనలు[మార్చు]

  • కథకు కథ
  • మనసు పలికే
  • కథలు-హాస్యకథలు
  • కుడి ఎడమైతే

మూలాలు[మార్చు]

  1. "సంచిక పత్రికలో భీమరాజు వెంకటరమణ".
  2. ఈనాడు (డైలీహంట్) (13 October 2015). "43 మందికి తెలుగువర్సిటీ కీర్తి పురస్కారాలు". Archived from the original on 15 October 2018. Retrieved 15 October 2018.
  3. "కుడి ఎడమైతే - హాస్యకథా సంపుటి - ముందుమాట".[permanent dead link]