మహాకవి శ్రీశ్రీ (పుస్తకం)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

మహాకవిగా సుప్రసిద్ధుడైన శ్రీశ్రీ జీవితం, సాహిత్యం గురించి మహాకవి శ్రీశ్రీ గ్రంథం కేంద్ర సాహిత్య అకాడమీ వారు వెలువరించారు. ప్రముఖ భాషావేత్త, రచయిత, పాత్రికేయుడు బూదరాజు రాధాకృష్ణ ఈ పుస్తకం రచించారు.

రచన నేపథ్యం

[మార్చు]

మహా కవి శ్రీశ్రీ అనే ఈ పుస్తకాన్ని బూదరాజు రాధాకృష్ణ భారతీయ సాహిత్య నిర్మాతలు శీర్షిక కోసం 1999లో ఆంగ్లంలో రచించాడు. దాన్ని ఆయనే తెలుగులోకి అనువదించాడు. కేంద్ర సాహిత్య అకాడమీ ముఖ్యమైన భారతీయ భాషలన్నిటిలోకీ అనువదించి భారతీయ సాహిత్య నిర్మాతలు శీర్షికన ప్రచురించారు.

విషయం

[మార్చు]

ఇరవయ్యవ శతాబ్దపు తెలుగు సాహిత్యాన్ని శాసించిన మహాకవి, శ్రీశ్రీ. శ్రీరంగం శ్రీనివాసరావు శ్రీశ్రీ గా ప్రసిద్ధుడయ్యాడు. విప్లవ కవిగా, సాంప్రదాయ, ఛందోబద్ధ కవిత్వాన్ని ధిక్కరించినవాడిగా, అభ్యుదయ రచయితల సంఘం అధ్యక్షుడిగా, విప్లవ రచయితల సంఘం స్థాపక అధ్యక్షుడిగా, సినిమా పాటల రచయితగా ఆయన ప్రసిద్ధుడు. శ్రీశ్రీ హేతువాది, నాస్తికుడు. మహాకవిగా శ్రీశ్రీ విస్తృతామోదం పొందాడు.

పుస్తకం లోని కొన్ని విశేషాలు

[మార్చు]

శ్రీశ్రీ సృజించిన కవితా! ఓ కవితా! అనే కవిత గురించి బూదరాజు రాధాకృష్ణ ఈ పుస్తకంలో ఇలా రాసాడు:

"కనీసం వేయి సంవత్సరాల చరిత్ర ఉన్న తెలుగు సాహిత్యంలో కవితను ఇలా నిర్వచించి, ఇంత కవితాత్మకంగా వర్ణించి, ఇంత అద్భుత సృష్టి చేసిన మరో కవి లేనే లేడు. ఇదే అతణ్ణి సాహితీ శిఖరాగ్రాన నిలిపింది"

— బూదరాజు రాధాకృష్ణ, [1]

మహాప్రస్థానం ఆయన రచించిన కావ్యాల్లో ప్రసిద్ధమైనది. ఆయన సాహిత్య కృషిని, సాహిత్యంలో ఆయన స్థానాన్ని, కాలాన్ని, ప్రభావాన్ని గురించి తెలియజేయడం ఈ పుస్తకం లక్ష్యం. ముఖ్యంగా భారతదేశంలోని ఇతర భాషల వారిని ఉద్దేశించి, వారికి తెలిపేందుకు ఈ గ్రంథం రచించారు.

ప్రకరణాలు

[మార్చు]
  • జీవిత రేఖాచిత్రం
  • తొలి ప్రభావాలు
  • పూర్వ రంగ, సమకాలీన పరిస్థితులు
  • శ్రీశ్రీ రచనలు
  • తనను గురించి, ఇతరుల గురించీ...
  • వ్యక్తిగా శ్రీశ్రీ
  • సాహిత్యంలో స్థానం
  • భూత భవిష్యత్తులు

బయటి లింకులు

[మార్చు]

డిజిటల్ లైబ్రరీ ఆఫ్ ఇండియాలోని గ్రంథ ప్రతి

మూలాలు

[మార్చు]
  1. బూదరాజు, రాధాకృష్ణ (1999). మహాకవి శ్రీశ్రీ [మహాకవి శ్రీశ్రీ]. Translated by బూదరాజు, రాధాకృష్ణ. న్యూ ఢిల్లీ: కేంద్ర సాహిత్య అకాడమీ. p. 47. ISBN 81-260-0719-2.{{cite book}}: CS1 maint: date and year (link)