మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి
దర్శకత్వంపి. మహేష్ కుమార్
రచనపి. మహేష్ కుమార్
నిర్మాతవంశీ, ప్రమోద్
తారాగణం
ఛాయాగ్రహణంనీరవ్ షా
సంగీతంరధన్
నిర్మాణ
సంస్థ
యూవీ క్రియేషన్స్
విడుదల తేదీs
2023 సెప్టెంబరు 7 (2023-09-07)(థియేటర్)
2023 అక్టోబరు 5 (2023-10-05)( నెట్‌ఫ్లిక్స్‌ ఓటీటీలో)
దేశంభారతదేశం
భాషతెలుగు

మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి 2023లో రూపొందుతున్న తెలుగు సినిమా. యూవీ క్రియేషన్స్ బ్యానర్‌పై వంశీ, ప్రమోద్ నిర్మించిన ఈ సినిమాకు పి. మహేష్ కుమార్ దర్శకత్వం వహించాడు. అనుష్క, నవీన్ పొలిశెట్టి, జయసుధ, మురళి శర్మ, నాజర్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా టైటిల్, ఫస్ట్ లుక్ పోస్టర్‌ను మార్చి 1న విడుదల చేసి[1], సినిమాలోని నో నో నో పాటను మార్చి 21న విడుదల చేశారు.[2]

నటీనటులు[మార్చు]

పాటల జాబితా[మార్చు]

లేడీ లక్ , రచన: రామజోగయ్య శాస్త్రి, గానం.కార్తీక్

నో నో నో, రచన: అనంత్ శ్రీరామ్, గానం.ఎం ఎం మనసి, లేడీ కష్

హతవిధీ , రచన: రామజోగయ్య శాస్త్రి , గానం . ధనుష్

ఏ వైపుకు సాగుతుంది , రచన: రామజోగయ్య శాస్త్రి , గానం.శంకర్ మహదేవన్.

దూకే చినుకా , రచన: అనంత్ శ్రీరామ్, గానం.అబ్బీ వి .

కథ[మార్చు]

స్వతంత్ర భావాలున్న అన్విత (అనుష్కా శెట్టి) తన తల్లి (జయసుధ) మరణం తర్వాత ఒంటరితనం ఫీలవుతుంది. తనకు ఓ తోడు కావాలని, ఆ తోడు తన బిడ్డ అవ్వాలని అనుకుంటుంది.పెళ్లి చేసుకోకుండానే పిల్లలను కనాలని అనుకుంటుంది. బిడ్డను కనేందుకు తగిన యువకుడి కోసం వెతుకుతుండగా ఈ క్రమంలో స్టాండప్ కామెడీ చేసే సిద్దూ పొలిశెట్టి ( నవీన్ పొలిశెట్టి) పరిచయమవుతాడు. సిద్దూ అన్విత పెమలో పడుతాడు, కానీ అన్విత నిర్ణయంతో సిద్దూ జీవితంలో ఎలాంటి మార్పులు చోటు చేసుకున్నాయి. వారిద్దరి ప్రయాణం ఎలా సాగింది? మరి చివరికి ఏం జరిగింది? అనేదే మిగతా సినిమా కథ.[4]

విడుదల[మార్చు]

మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా 2023 సెప్టెంబరు 7న థియేటర్లలో విడుదలైన ఈ సినిమా అక్టోబర్ 5 నుండి నెట్‌ఫ్లిక్స్‌ ఓటీటీలో స్ట్రీమింగ్‌ ప్రారంభమైంది.[5]

సాంకేతిక నిపుణులు[మార్చు]

  • బ్యానర్: యూవీ క్రియేషన్స్
  • నిర్మాత: వంశీ, ప్రమోద్
  • కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: పి. మహేష్ కుమార్
  • సంగీతం: రధన్
  • సినిమాటోగ్రఫీ:నీరవ్ షా
  • కొరియోగ్రాఫర్: రాజు సుందరం

మూలాలు[మార్చు]

  1. A. B. P. Desam (1 March 2023). "మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి - అనుష్క కొత్త సినిమా టైటిల్, లుక్ వచ్చిందోచ్". Archived from the original on 26 March 2023. Retrieved 26 March 2023.
  2. Hindustantimes Telugu (22 March 2023). "మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి నుంచి నో నో నో సాంగ్ అదుర్స్". Archived from the original on 26 March 2023. Retrieved 26 March 2023.
  3. The Hindu, The Hindu (2 March 2023). "Anushka-Naveen Polishetty film titled 'Miss Shetty Mr Polishetty'" (in Indian English). Archived from the original on 26 March 2023. Retrieved 26 March 2023.
  4. Eenadu (7 September 2023). "రివ్యూ: మిస్‌ శెట్టి.. మిస్టర్‌ పొలిశెట్టి.. అనుష్క, నవీన్‌ల మూవీ అలరించిందా?". Archived from the original on 5 October 2023. Retrieved 5 October 2023.
  5. TV9 Telugu (5 October 2023). "ఓటీటీలోకి వచ్చేసిన 'మిస్‌ శెట్టి మిస్టర్‌ పొలిశెట్టి'.. ఎక్కడ చూడొచ్చంటే?". Archived from the original on 5 October 2023. Retrieved 5 October 2023.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)

బయటి లింకులు[మార్చు]