మేదరి
|
ఈ వ్యాసము మొలక(ప్రాథమిక దశలో ఉన్నది). ఈ మొలకను వ్యాసంగా విస్తరించి, ఈ మూసను తొలగించండి. |
మేదరి ఇది వెనుక బడిన కులం. మహేంద్ర అని కూడా అంటారు. వెదురుతో తట్టలు, బుట్టలు చేస్తారు. వెదురుతో వేయి లాభాలన్నారు. వెదురు బొంగులు తీసుకొచ్చి వాటిని తట్టలు, గంపలు, నిచ్చెనలు, రేషం తట్టలు, చంద్రింకలు తదితర వస్తువులు తయారు చేసి విక్రయిస్తూ జీవనం సాగిస్తున్న వీరికి ప్లాస్టిక్ వస్తువులు విరివిగా అందుబాటులోకి రావడం ఎక్కడ వేసినా ఇబ్బంది లేక పోవడంతో విరివిగా ప్లాస్టిక్‌ల మీదే ప్రజలు మోజు పడుతూ వాటి మీద ఆదరణ చూపుతున్నారు. గతంలో వెదురు తడికలు, వెదురు నిచ్చెనలు విరివిగా వాడేవారు. ప్లాస్టిక్ రావడంతో రేషం తట్టలు, మైలబట్టల బుట్టలు, ఇనప నిచ్చెనలు అందుబాటులోకివచ్చి మేదరుల కుల వృత్తి దెబ్బతింది.క్రమేణా విద్యావంతులు అధికారులు బాగా పెరిగారు. మేదరి వారు ఎక్కువగా ప్రకాశము జిల్లాలోని ఒంగోలు, కందుకూరు, సింగరాయకొండ వద్ద ఉన్నారు. వీరి ఇంటిపేర్లు కేతా, నాగినేని, పాతకోట మొదలైనవి.
మేదరి వారు దేశము లోని అన్ని రాష్ట్రములలో SC లుగా ఉన్నారు ఒక్క ఆంధ్రప్రదేశ్ లో తప్ప మేదరి వారు వెనుకబడి పోవుటకు రాష్ట్ర ప్రభుత్వం కూడా ఒక కారణం. రాష్ట్రప్రభుత్వం నుండి సరైన ప్రోత్సాహం అందక క్రమముగ వెనుకబడి పోయారు. దీనికి రాష్ట్రప్రభుత్వం మాత్రమే బాధ్యత వహించవలసియున్నది. మేదరి వారు కనీసము ఒక మునిసిపల్ వార్డుకు కూడా ప్రాతినిధ్యం వహించకపోవడం మన అగ్ర కులాల రాజకీయాలకు నిదర్శనం.