మైసూరు సాండల్ సబ్బు
ఈ వ్యాసం భౌగోళిక గుర్తింపు (GI) జాబితాలో భాగం | |||||||||||||||||
---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
|
మైసూరు సాండల్ సబ్బు (ఆంగ్లం: Mysore Sandal Soap; కన్నడ: ಮೈಸೂರ್ ಸ್ಯಾಂಡಲ್ ಸೋಪ್) ఒక సబ్బుల బ్రాండ్. దీన్ని కర్ణాటక ప్రభుత్వం ఆధ్వర్యంలోని కర్ణాటక సోప్స్ అండ్ డిటర్జెంట్స్ లిమిటెడ్ (Karnataka Soaps and Detergents Limited; KSDL) ఉత్పత్తిచేస్తుంది. ఈ సబ్బుల కర్మాగారం క్రీ. శ.1916 సంవత్సరం నుండి నల్వాడి కృష్ణరాజ ఒడయారు, మైసూరు మహారాజుగా రాజ్యం చేస్తున్న కాలంలో బెంగుళూరులో స్థాపించబడింది..[1] మొదటి ప్రపంచ యుద్ధం సమయంలో మైసూరు సామ్రాజ్యం నుండి ఐరోపా ఖండానికి చందనం కలప ఎగుమతి ఆగిపోవడంతో అధికమైన చందన నిల్వల వినియోగం ఈ కర్మాగార స్థాపనకు ప్రధాన కారణంగా చెప్పబడుతున్నది.[1] క్రీ. శ.1980 సంవత్సరం ఈ సంస్థను షిమోగా, మైసూరులోని ఇతర చందన నూనెల కర్మాగారాలతో విలీనం చేశారు.[2] మైసూరు సాండల్ సబ్బు ప్రపంచంలో పూర్తిగా (100%) చందన తైలంతో తయారుచేయడిన ఏకైక సబ్బు.[1] ఇతరులు డూప్లికేషన్ చేయకుండా, సరైన క్వాలిటీ నియమాల్ని పాటించేందుకు, ఈ సంస్థ (KSDL) భౌగోళిక గుర్తింపు (Geographical Indication; GI) tag ను పొందినది.[3] క్రీ. శ.2006 లో, మహేంద్ర సింగ్ ధోనీ మైసూరు సాండల్ సబ్బుకు బ్రాండ్ అంబాసడర్ గా వ్యవహరించాడు.[4]
చరిత్ర
[మార్చు]20వ శతాబ్దం ప్రారంభకాలంలో, మైసూరు సామ్రాజ్యం ప్రపంచంలో అత్యధికంగా చందనం ఉత్పత్తిదారులలో ఒకరు. చందనం ఎగుమతి చేసేవారిలో కూడా వీరిదే ప్రథమస్థానం; ముఖ్యంగా ఐరోపా ఖండానికి. మొదటి ప్రపంచ యుద్ధం కాలంలో అత్యధికంగా చందననిల్వలు నిలిచిపోయాయి. వీటిని వినియోగంలోకీ తేవడానికి, మైసూరు మహారాజా నల్వాడి కృష్ణరాజ ఒడయారు, బెంగుళూరులో ప్రభుత్వ సబ్బుల కర్మాగారాన్ని స్థాపించారు. క్రీ. శ.1916 లో ప్రారంభించబడిన ఈ కర్మాగారం అధికంగా చందనతైలాన్ని ఉపయోగించి సబ్బులను తయారుచేసేది దీనిని మోక్షగుండం విశ్వేశ్వరయ్యఆధ్వర్యంలో నిర్మించారు[5].. చందనం కలప నుండి చందన తైలాన్ని డిస్టిల్లేషన్ చేసే కర్మాగారాన్ని కూడా మైసూరులో అదే సంవత్సరం స్థాపించారు. క్రీ. శ.1944 సంవత్సరం షిమోగాలో రెండవ కర్మాగారాన్ని స్థాపించారు.[2] కర్ణాటక విలీనం అనంతరం, ఈ కర్మాగారాల నిర్వహణ కర్ణాటక ప్రభుత్వం ఆధీనంలోని వచ్చింది. క్రీ. శ.1980 లో ఈ కర్మాగారాలను విలీనం చేసి, కర్ణాటక సోప్స్ అండ్ డిటర్జెంట్స్ లిమిటెడ్ గా నామకరణం చేశారు. సింహం శరీరం, ఏనుగు తలను కలిగిన పౌరాణిక జంతువు శరభము (Sharabha), ఈ సంస్థకు చిహ్నంగా ఎన్నుకోబడింది.[2] ఈ కంపెనీ తరువాతి కాలంలో అగర్బత్తీలు, టాల్కం పౌడర్, ఇతర డిటర్జెంట్లను ఉత్పత్తి చేయడం ప్రారంభించింది.
వ్యాపారం
[మార్చు]మార్చి క్రీ. శ.2006 కల్లా, భారతదేశంలో ఉత్పత్తి అవుతున్న 450 వేల టన్నుల చందన సబ్బులల్లో, 6,500 టన్నుల భాగాన్ని మైసూరు సాండల్ సబ్బు కలిగివున్నది.[4] బెంగుళూరులోని సబ్బుల కర్మాగారం సంవత్సరానికి 26,000 టన్నుల ఉత్పత్తి సామర్ధ్యం కలిగిన అతిపెద్దది.[2] ఈ సంస్థ 2004-5 సంవత్సరానికి 1.15 బిలియను (సుమారు $ 28.75 మిలియను) రూపాయల అమ్మకాలను నమోదు చేసుకొన్నది. సాంప్రదాయ పద్ధతిలో మార్కెటింగ్ చేస్తున్న ఈ సంస్థ, మొదటిసారిగా క్రీ. శ.2006 లో మహేంద్ర సింగ్ ధోనీని మైసూరు సాండల్ సబ్బుకు బ్రాండ్ అంబాసడర్ గా ఎన్నికచేసింది. ఈ సబ్బుల అమ్మకాలలో సుమారు 85% దక్షిణ భారతదేశ రాష్టాలైన కర్ణాటక, ఆంధ్ర ప్రదేశ్, తమిళనాడు లోనే ఉన్నాయి. దీని వినియోగ దారులలో అధికశాతం 40 సంవత్సరాల పైబడినవారిగా అంచనాలు తెలుపుతున్నాయి. కర్ణాటకలో చందన కలప నిల్వల కొరత ఈ కర్మాగారం ఉత్పత్తిని చేరుకోవడాన్ని కష్టంగా మారుస్తున్నది.
శతాబ్ది ఉత్సవాలు
[మార్చు]ఈ క్రీ. శ.2016 సంవత్సరం మైసూరు సాండల్ సబ్బు శతాబ్దికాలాన్ని పూర్తిచేసుకొంటున్నది. శతాబ్ది సమయంలో జరిగే ఉత్సవాలలో భాగంలో మైసూరు సాండల్ శతాబ్ది సబ్బును విడుదల చేయాలని సంస్థ భావిస్తున్నది.
మైసూర్ శాండల్ సోప్ తయారీదారులు 2017 నవంబరు 4న ప్రారంభించారు, రోజ్ మిల్క్ క్రీమ్, జాస్మిన్ మిల్క్ క్రీమ్, ఆరెంజ్ లైమ్, కొలోన్ లావెండర్, ఫ్రూటీ ఫ్లోరల్ వేరియంట్‌లలో మైసోప్ బ్రాండ్ పేరుతో కొత్త బాస్కెట్ సబ్బులు అందుబాటులో ఉన్నాయి. ప్రతి వెరైటీ ప్రత్యేకంగా ప్యాక్ చేయబడి, సాంప్రదాయ రూపాల్లో భారతీయ జాతి స్త్రీని వర్ణిస్తుంది. సబ్బు 100 గ్రా బరువు ఉంటుంది.
మూలాలు
[మార్చు]- ↑ 1.0 1.1 1.2 Bageshree S. (28 అక్టోబరు 2006). "Scent of the region". Online Edition of The Hindu, dated 2006-10-28. Chennai, India: The Hindu. Archived from the original on 1 అక్టోబరు 2007. Retrieved 31 జూలై 2007.
- ↑ 2.0 2.1 2.2 2.3 "Profile". Online webpage of the Karnataka Soaps and Detergents Limited. Archived from the original on 16 జూలై 2007. Retrieved 23 జనవరి 2016.
- ↑ P. Manoj (5 మార్చి 2006). "GI certificate for Mysore Sandal Soap". Online Edition of The Hindu, dated 2006-03-05. Chennai, India: The Hindu. Archived from the original on 1 అక్టోబరు 2007. Retrieved 31 జూలై 2007.
- ↑ 4.0 4.1 Madhumathi D. S. "A whiff of cricket". Online Edition of The Hindu Business Line, dated 2006-03-30. The Hindu Business Line. Retrieved 31 జూలై 2007.
- ↑ "ఆర్కైవ్ నకలు". Archived from the original on 22 మే 2012. Retrieved 25 జనవరి 2016.