రంజిని

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
రంజిని
జననం
సాషా సెల్వరాజ్

జాతీయతసింగపూర్
ఇతర పేర్లురంజని
వృత్తిసినీ నటి
న్యాయవాది
వ్యాపారవేత్త
సామాజిక కార్యకర్త
క్రియాశీల సంవత్సరాలు1985–1992
2014–ప్రస్తుతం
జీవిత భాగస్వామిపియర్ కొంబారా

రంజినిగా సుపరిచితురాలు అయిన సాషా సెల్వరాజ్, సింగపూర్‌లో జన్మించిన నటి. ఆమె భారతీయ తమిళం, మలయాళ చిత్రాలలో ఆమె పాత్రలకు పేరుగాంచింది. ఆమె తెలుగులో కూడా కొన్ని సినిమాలు చేసింది. ఆమె 1985 నుండి 1992 వరకు ప్రముఖ నటి.

1985లో భారతీరాజా దర్శకత్వం వహించిన ముతల్ మరియాతై అనే తమిళ చిత్రం ద్వారా ఆమె సినీరంగప్రవేశం చేసింది.[1] 1987లో, ఆమె లెనిన్ రాజేంద్రన్ రూపొందించిన స్వాతి తిరునాళ్ అనే ట్రావెన్‌కోర్ పాలకుడిపై బయోపిక్‌లో నటించింది. ఆమె నటించిన మలయాళ చిత్రం చిత్రమ్ (1988), దీనికి ప్రియదర్శన్ రచన, దర్శకత్వం వహించాడు. కాగా, ఈ చిత్రం నేటికీ మలయాళ చలనచిత్ర పరిశ్రమలో అనేక రికార్డులతో పాటు భారీ బాక్సాఫీస్ విజయంగా చెప్పుకోతగ్గది.

మోహన్‌లాల్, రంజిని మలయాళ చిత్రసీమలో ఒక జంటగా పరిగణించబడ్డారు, ఎందుకంటే వారి చిత్రాలన్నీ కమర్షియల్‌గా విజయం సాధించాయి.[2] శ్రీనాథ్ రాజేంద్రన్ దర్శకత్వం వహించిన కూతరా (2014)తో రెండు దశాబ్దాల విరామం తర్వాత తిరిగి ఆమె రెండో ఇన్నింగ్స్ మొదలుపెట్టింది.

ప్రారంభ జీవితం[మార్చు]

సాషా సెల్వరాజ్ సింగపూర్‌లో నాల్గవ తరం నివాసితులైన సెల్వరాజ్, లిల్లీలకు జన్మించింది, వీరికి తమిళనాడులోని తిరునెల్వేలి నుండి మూలాలు ఉన్నాయి.[3] ఆమె తన తండ్రి స్నేహితుడైన ప్రముఖ దర్శకుడు భారతీరాజా ద్వారా సినిమాలకు పరిచయమైంది. భారతీరాజా తన 1985 చిత్రం ముతాల్ మరియాతై కోసం రంజిని అనే స్క్రీన్ పేరు పెట్టాడు.

వ్యక్తిగత జీవితం[మార్చు]

లండన్‌లో, రంజిని క్రెడిట్ మేనేజ్‌మెంట్‌లో డిగ్రీ చేసింది. ఆ తరువాత, ఆమె న్యాయ పట్టా పొందింది. ఆమె కొద్దికాలం బీబీసీలో పనిచేసింది. ఆమె న్యాయవాది వృత్తితోపాటు కేరళలోని కొచ్చిలో ఒక విదేశీ విద్యాసంస్థలో జాయింట్ డైరెక్టర్‌గా పనిచేస్తోంది. ఆమె వన్యప్రాణులు, పర్యావరణ కార్యకర్త కూడా.[4]

ఆమె మలయాళీ వ్యాపారవేత్త పియర్ కొంబారాను వివాహం చేసుకుంది.

ఫిల్మోగ్రఫీ[మార్చు]

తెలుగులో ఆమె నటించిన చిత్రాలు[మార్చు]

సంవత్సరం సినిమా పాత్ర
1987 బ్రహ్మ రుద్రులు జ్యోతి
1988 ఆగష్టు 15 రాత్రి శీల
1989 పోలీస్ రిపోర్ట్ లక్ష్మి
1989 మా ఇంటి మహరాజు
1989 పాపే మా ప్రాణం మేరీ

మూలాలు[మార్చు]

  1. "Interview with Ranjini". Vanitha (in Malayalam). Archived from the original on 2 November 2012. Retrieved 4 October 2010.{{cite magazine}}: CS1 maint: unrecognized language (link)
  2. "People still call me Kalyani: Ranjini". The New Indian Express. Retrieved 17 January 2019.
  3. "Ranjini - Mangalam Varika". Mangalam. Archived from the original on 10 January 2014. Retrieved 24 March 2014.
  4. "Will she? Won't she?". Deccan Chronicle. 10 January 2012. Archived from the original on 10 January 2012. Retrieved 17 January 2019.
"https://te.wikipedia.org/w/index.php?title=రంజిని&oldid=4074185" నుండి వెలికితీశారు