రవ్వా శ్రీహరి
డాక్టర్ రవ్వా శ్రీహరి | |
---|---|
రవ్వా శ్రీహరి | |
జననం | రవ్వా శ్రీహరి 1943 సెప్టెంబరు 12 |
మరణం | 2023 ఏప్రిల్ 21 మలక్‌పేట, హైదరాబాద్ | (వయసు 79)
మరణ కారణం | గుండెపోటు |
జాతీయత | భారతీయుడు |
విద్య | ఎం.ఎ., పి.హెచ్.డి |
వృత్తి | మాజీ ఉపకులపతి |
ద్రవిడ విశ్వవిద్యాలయం, కుప్పం | |
సుపరిచితుడు/ సుపరిచితురాలు | నిఘంటుకర్త, వ్యాకరణవేత్త |
బిరుదు | మహామహోపాధ్యాయ |
జీవిత భాగస్వామి | అనంతలక్ష్మి |
పురస్కారాలు | సి.పి.బ్రౌన్ పురస్కారం, 2019 సంవత్సరానికి రాష్ట్రపతి గౌరవ సర్టిఫికేట్, మహర్షి బాదరాయణ్ వ్యాస్ సమ్మాన్ ప్రదానం[1] కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం |
రవ్వా శ్రీహరి (1943, సెప్టెంబరు 12 - 2023, ఏప్రిల్ 21) ఆధునిక తెలుగు నిఘంటుకర్త. సంస్కృత విద్యాభ్యాసం[2], తెలుగులో ఉన్నత విద్య, పరిశోధన, విశ్వవిద్యాలయాల్లో బోధన, పరిపాలనలలో రాణించాడు.[3]. ఇతనికి మహామహోపాధ్యాయ అనే బిరుదు ఉంది.[4]
జననం-కుటుంబం
[మార్చు]తెలంగాణ రాష్ట్రం, యాదాద్రి భువనగిరి జిల్లా, వలిగొండ మండలం, వెల్వర్తి కి చెందిన ఒక సామాన్య చేనేత కుటుంబం నుంచి వచ్చినవాడు శ్రీహరి. నల్లగొండలో 1943, సెప్టెంబరు 12 న జన్మించిన ఇతడు చిన్నతనంలోనే తల్లిని కోల్పోయాడు. ఒక చిన్న చెల్లెలు, ఒక చిన్న తమ్ముడు గల ఇతడే ఆ ఇంటికి పెద్ద.
విద్యాభ్యాసం
[మార్చు]యాదగిరి లక్ష్మీనృసింహ సంస్కృత విద్యాపీఠంలో సురవరం ప్రతాపరెడ్డి, ఎం.నరసింగరావుల సహాయంతో చేరాడు. కప్పగంతుల లక్ష్మణశాస్త్రి ఇతనికి గురువు. తరువాత హైదరాబాద్ లోని సీతారాంబాగ్‌లో కల సంస్కృత కళాశాలలో డి.ఓ.ఎల్, బి.ఓ.ఎల్. వ్యాకరణం చదివాడు. శఠకోప రామానుజాచార్యులు, ఖండవల్లి నరసింహశాస్త్రి, అమరవాది కృష్ణమాచార్యుల వద్ద మహాభాష్యాంతం వ్యాకరణం చదువుకున్నాడు. బి.ఓ.ఎల్. వ్యాకరణంలో పాసైన వెంటనే వివేకవర్ధిని కళాశాలలో తెలుగు పండితుడుగా చేశాడు. క్రమంగా బి.ఏ., తెలుగు పండిత శిక్షణ చేశాక, ఎం.ఏ. తెలుగు, సంస్కృతం చేశాడు.
ఉద్యోగం
[మార్చు]ఆంధ్ర సారస్వత పరిషత్తులో లెక్చరర్‌గా 1967 లో పనిచేశాడు. సారస్వత పరిషత్తు విద్యార్థులకు సంస్కృతం, తెలుగూ రెండూ బోధించాడు. ఉస్మానియా విశ్వవిద్యాలయం తెలుగుశాఖలో 1973 లో ఉద్యోగంలో చేరడంతో ఆచార్య బిరుదురాజు రామరాజు సలహాతో తెలుగులో ‘భాస్కర రామాయణం’ మీద పరిశోధన చేసి పీహెచ్డీ పట్టా పుచ్చుకొన్నాడు.[5] కేంద్రీయ విశ్వవిద్యాలయంలో పదిహేడు సంవత్సరాలు బోధన, పరిశోధనల్ని నిర్వహించిన శ్రీహరి ద్రావిడ విశ్వవిద్యాలయానికి 2002 లో ఉపాధ్యక్షుడుగా నియమితుడయ్యాడు.[6] 2011లో తిరుమల తిరుపతి దేవస్థానం ప్రచురణల విభాగానికి ఎడిటర్-ఇన్-ఛార్జ్‌గా పనిచేశాడు.
రచనలు
[మార్చు]రచనా ప్రక్రియలో మాత్రం తెలుగు రచనలకు పెద్దపీట వేసి 50 వరకు గ్రంథాలను వెలువరించాడు. సంస్కృతంలో 25 పుస్తకాలు రచించారు.పరిశోధన, సృజన, విమర్శ, అనువాదం, నిఘంటు నిర్మాణం వంటి రంగాల మీద తనదైన ముద్రవేశాడు. మూడు పదుల వయస్సులో వ్యాకరణ పదకోశ నిర్మాణం చేశాడు. పాణినీయ అష్టాధ్యాయి లాంటి కఠిన వ్యాకరణ గ్రంథానికి 2 వేల పేజీలలో వ్యాఖ్యానం సమకూర్చి వ్యాకరణాధ్యాయణాన్ని సులభతరం చేశాడు. [7]
నిఘంటువులు
[మార్చు]- శ్రీహరి నిఘంటువు
- అన్నమయ్య పదకోశం
- సంకేత పదకోశం
- వ్యాకరణ పదకోశము (బొడ్డుపల్లి పురుషోత్తంతో కలిసి)
- నల్లగొండ జిల్లా మాండలిక పదకోశం
- తుము రామదాసు కవి పద్య నిఘంటువుకు ఆకారాధ్యనుక్రమణిక చేశారు.[7]
విమర్శా గ్రంథాలు
[మార్చు]- ఉభయ భారతి[8]
- అన్నమయ్య సూక్తివైభవం
- అన్నమయ్య భాషావైభవం
- తెలుగులో అలబ్ధవాఙ్మయం
- సాహితీ నీరాజనం
- తెలుగు కవుల సంస్కృతానుకరణలు
- వాడుకలో తెలుగులో అప్రయోగాలు
- తెలంగాణా మాండలికాలు - కావ్యప్రయోగాలు
- నల్లగొండజిల్లా ప్రజలభాష
వ్యాకరణ గ్రంథాలు
[మార్చు]- సిద్ధాన్త కౌముది
- అష్టాధ్యాయీ వ్యాఖ్యానం
ఇతర గ్రంథాలు
[మార్చు]- శ్రీవిష్ణు సహస్ర నామస్తోత్రమ్, నామావళి
- అలబ్ధ కావ్య పద్య ముక్తావళి
- సంస్కృతన్యాయదీపిక
- వేమన పద్యాలు, ధర్మపురి శేషప్ప కవి నరసింహ శతకం, సినారె ప్రపంచ పదులు, జాషువా ఫిరదౌసి కావ్యాన్ని, గబ్బిలం కావ్యాన్ని సంస్కృతీకరణ చేశారు.[7]
ఆచార్య రవ్వా శ్రీహరి సంస్కృతాంధ్ర సారస్వత పరిషత్
[మార్చు]మిత్రులు. కుటుంబ సభ్యులు, శిష్యులు, సాహితీ ప్రియులు కలిసి ఏర్పాటు చేసి సంస్కృతాంధ్రాలలో విశేష కృషిచేసిన సాహితీ వేత్తలకు వారికి జీవన సాఫల్య పురస్కారాన్ని అందిస్తున్నారు. వారిలో శలాక రఘునాథ శర్మ . నలిమెల భాస్కర్ (బహుభాషా పండితుడు, తెలంగాణా నిఘంటువు కూర్చారు) ఉన్నారు[7]
పురస్కారాలు
[మార్చు]- తిరుపతిలోని కేంద్రీయ సంస్కృత విశ్వవిద్యాలయం వారిచే మహామహోపాధ్యాయ బిరుద ప్రదానం
- 2013లో సి పి బ్రౌన్ పురస్కారం[3]
- 2013లో ఆంధ్రప్రదేశ్ అధికార భాషా సంఘం వారి విశిష్ట పురస్కారం
- 2014లో ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) వారి గిడుగు రామ్మూర్తి పురస్కారం[9]
మరణం
[మార్చు]79 ఏళ్ల శ్రీహరి గుండెపోటుతో హైదరాబాదులోని మలక్‌పేటలో 2023, ఏప్రిల్ 21న మరణించాడు.[10][11] ఆయనకు భార్య అనంతలక్ష్మి, కుమారులు రమేశ్, శివకుమార్, పతంజలి ఉన్నారు.
మూలాలు
[మార్చు]- ↑ "President Awards the Certificate of Honour and Maharshi Badrayan Vyas Samman for the Year 2019".
- ↑ Andhrajyothy (1 May 2023). "సంస్కృతంలో లేని శాస్త్రం లేదు". Archived from the original on 5 February 2024. Retrieved 5 February 2024.
- ↑ 3.0 3.1 "బ్రౌన్ పురస్కారం-2013". pustakam.net/?p=15682. pustakam.net. Archived from the original on 2015-04-18. Retrieved 2015-04-18.
{{cite web}}
: CS1 maint: bot: original URL status unknown (link) - ↑ Sakshi (23 April 2023). "పేదరికాన్ని జయించి భాషా సాహిత్యాలలో రాణించిన ఆచార్య రవ్వా శ్రీహరి". Archived from the original on 5 February 2024. Retrieved 5 February 2024.
- ↑ బూదాటి వేంకటేశ్వర్లు. "మహామహోపాధ్యాయ". సరసభారతి ఉయ్యూరు. Retrieved 18 April 2015.
- ↑ "సంస్కృతాంధ్రాల వారధి ఆచార్య శ్రీహరి". newshunt.com. Retrieved 2015-04-18.[permanent dead link]
- ↑ 7.0 7.1 7.2 7.3 పిల్లలమర్రి శ్రీరాములు.అపర పతంజలి రవ్వా శ్రీహరి. నమస్తే తెలంగాణ. 26 May 2024.
- ↑ రవ్వా శ్రీహరి (1996). ఉభయ భారతి (1 ed.). హైదరాబాదు: వరరుచి పబ్లికేషన్స్. Retrieved 18 April 2015.
- ↑ "రవ్వా శ్రీహరికి గిడుగు పురస్కారం ఇవ్వనున్న తానా". తెలుగు టైమ్స్ అంతర్జాల పత్రిక. 2012-12-17. Archived from the original on 4 March 2016. Retrieved 18 April 2015.
- ↑ telugu, NT News (2023-04-22). "Acharya Ravva Srihari | ద్రావిడ యూనివర్సిటీ మాజీ వీసీ రవ్వా శ్రీహరి కన్నుమూత". www.ntnews.com. Archived from the original on 2023-04-22. Retrieved 2023-04-22.
- ↑ V6 Velugu (23 April 2023). "సాహితీవేత్త ఆచార్య రవ్వా శ్రీహరి కన్నుమూత". Archived from the original on 5 February 2024. Retrieved 5 February 2024.
{{cite news}}
: CS1 maint: numeric names: authors list (link)