రహదారి ప్రమాదము

వికీపీడియా నుండి
యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లో ప్రమాదాలకు గురైన కొన్ని కార్లను రహదారి కూడలి వద్ద ప్రదర్శించుతున్నారు. ప్రయాణీకులలో భద్రత అవసరం పట్ల అవగాహనను పెంచడానికి ఇలా చేస్తున్నారు

రహదారి ప్రమాదాలు (Road accident) రహదారి (Road) మీద సంభవించే ప్రమాదాలు (Accidents).

రహదారి ప్రమాదాలలో వాహనాలు ఒకదానినొకటి గాని, లేదా రహదారి మీద నడిచే పాదాచారుల్ని లేదా జంతువుల్ని ఢీకొని తద్వారా గాయాలు, ఆస్తినష్టం లేదా మరణం సంభవించిన సంఘటనలు.

[మార్చు] కారణాలు

[మార్చు] చోదకుని వైఫల్యాలు

రహదారి మీద వాహనాలు నడిపే వ్యక్తుల సామర్ధ్యం వారి యొక్క భౌతిక మరియు మానసిక స్థితిగతుల మీద ఆధారపడి ఉంటుంది. పరిశోధనలు[1] కొన్ని ముఖ్యమైన కారణాలను గుర్తించాయి:

  • దృష్టి లోపాలు లేదా శారీరిక వైకల్యాలు - ఈ కారణాల వలన జరిగే ప్రమాదాలను నివారించడానికి చాలా అధికార సంస్థలు విపులమైన పరీక్షలు నిర్వహిస్తుంటారు. కొన్ని విధాలైన వైకల్యాలున్నవారు తమకు అనుగుణంగా వాహనాలలో ప్రత్యేకమైన మార్పులు చేసుకోవలసి ఉంటుంది;
  • వృద్ధాప్యం - ఈ కారణాల వలన జరిగే ప్రమాదాలను నివారించడానికి అధికార సంస్థలు ఒక వయసు మించిన చోదకులు తిరిగి పరీక్షలకు హాజరు కావలసి ఉంటుంది. వేగం, దృష్టి సునిశితలను ప్రత్యేకంగా పరీక్షిస్తుంటారు. ;
  • అలసట - ఆపకుండా ఎక్కువ దూరం వాహనాన్ని నడపడం, నిద్రలేమి, ఇతర కారణాలవలన అలసట వంటివాటి వలన చోదకుని ఏకాగ్రత దెబ్బ తింటుంది. కనుక ప్రతి రెండు గంటల తరువాత కనీసం 15 నిముషాలు విశ్రాంతి తీసుకోవడం మంచిదని అంటారు.
  • మద్యపానం వంటి మత్తు పదార్ధాల సేవనం. ;
  • కొన్ని మందుల వాడకం - ఉదాహరణకు జలుబు, జ్వరం, వంటి నొప్పులు వంటి అనారోగ్యాలకు వాడే మందులు మత్తును కలుగజేస్తాయి.
ఒక నిముషం సమయం ఆదాచేయడం ఇంతదాకా తెస్తుందని ఒక హెచ్చరిక
ప్రమాదానికి గురైన ఒక కారు

[మార్చు] మూలాలు

  1. Research projects, Theme 3: Impairment. UK Department for Transport. తీసుకొన్న తేదీ: 2008-01-01.
వ్యక్తిగత పరికరాలు
నేంస్పేసులు

వైవిధ్యాలు
పేజీకి సంభందించిన లింకులు
చర్యలు
మార్గదర్శకము
పరస్పరక్రియ
పరికరాల పెట్టె
ఇతర భాషలు