రాగ్నర్ ఫ్రిష్
వికీపీడియా నుండి
| ఈ వ్యాసము మొలక (ప్రాథమిక దశలో ఉన్నది). ఈ మొలకను వ్యాసంగా విస్తరించి, ఈ మూసను తొలగించండి. మరిన్ని వివరాల కోసం చర్చా పేజిని లేదా తెవికీ మొలకలను చూడండి. |
నార్వే ఆర్థికవేత్త అయిన రాగ్నర్ ఫ్రిష్ మార్చి 3,1895 న నార్వే రాజధాని ఓస్లో లో జన్మించాడు. ఓస్లో విశ్వవిద్యాలయంలో విద్యనభ్యసించినాడు. 1930 లలో ఆర్థిక సమస్యల సాధనకై గణాంక శాస్త్ర ఆధారిత ఫార్మూలాను ఉపయోగించే ఎకనామెట్రిక్స్ (Econometrics) శాస్త్రానికి అంకురార్పణ చేసినాడు. 1955 లో ఎకనమెట్రికా అనే జర్నల్ కు ఎడిటర్ గా పనిచేసినాడు. అర్థశాస్త్రంలో ఇతను చేసిన పైశోధనలకు గాను 1969 లో అర్థశాస్త్రపు మొట్టమొదటి నోబెల్ బహుమతి జాన్ టింబర్జెన్ తో కల్సి పంచుకున్నాడు. ఇతను జనవరి 31, 1973 న మరణించాడు.