రామారెడ్డి మండలం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
రామారెడ్డి
—  మండలం  —
తెలంగాణ పటంలో కామారెడ్డి జిల్లా, రామారెడ్డి స్థానాలు
తెలంగాణ పటంలో కామారెడ్డి జిల్లా, రామారెడ్డి స్థానాలు
తెలంగాణ పటంలో కామారెడ్డి జిల్లా, రామారెడ్డి స్థానాలు
రాష్ట్రం తెలంగాణ
జిల్లా కామారెడ్డి జిల్లా
మండల కేంద్రం రామారెడ్డి
గ్రామాలు 15
ప్రభుత్వం
 - మండలాధ్యక్షుడు
వైశాల్యము
 - మొత్తం 170 km² (65.6 sq mi)
జనాభా (2016)
 - మొత్తం 35,928
 - పురుషులు 17,649
 - స్త్రీలు 18,279
పిన్‌కోడ్ {{{pincode}}}


రామారెడ్డి మండలం, తెలంగాణ రాష్ట్రం, కామారెడ్డి జిల్లాకిు చెందిన మండలం.[1]ఇది సమీప పట్టణమైన కామారెడ్డి నుండి 11 కి. మీ. దూరంలో ఉంది. 2016 లో జరిగిన జిల్లాల పునర్వ్యవస్థీకరణలో భాగంగా ఈ మండలాన్ని ఏర్పరచారు. [2] ఇందులో 15 గ్రామాలున్నాయి. దానికి ముందు ఈ మండలం నిజామాబాదు జిల్లా లో ఉండేది. [3] ప్రస్తుతం ఈ మండలం కామారెడ్డి రెవెన్యూ డివిజనులో భాగం. పునర్వ్యవస్థీకరణకు ముందు కూడా ఇదే డివిజనులో ఉండేది.ఈ మండలంలో 15   రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి.నిర్జన గ్రామాలు లేవు.మండల కేంద్రం రామారెడ్డి.

గణాంకాలు[మార్చు]

2016 లో జరిగిన పునర్వ్యవస్థీకరణలో ఏర్పడిన ఈ మండల వైశాల్యం 170 చ.కి.మీ. కాగా, జనాభా 35,928. జనాభాలో పురుషులు 17,649 కాగా, స్త్రీల సంఖ్య 18,279. మండలంలో 8,518 గృహాలున్నాయి.[4]

2016 లో ఏర్పడిన కొత్త మండలం[మార్చు]

లోగడ రామారెడ్డి  గ్రామం నిజామాబాదు జిల్లా కామారెడ్డి రెవెన్యూ డివిజను పరిధిలోని సదాశివనగర్ మండల పరిధిలో ఉంది. 2014 లో తెలంగాణా ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తరువాత మొదటిసారిగా 2016 లో ప్రభుత్వం నూతన జిల్లాలు, రెవెన్యూ డివిజన్లు, మండలాల ఏర్పాటులో భాగంగా రామారెడ్డి గ్రామాన్ని నూతన మండల కేంద్రంగా కొత్తగా ఏర్పడిన కామారెడ్డి జిల్లా, కామారెడ్డి రెవెన్యూ డివిజను పరిధి క్రింద 1+14 (పదిహేను) గ్రామాలుతో నూతన మండలంగా ది.11.10.2016 నుండి అమలులోకి తెస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.[1]

మండలం లోని గ్రామాలు[మార్చు]

రెవెన్యూ గ్రామాలు[మార్చు]

  1. రామారెడ్డి
  2. గిద్ద
  3. రాధాయిపల్లె
  4. ఉప్పల్‌వాయి
  5. మోషంపూర్
  6. పోసానిపేట
  7. గొల్లపల్లె
  8. ఇస్సన్నపల్లె
  9. ఖన్నాపూర్
  10. రంగంపేట
  11. మద్దికుంట
  12. రెడ్డిపేట
  13. ఘన్‌పుర్ (ఆర్)
  14. అన్నారం

మూలాలు[మార్చు]

  1. 1.0 1.1 "ఆర్కైవ్ నకలు" (PDF). Archived from the original (PDF) on 2019-10-22. Retrieved 2019-02-07.
  2. "కామారెడ్డి జిల్లా" (PDF). తెలంగాణ గనుల శాఖ. Archived (PDF) from the original on 2021-01-06. Retrieved 2021-01-06. {{cite web}}: |archive-date= / |archive-url= timestamp mismatch; 2021-12-20 suggested (help)
  3. "కామారెడ్డి జిల్లా" (PDF). తెలంగాణ గనుల శాఖ. Archived (PDF) from the original on 2021-01-06. Retrieved 2021-01-06. {{cite web}}: |archive-date= / |archive-url= timestamp mismatch; 2021-12-20 suggested (help)
  4. "తెలంగాణ డిస్ట్రిక్ట్ అండ్ మండల్ షేప్ ఫైల్స్". ఓపెన్ డేటా తెలంగాణ. Archived from the original on 2022-07-17. Retrieved 2022-07-17.

వెలుపలి లంకెలు[మార్చు]