రేగోడు బ్రహ్మంగారి మఠం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
రేగోడు బ్రహ్మంగారి మఠం
Lua error in మాడ్యూల్:Location_map at line 391: Seconds were provided for longitude without minutes also being provided.
స్థానం
దేశం:భారతదేశం
రాష్ట్రం:తెలంగాణ
జిల్లా:మెదక్ జిల్లా
ప్రదేశం:రేగోడు, రేగోడు మండలం
నిర్మాణశైలి, సంస్కృతి
ప్రధానదైవం:పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి

రేగోడు బ్రహ్మంగారి మఠం తెలంగాణ రాష్ట్రం, మెదక్ జిల్లా, రేగోడు మండల కేంద్రంలో ఉన్న మఠం. శతాబ్దాల క్రితం నెలకొల్పబడిన ఈ మఠం రెండో కందిమల్లయ్యపల్లెగా పిలువబడుతోంది.[1] కాలజ్ఞానాన్ని బోధించిన యోగి, హేతువాది, సంఘ సంస్కర్త అయిన పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి భవిష్యత్తుకు సంబంధించిన కాలజ్ఞానం రాసి, సా.శ. 1693లో సజీవ సమాధిలోకి వెళ్ళాడు. తరువాతికాలంలో కందిమల్లయపల్లె బ్రహ్మంగారిమఠంగా ప్రసిద్ధి చెందింది.

చరిత్ర[మార్చు]

పూర్వకాలంలో ఈ ప్రాంతంలో శరబాక లింగమయ్య అనే నాటువైద్యుడు ఉండేవాడు. ఆ సమయంలో రేగోడు ప్రాంతంలో కలరా వచ్చి, అనేకమంది చనిపోయారు. నాటువైద్యుడైన లింగమయ్య ఎంత ప్రయత్నం చేసినా కలరా తగ్గలేదు. అప్పుడు లింగమయ్య కడప జిల్లా, బ్రహ్మంగారిమఠంలోని బ్రహ్మంగారి మఠానికి వెళ్ళి, అక్కడి మఠాధిపతిని కలిసి కలరా గురించి విన్నవించాడు. ఆ మఠాధిపతి ఆదేశం ప్రకారం రేగోడులో ఒక మఠాన్ని నెలకొల్పాడు. అప్పుడు కలరా తీవ్రత తగ్గింది. కొంతకాలం తరువాత లింగమయ్య ఈ మఠం ప్రాంగణంలోనే సజీవ సమాధి అయ్యాడు.[1]

ఉత్సవాలు[మార్చు]

ప్రతి సంవత్సరం వీరబ్రహ్మేంద్రస్వామి అవతరించిన కార్తీక శుక్ల ద్వాదశి నాడు ఉత్సవాలు, ప్రత్యేక పూజలు నిర్వహించబడుతున్నాయి. ఉత్సవాల సమయంలో చుట్టుపక్కల గ్రామాల రైతులు ఎడ్లబండ్ల ప్రదర్శన చేస్తారు. వైశాఖ శుద్ధ పంచమి మొదలు ఆరు రోజులపాటు జాతర చేస్తారు. ఈ జాతరలో ప్రతిరోజూ నాటకాలు ప్రదర్శిస్తారు.[1]

మూలాలు[మార్చు]

  1. 1.0 1.1 1.2 నమస్తే తెలంగాణ, బతుకమ్మ (ఆదివారం సంచిక) (2021-12-12). "తెలంగాణ‌లో ఉన్న బ్ర‌హ్మంగారి మ‌ఠం గురించి తెలుసా?". Namasthe Telangana (in అమెరికన్ ఇంగ్లీష్). Archived from the original on 2021-12-12. Retrieved 2021-12-13.